ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, శృతీ హాసన్ జంటగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం సలార్. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా అన్ని లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ అమేజాన్ ప్రైమ్ గట్టిగా ట్రై చేస్తోందట. ఎన్నడూ లేని విధంగా ఏకంగా వంద కోట్ల రూపాయల భారీమొత్తాన్ని ఆఫర్ చేసినట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్స్ నటించిన చిత్రాలకు సైతం అమేజాన్ ఓటీటీ నుంచి ఈ రేంజ్ ఆఫర్స్ ఇంతవరకు రాలేదట. అయితే ప్రభాస్‌ ఇప్పుడు సౌత్ ప్లస్ నార్త్ టోటల్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకోసమే సలార్ కోసం 100 కోట్లు పెట్టేందుకు రెడీఅవుతోందట అమేజాన్. ప్రసుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

2022 ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది సలార్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , సూపర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ అంచనాలతో రూపొందుతుంది ఈ చిత్రం. అగ్ర‌ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ‘స‌లార్‌’ను నిర్మిస్తోంది. హెవీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ అంశాలతో తెరకెక్కుతున్న సలార్….ఈమధ్యే రామగుండంలో ఫస్ట్ షెడ్యుల్ ను పూర్తి చేసుకుంది.

బాలీవుడ్ దృశ్యం
దృశ్యం -2 హిందీ రీమేక్ పనులు కూడా మొదలయ్యాయి. మొదటి పార్ట్ లో నటించిన అజయ్ దేవగణ్, శ్రీయ, టబూ..ఇతర నటీనటులందరూ ఇందులోనూ కనిపించనున్నారు.
రౌడీ సిఎం…
అభిషేక్‌బచ్చన్‌హీరోగా ‘దస్వీ’ అనే హిందీ చిత్రం ప్రారంభమైంది. తుషార్‌జొలాతా దర్శకత్వంలో టెన్త్‌ఫెయిలైన గంగా రౌమ్‌చౌదరి అనే రౌడీగా అభిషేక్‌కనిపించనున్నారు. ఇందులో యామీ గౌతమ్ హీరోయిన్.
ర్యాపో కుదిరిందిగా…
శృతీ హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతనుతో కలిసి ఓ మ్యూజిక్ వీడియో చేస్తున్నారు. రీసెంట్ గా ర్యాప్ పాడుతున్న శాంతనుతో ఉన్న వీడియోను ఆమె పోస్ట్ చేసారు.
ఇన్వెస్టిగేటివ్‌కామెడీ…
వో లడ్కీ హై కహాన్ అనే కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు తాప్సీ. ఈ ఇన్వెస్టిగేటివ్‌కామెడీ మూవీలో తాప్సీ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు.
మంకీ లవ్
బాలీవుడ్‌కథానాయిక బిపాసా బసు తన భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌చేస్తున్నారు. అక్కడి బీచ్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌చేస్తూ ‘మంకీ లవ్’ అంటూ చెప్పుకొచ్చారు.

సలార్ మూవీ మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభాస్ కోసం మాత్రమే ఎక్స్ క్లూజివ్ గా రాసుకున్న సలార్ కథ అద్దిరిపోతుందని రీసెంట్ గా ప్రకటించి మరింత ఇంట్రెస్ట్ పెంచారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. గోదావరిఖని బొగ్గుగనుల్లో షూటింగ్ చేస్తున్న డార్లింగ్ ఫస్ట్ లుక్ కి సైతం విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. అటు శృతీహాసన్ సైతం ఎన్నడూ కనిపించని విధంగా ఉంటుంది నా రోల్ అంటూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతలో ప్రభాస్ సరసన గ్లోబల్ స్టార్ చిందులేస్తారనే వార్తతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు..హాలీవుడ్ లో సైతం సినిమాలు చేస్తూ ప్రపంచం చూపును తనవైపుకు తిప్పుకుంటోది ప్రియాంక చోప్రా. ఇప్పుడు ప్యాన్ ఇండియన్ మూవీ సలార్ లోనూ నటించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ప్రభాస్ సరసన ఓ స్పెషల్ సాంగ్ లో ప్రియాంక కనిపిస్తుందనే న్యూస్ వైరలవుతోంది. అయితే ఈ ట్రెండింగ్ న్యూస్ గురింటి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇదే నిజమైతే దాదాపు 9ఏళ్ల తర్వాత టాలీవుడ్ హీరో పక్కన ప్రియాంక చోప్రాను చూడొచ్చు. గతంలో రామ్ చరణ్ జంజీర్ తెలుగు తుఫాన్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు ప్రభాస్ సరసన అంటుంటే డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

క్రాక్ జోష్ తర్వాత వకీల్ సాబ్, సలార్, పిట్ట కథలు అంటూ దూసుకుపోతుంది శృతీ హాసన్. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత శృతీ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. బ్రిటీష్ బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో విడిపోయాక ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టింది. కమల్ హాసన్ కూతురుగానే కాదు తనకంటూ ఓ పేరు తెచ్చుకోవాలని చూస్తోంది. అయితే మళ్లీ అమ్మడు…కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. గత కొన్నిరోజులుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శృతీ డేటింగ్ చేస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

తాజాగా సలార్ చిత్రీకరణలో పాల్గొన్న శృతీ…ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడింది. సలార్ లో చాలా విభిన్నమైన పాత్ర పోషిస్తున్నానని, ప్రభాస్ సరసన నటించడం ఆనందంగా ఉందని తెలియజేసింది. తాను వృత్తిపరమైన జీవితం కోసం చాలా కష్టపడుతున్నానని..అందరూ దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పింది. అంతేకాదు హజారికాతో ప్రేమాయణం అన్న వార్తలపై తానేమీ మాట్లాడనని…నా వ్యక్తిగత జీవితాన్ని వదిలేయండి…నా పని గురించి మాట్లాడండి అంటూ బదులిచ్చింది శృతీహాసన్.

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న శృతి హాసన్ గురించి సలార్ టీమ్ శుభవార్త ప్రకటించింది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ చిత్రంలో ప్రభాస్ జోడీగా శృతిహాసన్ నటించనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీంతో ఫస్ట్ టైం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన కనిపించబోతున్నారు శృతిహాసన్.
తక్కువ గ్యాపే ఇచ్చినా శృతికిది సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవాలి. క్రాక్ హిట్ తో శుభారంభం పలికి…వరుసగా క్రేజీ అవకాశాలను క్యాచ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన చేసిన వకీల్ సాబ్ తో త్వరలోనే థియటర్స్ కి రానున్నారు. అటు హిందీలోనూ ఈమె మంచి సినిమాలకే సైన్ చేశారు. గట్టి హిట్స్ మరో రెండు తగిలితే కమల్ తనయకిక తిరుగుండదు. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్ డే శృతీ….

మొదటిసారి ప్రభాస్ సరసన నటించబోతున్నారట శృతీహాసన్. కేజీఎఫ్ చాఫ్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్…ప్రభాస్ హీరోగా సలార్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం…పట్టాలెక్కేయడం కూడా వెంటవెంటనే జరిగిపోయాయి. సినిమాను సరికొత్తగా ప్రెజెంట్ చేసేందుకు కొత్త నటీనటులను ఎంపిక చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు.
అయితే తాజాగా కమల్ హాసన్ తనయ…ఈ ప్రాజెక్ట్ లో నటించబోతున్నారని తెలుస్తుంది. అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

మొన్నటివరకు డార్లింగ్ పక్కన బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ కనిపిస్తుందని అన్నారు. ఆ తర్వాత ఫ్రెష్ లుక్ కోసం కొత్త హీరోయిన్ నటిస్తుందని చెప్పారు. తీరా ఇప్పుడు చూస్తే శృతీ హాసన్ సంప్రదించారనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ప్రభాస్, శృతీల జోడీ ఫస్ట్ టైమ్ జతకట్టబోతుంది. శృతీ కూడా ఓ పాన్ ఇండియన్ ఫిల్మ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. దీంతో ఓ పాన్ ఇండియన్ ఫిల్మ్…అదీ ప్రభాస్ సరసన…మళ్లీ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ కావడంతో ఎగిరి గంతేసి మరీ ఓకే చెప్పినట్టు టాక్. చూద్దాం మరి ఏం జరగబోతుందో….

నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి….ఈ నలుగురు దర్శకులు కలిసి నాలుగు పిట్ట కథల్ని తెరకెక్కించారు. అదీ వెబ్ సిరీస్ కోసం. అవును ‘పిట్టకథలు’ పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం హిందీ సూపర్ హిట్ లస్ట్ స్టోరీస్ ను రీమేక్ చేసారు వీళ్లు. తాజాగా రిలీజైన ఈ మూవీ టీజర్ హాట్ టాపిక గా మారింది.
తరుణ్ భాస్కర్ కథలో మంచు లక్ష్మి… నందినిరెడ్డి కథలో అమలాపాల్, జగపతిబాబు…నాగ్ అశ్విన్ కథలో శృతీహాసన్…సంకల్ప్ రెడ్డి కథలో సత్యదేవ్, ఈశారెబ్బా వంటివారు కీ రోల్స్ ప్లే చేసారు. టీజర్ చూస్తుంటేనే ఎంత బోల్డ్ గా ఈ సిరీస్ ఉండబోతుందో అర్ధమవుతుంది. ఒక్క మంచులక్ష్మి స్టోరీలో తప్ప మిగిలిన మూడింట్లో హాట్ సన్నివేషాలు బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది.

Source: Netflix


నలుగురు మహిళలు, నాలుగు విభిన్న కథలు… వారి జీవితాల్లోని ప్రేమ, రకరకాల ఎమోషన్స్ వంటి వాటికి …ఈ నలుగురికి మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటన్నదే పిట్టకథల కథాంశం. ఈ మూవీ ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్ కానుంది. మరి డైరెక్ట్ తెలుగు సిరీస్ అంటూ హడావుడి చేస్తున్న నెట్ ఫ్లిక్స్ కి ఈ పిట్ట కథలు ఎంతలా హెల్ప్ అవుతాయో చూడాలి.

కథ, కథనాలను నమ్ముకోకుండా వడ్డించిన సరుకులో హీరోయిన్ టేస్ట్ కుదరలేదని…తప్పించుకుంటారు కొంతమంది దర్శకనిర్మాతలు. అప్పుడలాగే శృతీహాసన్ పై ఐరన్ లెగ్ ముద్రవేశారు. అయితే కొన్ని హిట్స్ తర్వాత కొన్ని ఫ్లాప్ లు చూసిన శృతీ…పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయింది. అయితే ఇప్పుడీ సుందరిపై కొత్తగా మరో కహానీ అల్లుతున్నారు.
నేరుగా హీరోయిన్ గా నటిస్తే శృతీకి కలిసిరాదని…ఫ్లాప్స్ లో ఉన్న హీరోతో జతకడితే…ఆ హీరోకి, ఈ హీరోయిన్ కి బ్లాక్ బస్టర్ దక్కుతుందని చెబుతున్నారు. కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఫస్ట్ హిట్ అందుకుంది గబ్బర్ సింగ్ తో. ఈ సినిమా వరకు పవన్ కల్యాణ్ కూడా అనేక అపజయాలను చవిచూసారు. ఇక నేనొక్కడినే, ఆగడు వంటి వరుస పరాజయాలతో బ్రేక్ పడిన మహేశ్ బాబు మళ్లీ హిట్ కొట్టింది శ్రీమంతుడితోనే. మరి ఇందులో హీరోయిన్ శృతీహాసన్.
మాస్ రాజా రవితేజనే తీసుకుందాం. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ అంటోనీ, డిస్కోరాజా సినిమాలతో కొంతకాలం నుంచి సరైన హిట్ లేదు. ఇప్పుడు శృతీతో కలిసి క్రాక్ ని దించాడు రంగంలోకి. సూపర్ హిట్టై కూర్చుంది క్రాక్.
సో…ఈ రకంగా వరుస ఫ్లాప్స్ ఉన్న హీరోలు…శృతీని ఎంగేజ్ చేసుకుంటే విజయం దక్కుతుందని కథలు చెప్తున్నారు. సరే ఇలాగైనా మళ్లీ శృతీ బిజీగా మారుతుంది. అవును..పవర్ స్టార్ సైతం ఇప్పుడు అపజయాలతోనే ఉన్నారు. ఈ లక్కీ సెన్స్ ప్రకారం వకీల్ సాబ్ సూపర్ హిట్టవ్వాలి. చూద్దాం ఏం జరుగబోతుందో…