తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సాంగ్ విడుదల చేసారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సందర్భంగా మార్చి 26న విడుదలవుతున్న రంగ్ దే మూవీ యూనిట్ కు అభినందనలు తెలియజేసారు. రీసెంట్ గా రంగ్ దే మూవీ నుంచి విడుదలైన రెండు పాటలకు ఇటు మ్యూజిక్ లవర్స్ నుంచి, అటు ఆడియెన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్న తరుణంలో ఈ చిత్రం నుంచి మరో గీతం లిరికల్ వీడియో రూపంలో ఈరోజు విడుదల అయింది. చిత్ర కథ ప్రకారం సందర్భోచితంగా వచ్చే ‘రంగ్ దే’ లోని ఈ గీతం వివరాల్లోకి వెళితే

“నా కనులు ఎపుడూ కననే కనని
హృదయ మెపుడూ విననే వినని
పెదవు లెపుడూ అననే అనని
అద్భుతం చూస్తూ ఉన్నా…”
అంటూ పల్లవితో సాగే ఈ గీతానికి శ్రీమణి లిరిక్స్ అందించారు. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఉప్పెన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన చిత్రమిది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Source: Aditya music