మెగాపవర్ స్టార్ బర్త్ డే స్పెషల్ గా అటు త్రిపుల్ ఆర్…ఇటు ఆచార్య నుంచి ఫస్ట్ లుక్స్ వచ్చేసాయి. మెగాభిమానుల్ని రెండూ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రెండింటితో పాటూ చిరూ షేర్ చేసిన ఓ ఎమోషనల్ వీడియో ప్రెజెంట్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

ట్విటర్‌ వేదికగా విషెస్ వీడియో పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు చిరంజీవి. ‘హ్యాపీ బర్త్‌డే మై బాయ్’‌ అంటూ చిరూ షేర్ చేసిన వీడియో… మెగా అభిమానులను ఎమోషనల్ గా థ్రిల్ చేసింది. ఇక ఆచార్య నుంచి సిద్ధ ఫస్ట్ లుక్ పోస్ట్ చేస్తూ… “నీతో నటించాలన్న కోరిక నెరవేరింది నాన్న… ఇంతకు మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది” అంటూ ట్వీట్ చేసారు రామ్ చరణ్.

చిన్నప్పుడు చరణ్‌ చిరూకు గొడుగు పట్టిన పిక్ తో పాటు.. పెద్దాయ్యాక తండ్రికి గొడుగు పడుతున్న మరో రెండు ఆచార్య సెట్ లోని ఫొటోలను ఇందులో చూపించారు. ‘అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడు కేరింగ్‌ సన్‌’ అంటూ ఈ వీడియోని ఎండ్ చేసారు చిరంజీవి..