రజనీకాంత్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతిబాబు కనిపించనున్నారు. రీసెంట్ గా ఈ సంగతిని మూవీ ప్రొడక్షన్ హౌజ్ తన ట్విటర్‌లో ప్రకటించింది. జగపతిబాబు కోలీవుడ్ సినిమాల్లో నటించడం…అందులో రజినితో కలిసి నటించడం కూడా కొత్తేమీ కాదు. గతంలో ఆయన రజనీకాంత్‌ కాంబినేషన్ లో ‘కథానాయకుడు’, ‘లింగ’ సినిమాల్లో నటించారు.

ఇక ఇప్పుడు అన్నాత్తే కోసం మరోసారి కలిసి కనిపించబోతున్నారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌ నెలలో షూటింగ్‌ను తిరిగి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించగా, కరోనా కారణంగా మళ్ళీ షూటింగ్ వాయిదా పడింది. తిరిగి ఈమధ్యే చెన్నైలో చిత్రీకరణ మొదలు కాగా, ప్రధాన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కళానిధి మారన్‌ సమర్పిస్తుండగా… సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, నయనతార, ఖుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్, రోబో శంకర్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం 2021లోనే నవంబర్‌ 4వ తేదీన దీపావళి ప్రత్యేకంగా ప్రేక్షకులు ముందుకు రానుంది.

పెద్దన్నయ్య అంటే నందమూరి బాలకృష్ణ సినిమా కాదు. రజినీకాంత్ ‘అన్నాత్తే’. అన్నాత్తే అంటే తెలుగులో పెద్దన్నయ్య. అవును రజినీకాంత్ తిరిగి అన్నాత్తే చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ తదితరులు నటిస్తున్నారు. గతేడాది డిసెంబరులో హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అన్నాత్తే’ చిత్ర షూటింగ్‌ను లాక్ డౌన్ తర్వాత స్టార్ట్‌ చేశారు. కానీ మూవీ యూనిట్ లో కొందరు కరోనా బారిన పడటంతో చిత్రీకరణ నిలిచిపోయింది. అదే సమయంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి కుదుటపడ్డాక చెన్నై చేరుకున్న రజినీకాంత్…మళ్లీ షూటింగ్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారట. దీంతో అన్నాత్తేను రీస్టార్ట్ చేసేందుకు డైరెక్టర్ శివ ప్లాన్ చేస్తున్నారు. మార్చి 15వ తేదీన షూటింగ్ ఆరంభించడానికి రెడీ చేస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌లోనే సూపర్ స్టార్ కూడా పాల్గొనబోతున్నారట. ఇప్పటికే సినిమా చిత్రీకరణకు బాగా ఆలస్యమైందని…నటీనటుల కాల్షీట్స్‌ సమస్య తలెత్తకుండా అన్నాత్తే షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ నవంబరు 4న ‘అన్నాత్తే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

రజనీకాంత్ .. నడిచొచ్చే ఎనర్జీ. 70 కి దగ్గరవుతున్నా..ఇంకా అదే ఎనర్జీ తో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్నారు. అయితే ఈ ఎనర్జీ ఈ మధ్య కాస్త డల్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో రజనీకాంత్ కి హెల్త్ బాలేకపోవడంతో అటు పొలిటికల్ స్పీడ్ కి , ఇటు సినిమాల స్పీడ్ కి బ్రేక్ పడింది. దాంతో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు .

దాదాపు రెండు నెలలనుంచి ఎటువంటి అప్ డేట్స్ ఇవ్వని రజనీకాంత్ .. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. అంతకుముందు అన్నాత్తే మూవీ కోసం రోజుకి 14 గంటలు కష్టపడిన రజనీకాంత్.. హెల్త్ బాలేకపోవడంతో షూటింగ్ ని కూడా పక్కన పెట్టేశారు. ఇక ఈ సినిమా ఇప్పట్లో ఉండదనుకున్నారు అంతా. అయితే రజనీ ఈ మన్త్ ఎండ్ కి గానీ , నెక్ట్స్ మన్త్ ఫస్ట్ వీక్ లో గానీ షూటింగ్ కి అటెండ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు.

శివ డైరెక్షన్లో బారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న అన్నాత్తే మూవీ ని దీపావళి కానుకగా నవంబర్ 4 న రిలీజ్ చేస్తున్నారు. ఇంకా 40 పర్సెంట్ షూటింగ్ మాత్రమే మిగిలున్న ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చెయ్యడానికి మళ్లీ రెడీ అవుతున్నారు రజనీ. అంతేకాదు .. ఈ సినిమా కంప్లీషన్ తర్వాత యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో మరో సినిమా చెయ్యడానికి సిద్దమవుతున్నారు తలైవా. ఇలా లేట్ వయసులో కూడా యంగ్ జనరేషన్ తో పోటీ పడుతూ మళ్లీ కమ్ బ్యాక్ అవుతున్నారు రజనీకాంత్.