సెన్సేషనల్ డైరెక్టర్, మెగాపవర్ స్టార్ కాంబోమూవీపై గతకొన్నిరోజులుగా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. 100కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఫిక్సయ్యారు. అయితే తమన్ క్రేజీ మ్యూజిక్…శంకర్-రెహమాన్ కాంబోని మరిపించగలదా అన్న డౌట్స్ ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ఎందుకంటే శంకర్ సినిమాలు దాదాపు ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలోనే వచ్చాయి. అపరిచితుడు, స్నేహితుడు సినిమాలో హరీష్ జైరాజ్ సంగీతంలో రాగా…ఇండియన్ 2 కోసం అనిరుథ్ రవిచంద్రన్ ను తీసుకున్నారు. ఇప్పుడిక చరణ్ మూవీకోసం తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

రెహమాన్ తో సంగీతం అంటే కాస్త టైం పడుతోంది. తనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కంపోజ్ చేస్తారు. కానీ ఇక్కడ నిర్మాత దిల్ రాజు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తమన్ అయితే బెటర్ ఆప్షన్ అని ఆలోచించారట. అందుకే శంకర్ లైన్ లోకి తమన్ వచ్చిపడ్డారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై స్టే విధించాలని భారతీయుడు -2 నిర్మాతలు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అయితే కోర్టు శంకర్ కు స్టే విధించకుండా సమాధానం చెప్పాలని మాత్రం ఆదేశించింది. దాదాపు 180కోట్లు ఖర్చుపెట్టి, 40కోట్లకు గానూ 16కోట్ల పారితోషికం తీసుకొని మధ్యలో భారతీయుడుని వదిలేయడం పద్ధతి కాదన్నది నిర్మాతల వాదన. మరి శంకర్ ఏం చెబుతాడో చూడాలి.