యాక్టర్ సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.  కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.  ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అనేకమంది సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.  తమవంతు సహాయాన్ని అందించారు.  వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది.  ఆయన చూపిన చొరవ మూలంగా ఎందరో తమవారిని చేరుకున్నారు.  లాక్ డౌన్ మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక మంది సోనూ సూద్ సాయంతో ఊరట పొందారు.  సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ను కొనియాడింది. 

ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూ సూద్ బొమ్మను వేశారు.  ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూ సూద్ అనే క్యాప్షన్ వేశారు.  ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.  లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా పూనుకుని 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు.  రష్యా, ఉజెబికిస్థాన్, మనిల, ఇంకొన్ని దేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు.  

స్పైస్ జెట్ సంస్థ తనకు ఇచ్చిన ఈ గౌరవం పట్ల సోనూ సూద్ చాలా సంతోషంగా ఉన్నారు.  తనతో కలిసి లాక్ డౌన్ సమయంలో స్పైస్ జెట్ చేసిన సేవలను గుర్తుచేసుకున్న సూనూ సూద్ ఇక మీదట కూడ ఇలాగే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేయడానికి కృషి చేస్తానని అన్నారు.  

సోనూసూద్ దాన‌గుణం… ధాతృత్వం కొన‌సాగుతోంది. త‌న సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌తీరోజూ.. ఏదో ఓ ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తున్నాడు సోనూ. తాజాగా ఆచార్య‌ సెట్లోనూ త‌న ధాతృత్వం కొన‌సాగించాడు. ఆచార్య టీమ్ కి షాక్ ఇచ్చాడు. సెట్లోని వంద మందికి వంద సెల్‌ఫోన్లు బ‌హుమ‌తిగా ఇచ్చాడు. సెట్ బోయ్స్‌, లైట్‌మెన్స్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్‌… వీళ్లంద‌రికీ.. సెట్లో సోనూ కానుక‌లు పంచాడు. సోనూ నుంచి ఊహించ‌ని బ‌హుమ‌తి రావ‌డంతో… టీమ్ అంతా హ్యాపీగా ఫీల‌వుతోంది. సాధార‌ణంగా హీరోలు షూటింగ్ చివ‌రి రోజున టీమ్ కి ఇలాంటి కానుక‌లు ఇస్తుంటారు. ఈ సినిమాలో సోనూ హీరో కాదు. ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. సెట్లో పేద క‌ళాకారుల్ని గుర్తించి, వాళ్లంద‌రికీ సెల్ ఫోన్లు కొని ఇవ్వ‌డం… త‌న చేతుల మీదుగానే వాటిని అందించ‌డం.. నిజంగా హ‌ర్షించ‌ద‌గిన విష‌యం. వెల్ డ‌న్ సోనూ.

ఎన్నో ఆశలతో హీరో కావాలని ముంబైలో అడుగుపెట్టారు సోనూ సూద్. కానీ తానొకటి తలిస్తే అన్నట్టు హీరో కాస్త విలన్ గా మారి సౌత్ ఇండస్ట్రీలోనూ మెప్పించారు. అయితే అనూహ్యంగా కరోనా వేళ 2020లో ప్రజల హృదయాల్లో నిజమైన హీరోగా పేరు సంపాదించారు. వలస కార్మికుల కన్నీటిని తుడిచిన దగ్గరి నుంచి తనకు చేతనైనంత సాయం చేస్తున్న సోనూ సూద్ ఇప్పుడు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.

నిర్మాతగా తొలి అడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు సోనూ సూద్. దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయట. ప్రజల్లో స్ఫూర్తి నింపే చిత్రాలు, తాను అనుకున్న కథల కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారట. అన్నీ కుదిరితే త్వరలోనే నటుడిగా, నిర్మాతగా ప్రేక్షకులని అలరిస్తానని ప్రకటించారు. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పుకోవాలి. ఇప్పటికే అంగీకరించిన సినిమాల్లో సోనూ సూద్ ను విలన్ గా చూపించేందుకు భయపడుతున్నారట దర్శకనిర్మాతలు. ప్రేక్షకులు అంగీకరించరన్న భావనతో సోనూ పాత్రను తిరగరాస్తున్నారట.

లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను అక్కున చేర్చుకొని బాలీవుడ్ నటుడు సోనుసూద్‌ ఆదరించిన విషయం అందరికీ తెలిసిందే. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన సోనూసూద్ కు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుడి కట్టించిన సంగతి విన్నాం. 

తాజగా హైదరాబాద్ లోని బేగంపేట కు చెందిన అనిల్ అనే యువకుడు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సోను సూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పేరు పెట్టాడు. సోను సూద్ పేరు పెట్టడంతో తనకు బిజినెస్  రెట్టింపు అయ్యిందని అనిల్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సోనూ…తన అభిమానికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా హైదరాబాద్ బేగంపేటలోని సోనూసూద్ పాస్ట్ ఫుడ్ సెంటర్ ను సడన్ విజిట్ చేశారు సోనూ సూద్. దీంతో తన అభిమాని ఆనందానికి హద్దు లేకుండా పోయింది.

Image
Image