ఓటీటీలు వేరైనా తీవ్రవాద నేపథ్యంలో వచ్చిన ది ఫ్యామిలిమెన్, స్పెషల్ ఓపిఎస్ వంటి సిరీస్ సూపర్ హిట్టయ్యాయి. జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించాయి. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు తీవ్రవాదులుగా మారుతున్నారు మన అందగత్తెలు. ఆల్రెడీ సమంతా నటించిన ‘ది ఫ్యామిలీ మెన్ -2’లో కరుడుగట్టిన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఈ మూవీ అమెజాన్ వేదికగా ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది.
ఇక పాపులర్ ఓటీటీ సిరీస్ ‘స్పెషల్ ఓపీఎస్ 2’లో తీవ్రవాదిగా నటించేందుకు సైన్ చేసారు దీపికా పదుకోన్. నీరజ్ పాండే ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు. కథ అందులోని మలుపులు బాగా నచ్చడంతో వెంటనే దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని… ఉగ్రవాదిగా నటించేందుకు అంగీకరించారని టాక్. సో ఇలా టీటౌన్, బిటౌన్ వయ్యారిభామలు….యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరించనున్నారన్నమాట.