గత వారమే రిలీజై పోటీలో నుంచి తప్పుకుని నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన సినిమా గాలి సంపత్. పర్వాలేదన్న టాక్ వచ్చినా…థియేటర్ దాకా కాదు కానీ ఓటీటీలో హాయిగా చూడొచ్చనే టాక్ సంపాదించింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రేక్షకుల ఇంటికి తీసుకొచ్చేసారు గాలి సంపత్ మేకర్స్. అయితే మొన్నటివరకు ఆహా ప్లాట్ ఫాంలోనే స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అమేజాన్ లో కూడా అనూహ్యంగా ప్రత్యక్షమైంది గాలి సంపత్. ప్రేక్షకులకు ఎక్కువ రీచ్ అయ్యేలా ఇలా ప్లాన్ చేసారట. ఇంకేం అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో రాజేంద్రప్రసాద్ నటవిశ్వరూపాన్ని చూపించిన గాలి సంపత్ ఆహా, అమేజాన్ ఓటీటీ వేదికలనే…థియేటర్లుగా మలుచుకుని ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్.

డిఫరెంట్ సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు. నటించే ప్రతీ చిత్రంలో ఏదో ఒక కొత్తదనం, ఓ ఫ్రెష్ నెస్ ఉండేలా కేర్ తీసుకుంటాడు. ప్రస్తుతం ‘గాలి సంప‌త్’ అనే వెరైటీ ప్రాజెక్ట్ చేస్తోన్న శ్రీ విష్ణు..రీసెంట్ గా మ‌రో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ తో కొత్త సినిమాను ముస్తాబుచేస్తున్నారు. తేజ మ‌ర్ని డైరెక్షన్లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ చిత్రానికి ‘అర్జున ఫ‌ల్గుణ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు.

ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ఐదుగురు వ్య‌క్తులు ప‌రుగెడుతుంటే… వాళ్లందరినీ ఓ పోలీసుల జీప్ వెంటాడుతోంది. అయితే ఆ వ్య‌క్తుల ముఖాలు క‌నిపించ‌డం లేదు కానీ… ప‌క్క‌నే ఉన్న కాలువ‌లో వారి ప్ర‌తిబింబ చిత్రాలు కనిపిస్తున్నాయి. హీరో హీరోయిన్లు, వారి ముగ్గురు స్నేహితులు..ఓ చిన్న గ్యాంగ్ పోలీసులకు దొరకకుండా పారిపోతున్నార‌నే విషయం ఆ పోస్ట‌ర్ చూస్తే అర్ధమవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్ అర్జున ఫల్గుణ మూవీపై అంచ‌నాలను పెంచుతోంది. ఇప్పటికే 75% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో.. శ్రీ విష్ణు జంటగా బ్యూటీ గర్ల్ అమృత అయ్యర్ నటిస్తోంది.