మూడేళ్ల నిరీక్షణ…అజ్ఞాతవాసి తర్వాత ఆకలి మీదున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ కే సినిమా విడుదలైనంత హైప్ తీసుకొచ్చారు. మరి మూవీ రిలీజైతే? చూస్తుంటే ఈ మేనియా ఇక్కడితో ఆగేలా లేదు. ఏప్రిల్ 9…వకీల్ సాబ్ థియేటర్లకి వచ్చే వరకు ఏం జరుగబోతుంది? పవన్ ఫ్యాన్స్ సందడి పీక్స్ కు చేరుతుందా?

పవర్ స్టార్ మేనియా షురూ అయింది. పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న వకీల్ సాబ్ ట్రైలర్ రానేవచ్చింది. హ్యాష్ వకీల్ సాబ్ ట్రైలర్ డే పేరుతో ఫ్యాన్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 1.65కోట్లకు పైగా వ్యూస్‌, 9లక్షలకు పైగా లైక్స్‌ అందుకోని రికార్డులను తిరగరాస్తోంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్ సాబ్’గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో… ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరోవైపు బాబాయ్..మైండ్ బ్లోయింగ్ అంటూ రామ్ చరణ్ ట్రైలర్ చూసి ట్వీట్ చేసారు. ట్రైలర్ కే ఇలా ఉంటే రిలీజ్ రోజు థియేటర్స్ బ్లాస్టే అంటూ బండ్ల గణేశ్ వంటి వారు కామెంట్ చేస్తున్నారు.

బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ అయినా… పవన్ ఇమేజ్ కి తగినట్టు, మన నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసారు డైరెక్టర్ వేణు శ్రీరామ్‌. కాగా నైజాం, ఈస్ట్, వైజాగ్, నెల్లూర్ ప్రాంతాల్లోని కొన్ని థియేటర్లలో వకీల్ సాబ్ ట్రైలర్ ని సరికొత్తగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సినిమా రిలీజైతే ఎలాంటి సందడి ఉంటుందో…వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ కు అంతే సరదా కనిపించింది. థియేటర్లలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ హంగామాను సృష్టించి…వకీల్ సాబ్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో చెప్పకనే చెప్పారు.

పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే మొదటి రోజు చూడాల్సిందే. ఫస్ట్ డే…ఫస్ట్ షోలో కూర్చోవల్సిందే. ఈ విషయం వకీల్ సాబ్ నిర్మాతలకు తెలుసు. అందుకే తొలిరోజే వీలైనంత కలెక్షన్స్ రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 8 అర్థరాత్రి నుంచి మూడు మిడ్‌నైట్ షోలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 1500రూపాయల టికెట్ ఫిక్స్ చేసారని టాక్. అంతేకాదు ఏప్రిల్ 9 నుంచి నార్మల్ టికెట్ 200వరకు ఉంటుందనీ చెప్తున్నారు. మరోవైపు 2వందలు కాదు, 2వేలు కాదు…తమ ఫేవరేట్ హీరో కోసం ఎంతైనా పెట్టేందుకు సిద్ధమంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

పవర్ స్టార్ మేనియా షురూఅయింది. పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న వకీల్ సాబ్ ట్రైలర్ రానేవచ్చింది. హ్యాష్ వకీల్ సాబ్ ట్రైలర్ డే పేరుతో ఫ్యాన్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ట్రైలర్ తోనే సంచలనం సృష్టిస్తోన్న వకీల్ సాబ్… రిలీజ్ రోజు కూడా ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఏంటా ట్రెండ్? అభిమానులకు పండగేనా? ఇంతకీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడు?

Source: Dil Raju

వకీల్ సాబ్ వచ్చేసాడు. వకీల్ సాబ్ గా పవన్ కల్యాణ్ అదరగొట్టారు. ఏప్రిల్ 9న థియేటర్లకు రాబోతున్న వకీల్ సాబ్…ఇప్పుడు ట్రైలర్ తోనే సందడి షురూచేసారు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ అయినా…మన నేటివిటీకి తగినట్టు కథలో మార్పులు చేసారు డైరెక్టర్ వేణు శ్రీరామ్‌. కాగా నైజాం, ఈస్ట్, వైజాగ్, నెల్లూర్ ప్రాంతాల్లోని కొన్ని థియేటర్లలో వకీల్ సాబ్ ట్రైలర్ ని సరికొత్తగా రిలీజ్ చేసారు.

వకీల్‌సాబ్‌రిలీజ్‌విషయంలో నిర్మాత దిల్‌రాజు మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. వైజాగ్‌లోని కొన్ని థియేటర్లలో విడుదల తేదికి ముందు రోజు అర్థరాత్రి 12 గంటల నుంచి మూడు మిడ్‌నైట్ షోలను ఏర్పాటు చేయనున్నారు. అభిమానుల షో గా చెప్పే ఆ షో టికెట్‌ రేట్ భారీ మొత్తంలో ఫిక్స్‌చేశారని టాక్. టికెట్ల రేట్లను సైతం పెంచుతారనే వార్త రావడంతో… మొదటి రోజు వకీల్ సాబ్‌రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు పెద్ద మొత్తంలో టికెట్ల రేట్లు పెంచడంతో వకీల్‌సాబ్ సామాన్య ప్రేక్షకులకు దూరమవుతాడనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

ఇటీవలే తన పాత్రకు డబ్బింగ్ పూర్తిచేసారు పవన్ కల్యాణ్. నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్ లో పవన్ చేస్తోన్న తొలి సినిమా వకీల్ సాబ్ కావడం విశేషం. శ్రుతిహాసన్‌పవర్ స్టార్ జోడిగా నటిస్తుండగా… నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల కీరోల్స్ ప్లే చేసారు. ఇప్పటికే తమన్‌సంగీతం అందించిన వకీల్ సాబ్ పాటలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 4న జరుగబోతున్నట్టు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ 26వ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాల జోరు పెంచిన మూవీ యూనిట్…తాజాగా రిలీజ్ చేసిన కంటిపాప లిరికల్ సాంగ్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇదిలాఉంటే వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఫంక్షన్ గురించి తాజా అప్డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. దిల్ రాజు బృందం చేస్తున్న ప్రీరిలీజ్ ఈవెంట్ సన్నాహాలు ఇప్పుడు అంతటా చర్చగా మారాయి.

‘యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్’ లో ఏప్రిల్ 3న భారీ ఎత్తున వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. కాగా అన్నయ్య ‘మెగాస్టార్ చిరంజీవి’ తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమా కోసం ముఖ్య అతిథిగా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. అతిత్వరలో దీనికి సంబంధించిన పూర్తి డిటేల్స్ తెలియనున్నాయి. అంజలి, నివేథా ధామస్, అనన్య ప్రధానపాత్రల్లో…శృతీహాసన్ ముఖ్యపాత్రలో కనిపించనున్న వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ మొత్తం 5 ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. వాటిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, అయ్యప్పయిన్ కోషియుమ్ రీమేక్ చిత్రాల్లో గ్యాప్ లేకుండా నటిస్తున్నారు.

పవర్ స్టార్ అభిమానులకు మరో శుభవార్త. సినీ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ చెప్పేసారు. ఈ చిత్రంలోని ‘సత్యమేవ జయతే’ అనే పాట లిరికల్ వీడియోను మార్చి 3వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ. బాలీవుడ్‌ హిట్ ‘పింక్‌’ రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు డైరెక్టర్ వేణుశ్రీరామ్. శ్రుతిహాసన్‌ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుండగా… అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్‌ 9న విడుదలకు రెడీఅయింది. కొన్నేళ్ల విరామం అనంతరం వకీల్ సాబ్ గా రీఎంట్రీ ఇస్తున్నారు పవర్ స్టార్. మెదటిసారి తన ఫిల్మ్ కెరీర్లో లాయర్‌ రోల్ చేస్తున్నారాయన. ఇక గతేడాది రిలీజైన ‘మగువా మగువా’ అంటూ సాగే పాట ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోగా…సత్యమేవ జయతే ఎలా ఉంటుందో చూడాలి మరి.

మారుతున్న ట్రెండ్‌ ని ఫాలో అవుతూ.. డిఫరెంట్ సినిమాలను నిర్మించాలనే తపనతో ఉన్న వారికి… స‌హకరించి నిర్మాణంలో భాగ‌స్వామి కావడానికి తాను ఎల్లప్పుడూ రెడీ అని దిల్‌రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ అగ్ర నిర్మాత… డైరెక్టర్ క్రిష్‌తో చేతులు క‌లిపారు. వీరిద్దరూ కలిసి 101 జిల్లాల‌ అంద‌గాడు సినిమాను తెరకెక్కిస్తున్నారు.

దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, క్రిష్ ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మాతలు శిరీష్, రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయి బాబు నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో రాచ‌కొండ విద్యాసాగ‌ర్ డైరెక్టర్‌గా ప‌రిచ‌యమవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఓ వైవిధ్య న‌టుడిగా, మంచి డైరెక్ట‌ర్‌గా, కథా రచయితగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ 101 జిల్లాల‌ అంద‌గాడు లో హీరోగా న‌టించాడు. ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయ్యేలా సినిమాకు హ్యూమరస్ టచ్ ఇచ్చాడు.

రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జ‌రుగుతున్నాయి. మే 7న రిలీజ్ చేసెందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అవ‌స‌రాల శ్రీనివాస్ సరసన చి.ల‌.సౌ ఫేమ్‌ రుహాని. శర్మ న‌టిస్తుంది. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ మూవీకి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని సమకూర్చారు.

అగ్ర హీరోలతో హెవీ బడ్జెట్ సినిమాలే కాదు.. యువతను, ఫ్యామిలీ ప్రేక్షకుల హృద‌యాలను తాకేలా క్యూట్ చిత్రాలను అందిస్తూ ఎన్నో బంపర్ హిట్స్ ను తమ ఖాతాలో వేసుకున్న ప్రొడక్షన్ హౌజ్… శ్రీవేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. ఓ వైపు పవన్ కల్యాణ్, రామ్ చరణ్ అంటూ సినిమాలు తెరకెక్కిస్తూనే…తాజాగా తెలుగు ఆడియెన్స్ ను మెప్పించేందుకు మ‌రో స్పెషల్ కుటుంబ కథా చిత్రం ‘షాదీ ముబారక్‌’తో త్వరలోనే రాబోతుంది.

సీరియల్స్ ఫేం వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ జంటగా నటించిన ఈ మూవీని పద్మ శ్రీ డైరెక్ట్ చేసారు. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా వ్యవహరించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబయింది ‘షాదీ ముబారక్‌. ఈ సంద‌ర్భంగా మూవీ యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే మొగలి రేకులు సీరియల్ తో మంచి పేరుతెచ్చుకొన్న సాగర్..ఇంతకుముందు హీరోగా ఓసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నడు. ప్రస్తుతం అగ్ర నిర్మాత దిల్ రాజు సహాయంతో మరోసారి రంగంలోకి దిగుతున్నాడు. చూద్దాం..ఈసారి సక్సెస్ సాధిస్తాడేమో

ఆహాచిత్రం తాజాగా చెప్పినట్టు క్రేజీ కాంబినేషన్ కి ముహూర్తం కుదిరింది. బ్యాడ్ టైమ్ నడుస్తుందనుకుంటున్న డైరెక్టర్ శంకర్ తో కలిసి ప్రాజెక్ట్ మొదలెట్టబోతున్నారు మెగాపవర్ స్టార్. దీంతో శంకర్ – చరణ్ కాంబో గురించి జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమేనని తేలింది. డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబో మూవీ గురించి ఎన్నోరోజులుగా ఓ వార్త చక్కర్లుకొడుతుంది. అయితే దానిని నిజం చేస్తూ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ స్కూల్ నుంచి చెర్రీ హీరోగా ఓ క్రేజీ మూవీ రావడం ఖాయమైంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజుతో పాటూ రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించారు. ఇది దిల్ రాజు, శిరీష్ ల నిర్మాణంలో వస్తోన్న 50వ సినిమా కాగా, చెర్రీ నటిస్తోన్న 15వ సినిమా.

ప్రస్తుతం త్రిపుల్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ తో, ఆచార్యలో తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత రెండు సూపర్ ప్రాజెక్ట్స్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. అది మనం చెప్పుకున్నట్టు శంకర్‌దర్శకత్వం వహించే సినిమా కాగా మరొకటి జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే ప్రాజెక్ట్ అని సమాచారం. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియన్ స్థాయిలో మలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తోన్న భారతీయుడు 2కి ఆది నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఓ పట్టాన ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో మరో మూవీ కోసం ప్లాన్ చేస్తున్న శంకర్…రామ్ చరణ్ ను తన స్క్రిప్ట్ తో లాక్ చేసారు. హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో మల్టీస్టారర్ గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో చెర్రీతో పాటూ కేజీఎఫ్ యష్, విజయ్ సేతుపతి కూడా కనిపిస్తారని టాక్. 2022లో పట్టాలెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఈ ఫిబ్రవరి 14న ప్రకటించనున్నారు మేకర్స్.