ఇలా మొదలైంది

పవర్ స్టార్ సినిమా కోసం ఆకలిమీదున్నారు ఫ్యాన్స్. పవన్ సినిమా ఎప్పుడొస్తుందా అని కసిగా ఎదురుచూసారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ గా హీరో కనిపించగానే ఎగిరిగంతేసారు. ఇక ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెరిగాయి. లాక్ డౌన్ తర్వాత పెద్ద హీరో సినిమా కూడా ఇదే కావడం…అందులోనూ దిల్ రాజు బ్యానర్ నుంచి రావడంతో డిస్ట్రిబ్యూటర్లు బాగానే ఆశలు పెట్టుకున్నారు. పింక్ రీమేక్ అయినా పవన్ కల్యాణ్ ఇమేజ్ దృష్ట్యా చాలా మార్పులు చేసామని ముందుగానే చెప్పారు. సినిమా మొదలైన 15నిమిషాల తర్వాతే పవర్ స్టార్ ఎంట్రీ ఉంటుందని కూడా రివీల్ చేసారు. ఇలా భారీ అంచనాల నడుమ ఈరోజు ఉదయం ప్రివ్యూలతో మొదలైన వకీల్ సాబ్ ఏ మేరకు వాదించాడో ఈ రివ్యూలో చూద్దాం.

ఇదీ కథ

ముగ్గురు ఫ్రెండ్స్ నివేదా థామస్ (పల్లవి), అంజలి (జరీనా), అనన్య నాగళ్ల (దివ్య). ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్లో ఓ చిన్న ఇంట్లో అద్దెకుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఓ రాత్రి జరిగిన ఛేదు సంఘటన నేపథ్యం కారణంగా పోలీస్ స్టేషన్ కి చేరుకుని అక్కడినుంచి కోర్టు మెట్లు సైతం ఎక్కుతారు. వీరు ఇరుకున్న హత్యాయత్నం కేసులో ఎంపి కొడుకు హస్తం ఉండటంతో వీరిని కాపాడేందుకు ఎవరూ ముందుకురారు.. .వీళ్లుండే కాలనీకి అప్పుడే వచ్చిన మాజీ లాయర్ పవన్ కల్యాణ్ (సత్యదేవ్) వీళ్ల గురించి తెలుసుకొని వీరి తరపున న్యాయం కోసం పోరాడేందుకు రెడీ అవుతాడు. అనుకోని కారణాలతో లాయర్ వృత్తిని వదిలిపెట్టి తాగుడుకు బానిసైన సత్యదేవ్…ఈ అమ్మాయిలని ఎలా కాపాడాడనేదే కథ.

ఇదీ నటన
తనకు నటన రాదంటూనే అభిమానులు ఆకట్టుకోవడంలో ముందుంటాడు పవన్ కల్యాణ్. కోర్టు మెట్ల ద్వారా నటనలో ఒక మెట్టు ఎక్కి ఫ్యాన్స్ ఆశించేదానికంటే కాస్త ఎక్కువే ఇచ్చారు. మాస్ అప్పీల్ అయినా క్లాస్ లుక్స్ అయినా నటనలో దూసుకుపోయాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో బొద్దుగా అందగా కనిపిస్తాడు. కోర్ట్ సీన్స్ లో ఆవేశంతో రగిలిపోతూ ఫ్యాన్స్ లో ఫైర్ నింపుతాడు.
నందాజీ అంటూ కోర్టులో ప్రకాశ్ రాజ్ తో పోటీపడిమరీ ఇరగదీసాడు. ఫైట్స్ విషయంలో ప్రేక్షకులల్లో ఎనర్టీ నింపి తన స్టామినా ఏమిటో చుపించాడు. ఒకరకంగా చెప్పాలంటే వకీల్ సాబ్ గా పవన్ కల్యాణ్ జీవించాడు. శృతీ హాసన్ ఉందంటే ఉంది. అందుకే ప్రమోషన్స్ లో కూడా ఎక్కడా కనిపించలేదకుంటా. పవన్ కాంబినేషన్ సీన్స్ లో శృతీ తేలిపోయింది. సినిమా రేంజ్ ను మరో లెవెల్ లోకి తీసుకెళ్లేలా నటనతో ఆకట్టుకున్నారు నివేదా, అంజలి, అనన్య. ప్రకాశ్ రాజ్ గురించి కొత్తగా ఏం చెప్పగలం. సినిమాకు ఆయన ప్లస్ అయ్యాడనడంలో సందేహం అక్కర్లేదు.

ఇదీ డైరెక్షన్ అండ్ టీమ్

పింక్ రీమేక్ అనగానే…కొంతమంది నిట్టుర్చారు. చాలామంది చూసిన సినిమాతో పవన్ కల్యాణ్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారో అని కంగారుపడ్డారు. నిజానికి రీమేక్ అంటే కత్తి మీద సామే. అందులోనూ ఏ స్టార్ హీరోతో అంటే కష్టం ఎక్కువే. అందుకే డైరెక్టర్ వేణు శ్రీరామ్ పింక్ కంటే తమిళ్ రీమేక్ మీద ఎక్కువ హోం వర్క్ చేసాడు. పవన్ సినిమా అంటే అభిమానులు ఏం కోరుకుంటారో గుర్తించి మార్పులు చేసుకున్నాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకా మంచిగా పవర్ఫుల్ గా చూపించిఉంటే బాగుండేది.

నిజానికి పింక్ సినిమా మొత్తం ఒకే టెంపోలో రన్ అవుతుంది. ఇక్కడా పవన్ కల్యాణ్ ఇమేజ్ కి అది సెట్ అవదు. చేసినా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో అన్న భయం. అందుకే శృతీ హాసన్ తో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కొన్ని మాస్ సీన్స్, ఫైట్స్ క్రియేట్ చేసాడు వేణు. ఫస్టాఫ్ లో కొంచెం తడబడట్టు అనిపించినా…సెకండ్ హాఫ్ వకీల్ సాబ్ స్థాయిని ఒక్కసారిగా పెంచింది. ఇంట్రవెల్ ట్విస్ట్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం ఓ టెంపోను మెయింటైన్ చేస్తూ పవన్ డైలాగులతో ఆద్యంతం రక్తికట్టిస్తుంది. రాజకీయలపరంగా యాక్టివ్ గా ఉన్న పవన్ తన కం బ్యాక్ సినిమాగా వకీల్ సాబ్ ను ఎంచుకోవడం చాలా మంచి నిర్ణయం.

ముందు నుంచి చెప్తున్నట్టే తమ మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పోసాడు తమన్. హీరోయిజాన్ని ఎవివేట్ చేయడంతో తమన్ సంగీతం బాగా ఉపయోగపడింది. ఇక ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పాటలకు మంచి చిత్రీకరణ తోడవడంతో స్క్రీన్ పై అందంగా కనిపించాయి. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ డిఫరెంట్ షేడ్స్ లో సినిమాను ప్రెజెంట్ చేసింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కి వంకపెట్టలేం. భారీ బడ్జెట్ పెట్టే సబ్జెక్ట్ కాదు కాబట్టి దిల్ రాజు నిర్మాతగా తనవంతు బాధ్యతను సమర్ధంగా పోషించారు.

కలిసొచ్చే అంశాలు

పవన్ కల్యాణ్ నటన
తమన్ మ్యూజిక్
కోర్ట్ రూమ్ సీన్స్
డైలాగ్స్, ఫైట్స్

కలిసిరానివి

ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్
శృతీ హాసన్ ఎపిసోడ్

ఇదీ తీర్పు

కేసే కాదు సినిమాతో గెలిచిన వకీల్ సాబ్