ప్రభాస్ తో సాహో మూవీని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజిత్.. కన్నడ స్టార్ హీరో సుదీప్ తో తన తర్వాతి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. సుజిత్ చెప్పిన కథ బాగా నచ్చడంతో సుదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. శర్వానంద్ హీరోగా తీసిన రన్ రాజా రన్ హిట్ తర్వాత అనూహ్యంగా ప్రభాస్ హీరోగా సాహో చేసే లక్కీ ఛాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్ రూపొందించిన సాహో తెలుగులో భారీ ఫ్లాప్ గా మిగిలింది. దీంతో మరో తెలుగు హీరో సుజిత్ వైపు చూడలేదు. దీంతో కన్నడ స్టార్ సుదీప్ ను తన స్టోరీతో ఫ్లాట్ చేసాడట సుజిత్. మరి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ప్రచారం జరుగుతున్న ఈ మూవీ గురించి ఎలాంటి వార్త వస్తుందో చూడాలి.

చిరూ లూసిఫర్ రీమేక్ ఆఫర్ ని రిజెక్ట్ చేసారట నయనతార. మొన్నటివరకు లూసిఫర్ రీమేక్ లో చిరంజీవికి చెల్లెలుగా నయనతార నటిస్తారనే వార్తలు చక్కర్లుకొట్టాయి. అయితే లూసిఫర్ ఒరిజనల్ మూవీలా కాకుండా ఇందులో చిరూ సరసన హీరోయిన్ ట్రాక్ యాడ్ చేసారట. ఆ హీరోయిన్ పాత్రలోనే నయన్ నటించాల్సిందిగా చిత్రయూనిట్ సంప్రదించారని టాక్. అయితే ఆ పాత్రకి ఇంప్రెస్ కాని నయనతార ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ఇక ఇలా నయన్ నో చెప్పడంతో ఇప్పుడు చిరూ సరసన నటించే మరో తార కోసం సెర్చ్ చేస్తున్నారట డైరెక్టర్ మోహన్ రాజా.

సైరా నరసింహారెడ్డిలో చిరూ సరసన నటించిన నయనతార సంగతలా ఉంటే…అదే సినిమాలో ప్రత్యేకపాత్ర పోషించిన కిచ్చా సుదీప్ కథ వేరేలా ఉంది. ఆచార్య కోసం ఈగ విలన్ వస్తున్నట్టు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ ఆచార్య సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. చిన్న పాత్రైన చాలా ప్రాధాన్యత ఉండటంతో మేకర్స్ అడగ్గానే సుదీప్ ఓకే చెప్పారని టాక్. కన్నడ పరిశ్రమలో ఇటీవలే 25 వసంతాలు పూర్తిచేసుకున్న సుదీప్… ఇప్పుడిలా ఆచార్య కోసం అడగ్గానే కాదనకుండా ఓకే చెప్పారట.

శాండిల్ వుడ్ స్టార్‌ యాక్టర్ సుదీప్‌ కి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశంలో ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ మాత్రమే సంపాందిచిన అటువంటి గుర్తింపు….ఇప్పుడు సుదీప్ సొంతమైంది. భారతీయ వెండితెరపై విలక్షణ నటుడన్న పేరుంది ఈ హీరోకి. రీసెంట్ గా ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా బిల్డింగ్ పై సుదీప్ లేజర్ షో వేసారు. ఆయన హీరోగా నటిస్తోన్న ‘విక్రాంత్‌ రోనా’ మూవీ టైటిల్‌ లోగోను, టీజర్‌ను ఈ లేజర్‌ షోతో బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ప్రపంచం మొత్తానికి ఓ కొత్త హీరో దొరికాడంటూ ప్రశంసలు కురిపించారు.

ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులు, ప్రభావిత వ్యక్తులతో పాటూ అతిముఖ్య సంఘటనలు మాత్రమే దుబాయ్ బూర్జ్ ఖలీఫా లేజర షో ద్వారా కనిపించే అదృష్టాన్ని దక్కించుకున్నాయి. ఇక ఇండియాపరంగా చూసుకుంటే షారుఖ్‌ ఖాన్ తర్వాత సుదీప్‌కే ఇంతటి ఘనత సొంతమైంది. దీంతో సుదీప్‌ ఫ్యాన్స్ ఫుల్‌ జోష్ మీదున్నారు. తాము అభిమానించే ఓ నటుడికి ఇలాంటి గౌరవం దక్కడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.