ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిళ్లలో జోరందుకుంది. సర్కారు వారి పాట తర్వాత సూపర్ స్టార్… డైరెక్టర్ సుధా కొంగరతో కలిసి వర్క్ చేస్తారని అంటున్నారు. మహేశ్‌ బాబు కోసం ఆమె ఒక సబ్జెక్ట్‌ రెడీ చేయగా…దానిని హీరో సైతం విన్నారట. ఇక దీనికి సంబంధించిన చర్చలు సైతం ఓ కొలిక్కొచ్చాయంటున్నారు. ఈ కాంబో త్వరలోనే పట్టాలెక్కినా ఆశ్చర్యపడనక్కర్లేదని ఆ వార్త సారంశం. సుధా సినిమాల్లో హీరోలకి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం లభిస్తుంది.
ఇప్పుడా ఆ అవకాశాన్ని మహేశ్ ఒదులుకునేలా లేరనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం మహేశ్ బాబు దుబాయ్ లో సర్కారు వారి పాట చిత్రీకరణలో ఉన్నారు. గీతాగోవిందం ఫేం పరశురామ్ దీనికి డైరెక్టర్. ఆకాశమే నీ హద్దురా తర్వాత సుధా కొంగర ఓటీటీ కోసం వర్క్ చేసారు కానీ నేరుగా ఏ సినిమాకు కమిట్ కాలేదు. అయితే ఆమె రాసుకున్న డిఫరెంట్ సబ్జెక్ట్…తక్కువ టైంలోనే పూర్తయ్యే ఛాన్స్ ఉండటంతో మహేశ్ నెక్ట్స్ సుధా కొంగరతోనే సినిమా చేస్తారని అంటున్నారు. ఇదే నిజమైతే మహేశ్ బాబుని ఓ సరికొత్త లుక్ లో చూసే ఛాన్స్ ప్రేక్షకులకు దక్కుతుంది.