ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు ముహూర్తం కుదిరింది. మోహన్ రాజా డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యింది. ఇక సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఇందులో ఒకప్పటి హీరోయిన్ సుహాసినితో పాటూ రీసెంట్ యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలను పోషిస్తున్నారని సమాచారం.

లూసిఫర్ రీమేక్ కి సంబంధించిన పూజా కార్యక్రమం గతంలోనే జరిగిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ లో సెట్స్ పైకి తీసుకెళ్లి…ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట మోహన్ రాజా. చిరంజీవి సూపర్ హిట్ మూవీ హిట్లర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మోహన్…ఇప్పుడు డైరెక్ట్ గా చిరూని డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో…సరికొత్తగా తెరకెక్కించేందుకు ప్రణాళిక రచిస్తున్నారట. తుది దశకు చేరుకున్న ఆచార్య అయిపోగానే…లూసిఫర్ రీమేక్ సెట్లో అడుగుపెడతారు చిరంజీవి.