మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇదే మా కథ. శ్రీకాంత్ , భూమిక ప్రధాన పాత్రల్లో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, తాన్యా హోప్ జంటగా నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. రోడ్ జర్నీ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీకి ‘రైడర్స్ స్టోరీ’ అన్నది ట్యాగ్‌లైన్‌. ఎన్‌. సుబ్ర‌హ్మ‌ణ్యమ్ ఆశీస్సుల‌తో… గురుపవన్ డైరెక్షన్లో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి.మహేష్ నిర్మాణంలో… శ్రీమతి మనోరమ సమర్పిస్తున్నారు. ఎమోషనల్ జర్నీలా సాగే ఇదే మా కథ.. థ్రిల్లింగ్ అంశాలతో అట్రాక్ట్ చేస్తుందంటున్నారు. ఇక మార్చి 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్‌. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. ఓ పోస్టర్‌ను అఫీషియల్ గా లాంచ్ చేసారు.

ఈ పోస్ట‌ర్‌లో కీ రోల్స్ చేస్తోన్న హీరో సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, భూమిక‌, హీరోయిన్ తాన్యా హోప్ మంచు ప్రాంతంలో బైక్ రైడింగ్ చేస్తూ ఆసక్తిని కలిగించారు. క్యాప్షన్ ‘అడ్వంచ‌ర్ అవైట్స్’తో మూవీపై ఆడియెన్స్ కి ఇంట్రెస్ట్ పెంచారు. జనవరి 26 రిప‌బ్లిక్ డే కానుకగా రిలీజ్ చేసిన ‘ఇదే మా క‌థ’ టీజ‌ర్‌కు సూపర్ రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ఈ టీజ‌ర్‌ చూసిన తర్వాత ప్రేక్షకులకు ఆటోమాటిక్ గా సినిమాపై అంచనాలు పెరిగాయి. సి. రామ్ ప్ర‌సాద్ అందించిన సినిమాటోగ్ర‌ఫీ , సునీల్ క‌శ్య‌ప్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తి చేస్తోంది.

Source: Aditya Music