క‌లర్ ఫోటోతో ప్రతినాయకుడిగా మెప్పించి కాస్త జోష్ పెంచారు సునీల్. కమెడియన్, హీరో ఇప్పుడు నెగెటివ్ షేడ్ రోల్స్..ఇలా పాత్ర‌ ఏదైనా నేను ఒదిగిపోగ‌లను అంటున్నారు. తాజాగా సునీల్ హీరోగా ‘వేదాంతం రాఘ‌వ‌య్య’ అనే మూవీ లాంఛ్ అయింది. ఈ చిత్రానికి డైరెక్టర్ హరీశ్ శంక‌ర్ క‌థను అందిస్తుండగా..14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది.
అయితే లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ మూవీలో సునీల్ జోడీగా జబర్దస్త్ బ్యూటీ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ హీరోయిన్ గా ఎంపికైందని టాక్‌. ఇప్పటికే డైరెక్ట‌ర్ సీ చంద్ర‌మోహ‌న్ ఆమెను కలిసి స్టోరీ వినిపించ‌ారని… గ్రీన్ సిగ్న‌ల్ కోసం ఎదురు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక సునీల్ ‘వేదాంతం రాఘవయ్య’కి సాయికార్తీక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. అతిత్వరలో రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో అనసూయ నటిస్తుందా, లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది.

’అసలేం జరిగింది‘ టీజర్ చూసి భయపడ్డారట సునీల్. హైదరాబాద్లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా వైవిధ్యమైన కాన్సెప్టుతో తీసిన ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. హీరో శ్రీరాంతో కలిసి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో నటించానని, తను మంచి నటుడని కితాబునిచ్చారు. సినిమా పాటలు మంచి మెలోడియస్ గా ఉన్నాయని, ఎక్సోడస్ మీడియా వైవిధ్యమైన సినిమాలు చేయాలంటూ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత మైనేని నీలిమా చౌదరి మాట్లాడుతూ.. సినిమా మొత్తం థ్రిల్లింగ్ గా ఉంటుందని, ఉయ్యాల శంకర్ కంపోజ్ చేసిన ఫైట్స్, ’చిన్నా‘ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుందన్నారు. సహ నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే సినిమాను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు శ్రీకర్ రెడ్డి, సంగ కుమార స్వామి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Video Copyright: Aditya