ఎంతో కాలం నుంచి ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న హీరోయిన్ చాందినికి కలర్ ఫోటోతో అదృష్టం వరించింది. ఇప్పుడిక వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘సూపర్ ఓవర్’. అయితే ఈ మూవీ ప్రెస్ మీట్ లో ఏడ్చేసారు చాందినీ. ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరించే దశలో…ఓ సీన్ వివరిస్తూ యాక్సిడెంట్ లో మరణించారు డైరెక్టర్ ‘ప్రవీణ్ వర్మ’. ఇంకా ఆ బాధ నుంచి కోలుకోలేదు చిత్రయూనిట్. అందుకే స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్నారు.

దర్శకుడు సుధీర్ వర్మ అసిస్టెంట్ గా పనిచేసారు ప్రవీణ్ వర్మ. నేరుగా ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ సూపర్ ఓవర్. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ దాన్ని ఆస్వాదించాడానికి ఆయనలేరు. ఇది నిజంగా విచారకరం. ఏదేమైనా అచ్చ తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో జనవరి 22 శుక్రవారం నుంచి అడియన్స్ ముందుకు రానుంది సూపర్ ఓవర్. నవీన్ చంద్ర , చాందిని, రాకేందు మౌళి, అజయ్ , ప్రవీణ్… లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సూపర్ ఓవర్ సినిమా ట్రైలర్ తోనే ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.

క్రికెట్ బెట్టింగ్స్ లో డబ్బులు పోగొట్టుకుని వాటిని సెట్ చెయ్యడం కోసం పోలీస్ స్టేషన్ లోనే దొంగతనానికి స్కెచ్ వెయ్యడం, తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పడిన ఇబ్బందుల్ని సూపర్ ఎక్జైటింగ్ గా చూపించారు డైరెక్టర్ ప్రవీణ్ వర్మ. ఈ మూవీ ట్రైలర్ అక్కినేని నాగచైతన్య రిలీజ్ చేశారు. అంతే కాదు ఈ సినిమా నుంచి రిలీజైన స్నీక్ పీక్ కూడా సినిమా మీద ఆసక్తిని పెంచింది. కామెడీ, థ్రిల్లింగ్, సస్పెన్స్ ..ఈ ఇంట్రస్టింగ్ సీన్స్ ఇష్టపడుతున్న వారికి తప్పక ఈ సినిమా మెప్పిస్తుందని భావిస్తున్నారు.