సరికొత్త కథాంశంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రాజెక్ట్ అలాంటి సిత్రాలు. తాజాగా ఈ సినిమా టీజర్… ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతులమీదుగా రిలీజైంది. టీజర్ చూస్తుంటే నిజంగానే కొత్తదనం బాగానే కనిపిస్తుంది. తాను రాసుకున్న కథను తానే డైరెక్ట్ చేసి చూపిస్తున్నాడు దర్శకుడు సుప్రీత్.సి.కృష్ణ. అంతేకాదు లొక్కు శ్రీ వరుణ్, రాహుల్ రెడ్డిలతో కలిసి నిర్మాత కూడా వ్యవహరించాడు. కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమాలో శ్వేతా పరషార్, ప్రవీణ్ యండమూరి, యష్ పూరీ, తన్వీ ఆకాంక్ష వంటి వారు ప్రధానపాత్రల్లో నటించారు. కార్తీక్ సాయి కుమార్ మ్యూజిక్ అందించాడు.