హీరోగా నటిస్తూనే ఇతర భాషల్లోని సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న మలయాళీ స్టార్ మోహన్‌లాల్‌. ఈమధ్యే దృశ్యం – 2తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఆయన తెలుగులో మరోసారి నటించేందుకు రెడీ అవుతున్నారని టాక్‌. అక్కినేని అఖిల్ హీరోగా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. స్పై థ్రిల్లర్‌ కథాంశంగా రాబోతున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ కీ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ఇప్పటికే ఆయనతో డిస్కషన్ కూడా చేసారట. ఈ సినిమాలో కనిపించేందుకు మోహన్‌లాల్‌ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

అమెరికన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ది బార్న్’ సిరీస్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘అఖిల్ 5’ వర్కింగ్‌ టైటిల్‌ తో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై అనిల్‌ సుంకర ప్రొడ్యూస్ చేస్తుండగా సురేందర్‌రెడ్డి సహ నిర్మాత కూడా మారుతున్నారు. అయితే ఇందులోనే వరలక్ష్మి శరత్ కుమార్ సైతం నెగెటివ్ రోల్ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వరలక్ష్మిని కూడా మూవీ యూనిట్ సంప్రదించిందని టాక్. మొత్తానికి అఖిల్ కి సపోర్ట్ గా వరలక్ష్మీతో పాటూ మోహన్ లాల్ కూడా రంగంలోకి దిగుతున్నారన్నమాట.