కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా విరాటపర్వం వాయిదాపడింది. రానా, సాయిపల్లవి జంటగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పీరియాడికల్ ఫిల్మ్ గా వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన విరాటపర్వం నిజానికి ఏప్రిల్ 30న విడుదలకావాల్సిఉంది. కానీ కొవిడ్ కేసులు అత్యంత ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అందులోనూ ప్రజలు కూడా అప్రమత్తమవుతున్నారు. ఇక సినిమా పేరుతో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక వాయిదా నిర్ణయం తీసుకుంది విరాటపర్వం యూనిట్.

వకీల్ సాబ్ తర్వాత రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ ముందు పోస్ట్ పన్ అయింది. ఆ తర్వాత నాని సరదాగా మేము చెప్పిన డేట్ కి రావడంలేదంటూ వీడియో రిలీజ్ చేసారు. ఏప్రిల్ 23న రావాల్సిన టక్ జగదీష్ అర్ధాంతరంగా ఆగిపోయాడు. ఇప్పుడు విరాటపర్వం ఆ లైన్ లో చేరింది. ముందు ముందు ఈ వరుసలోకి ఆచార్య వంటి పెద్ద పెద్ద సినిమాలొచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం…మళ్లీ ఎలాంటి రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. కరోనా తగ్గి ఓ క్లారిటీకి వచ్చాక మాత్రమే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

నేడు భారతీయ చలనచిత్ర అగ్రనిర్మాత డాక్టర్ శ్రీ రామానాయుడు గారి వర్ధంతి. టాలీవుడ్ పరిశ్రమలోకి నిర్మాతగా అడుగు వేసి… దేశవ్యాప్తంగా అనేక భాషలలో చిత్రాలు నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన ప్రొడ్యూసర్ రామానాయుడు గారు. ఫిబ్రవరి 18న రామానాయుడు గారి వర్ధంతి వేళ… ఫిల్మ్ నగర్ లో రామానాయుడు గారి విగ్రహానికి ఆయన కుమారుడు ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఘనంగా నివాళులు అందించారు.

కొరియన్ మూవీ లక్ కీ ను రీమేక్ చేస్తున్నట్టుగా అధికార ప్రకటన చేసింది సురేష్ ప్రొడక్షన్స్. కీ ఆఫ్ లైఫ్ అనే జపనీస్ సినిమాకిది రీమేక్. హీరో సెంట్రిక్ గా సాగే ఈ కామెడీ థ్రిల్లర్ లో తెలుగు హీరోని, అగ్ర దర్శకుడిని కూడా ఫైనల్ చేసారు. అయితే వాళ్లిద్దరూ ఎవరన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే రానా హీరోగా నందిని రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మిస్ గ్రానీని ఓ బేబీగా మార్చి సూపర్ హిట్ అందుకున్నారు నందినీరెడ్డి. ఇదే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ బేబీని నిర్మించింది. సమంతా ఓ రేంజ్ గుర్తింపును సంపాదించింది. ఇప్పుడిలానే హీరో బేస్డ్ మూవీ లక్ కీ ని నందినీరెడ్డి తెరకెక్కిస్తే బాగుంటుందని భావించారట సురేష్ బాబు. అందుకే ఆమెనే సంప్రదిచ్చినట్టు తెలుస్తోంది.

ఇక అన్నిరకాల ఎమోషన్స్ పలికించే ఛాన్స్ ఉంటుంది ఈ సినిమాలో హీరో పాత్రకి. రానాకి అయితే నటుడిగా మరో మెట్టు ఎక్కేందుకు తోడ్పడుతుందని అనుకుంటున్నారట. అందుకే రానాను హీరో పాత్ర కోసం ఫిక్స్ చేసినట్టు టాక్. ప్రస్తుతం లక్ కీకి సంబంధించి స్క్పిప్ట్ వర్క్ జరుగుతుంది. భారతీయ భాషలన్నింటిలోనూ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నారు సురేష్ బాబు. దీన్నో పాన్ ఇండియన్ మూవీగా మలిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.