‘రష్మిక మందన్నా’కు షాక్ ఇచ్చి ‘ప్రియాంక అరుల్ మోహన్’ కు ఓకే చెప్పారు దర్శకనిర్మాతలు. దీంతో రష్మిక చేయాల్సిన పాత్రలో ప్రియాంక కనిపించనుంది. నాని ‘గ్యాంగ్ లీడర్’ తో తెలుగుతెరకు పరిచయమై…త్వరలోనే శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రియాంక అరుల్ మోహన్. తాజాగా ఈ భామకు ‘సూర్య’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య చేయబోయే కొత్త సినిమాలో ప్రియాంకనే హీరోయిన్ గా ఫిక్సయింది.
నిజానికి సూర్య పక్కన నటించే ఛాన్స్ మొదట రష్మికా మందన్నాకు వచ్చింది. కానీ టాలీవుడ్ టు బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మికా. అంతేకాదు భారీ రెమ్యునిరేషన్ డిమాండ్ చేసిందని టాక్. ఈ కారణంగానే నిర్మాతలు రష్మికకు నో చెప్పి ప్రియాంకను తీసుకున్నట్టు కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఆకాశమే నీ హద్దురా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సూర్య… త్వరలోనే పాండిరాజ్ సినిమా సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు.