ఇస్మార్ట్‌ శంకర్‌ ఫేం నిధి అగర్వాల్‌కు ఛేదు అనుభవం ఎదురైంది. హీరో శింబుకి జంటగా నిధి అగర్వాల్‌ ‘ఈశ్వరన్‌’ అనే తమిళ్ మూవీలో నటించింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి బాగానే పేరొచ్చింది. సంక్రాంతి కానుకగా విజయ్ మాస్టర్ చిత్రానికి పోటీగా జనవరి 13న ఈశ్వరన్ రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాత బాలాజీ కబా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్… సుశీంద్రన్‌. నందితా శ్వేతా మరో హీరోయిన్ గా నటించంగా కె.భారతీరాజా వంటి సీనియర్‌ స్టార్‌ డైరెక్టరు కీలకమైన పాత్రతో నటించారు. అయితే రీసెంట్ గా జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌లో డైరెక్టర్ సుశీంద్రన్..నిధి అగర్వాల్ ను కాస్త ఇబ్బంది పెట్టాడు. ప్రెజంట్ ఈ ఇష్యూ కోలివుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈశ్వరన్‌ ఆడియో ఫంక్షన్ తాజాగా జరిగింది. హీరోయిన్ నిధి అగర్వాల్ స్టేజీపై మాట్లాడే సమయంలో.. డైరెక్టర్ సుశీంద్రన్ పదే పదే మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ‘శింబు మామా ఐ ల‌వ్యు’ అని చెప్పు అంటూ నిధిని బలవంత పెట్టారు. దీంతో ఆమె కాస్త ఇబ్బందికి గురైనట్టు కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరలయింది. వీడియో చూసిన ప్రేక్షకులు దర్శకుడి ప్రవర్తనపై కామెంట్లు విసురుతున్నారు. ఆడవాళ్లకు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ చివాట్లు పెడుతున్నారు. ఇక ఈ ఇష్యూపై సుశీంద్రన్ స్పందించారు. సినిమాలో శింబుతో నిధి ‘మామా ఐ ల‌వ్యూ’ అని చెప్పే డైలాగ్ ఉంటుంద‌ని, దాన్ని హైలైట్ చేద్దామనే అక్కడ అలా చేసానని చెప్పుకొచ్చాడు.