మొత్తానికి ప్రభాస్‌ చేతుల మీదుగా జాతి రత్నాలు ట్రైలర్‌ రిలీజైంది. దీనికి సంబంధించిన వీడియోను రెండు గంటల ముందే అప్లోడ్ చేసి ఫన్ క్రియేట్ చేసింది మూవీ యూనిట్. ఇక ఆ ట్రైలర్‌ చూసిన ప్రభాస్‌ అద్భుతంగా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ చిన్నపాటి వీడియోకే ఇంత నవ్విస్తే సినిమా…

Source: Vyjayanthi Network

ఇంకెంత బాగుంటుందో అని అభిప్రాయాన్ని తెలిపారు ప్రభాస్. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ స్టార్ నవీన్‌ పోలిశెట్టి హీరోగా… ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అనుదీప్‌ తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. ఫరియా అబ్దుల్లా లేడీ లీడ్ గా నటించారు. కాగా స్వప్న సినిమాస్‌ బ్యానర్ పై మహానటి డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Source: Vyjayanthi Network