కెరీర్ పరంగా దూకుడు పెంచింది తాప్సీ పన్ను. అద్దిరిపోయే క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకుంటూ…తన నటనతో శభాష్ అనిపించుకుంటోంది. ఇప్పుడా లైన్ లోనే ‘శభాష్‌ మిథు’ సినిమాను ప్రారంభించింది. ఇందులో తాప్సీ క్రికెటర్‌గా నటిస్తోంది. ఇండియన్ వుమెన్ క్రికెట్‌ సారథి మిథాలీ రాజ్‌ బయోగ్రఫీతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. డైరెక్టర్ రాహుల్‌ ధోలాఖియా రూపొందిస్తుండగా వయాకామ్‌ 18 ప్రొడక్షన్ హౌజ్ నిర్మిస్తోంది.

ఆల్రెడీ అఫీషియల్ గా మొదలైన ఈ మూవీ.. రీసెంట్ గా రెగ్యులర్‌ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. దీనిపై తాప్సీ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ చేసింది. ‘లెట్స్‌ గో డే – 1’ అంటూ క్రికెట్‌ నేర్చుకుంటోన్న ఓ పిక్ ని షేర్‌ చేసింది. ఈ సినిమా కోసం తాప్సీ కొన్ని నెలలుగా క్రికెట్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. నూషిన్‌ అల్‌ ఖాదీర్‌ అనే కోచ్ సహకారంతో క్రికెట్ పై పట్టు సాధిస్తోంది. ప్రస్తుతం తాప్సీ లీడ్ రోల్ చేసిన ‘రష్మీ రాకెట్‌’, ‘లూప్‌ లపేటా’ సినిమాలు రిలీజ్ కి రెడీ అవగా…శభాష్ మిథు వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్స్ కి రానుంది.

ఇద్దరూ చిన్న సినిమాలతో క్రేజీ స్టార్స్ గా ఎదిగారు. ఇద్దరూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బీజీగా మారారు. అయితే ఈ ఇద్దరికీ మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. ట్లీట్స్ తో షూట్ చేసుకుంటారు. మాటల బాంబులు పేల్చుకుంటారు. అయితే వీళ్లిద్దరికీ తగ్గట్టే..నేషనల్ అవార్డ్ ఒకరివైపు…ఫిలింఫేర్ అవార్డ్స్ మరొకరి వైపు ఉన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఈ హైడ్రామా ఏంటి….

కంగనా, తాప్సీ…వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటుంది. ఇద్దరూ నేషనల్ స్టార్స్. యాక్టింగ్ తో అదరగొడతారు. అయితే ఒకరంటే ఒకరికి పడదు. ప్రభుత్వానికి పూర్తి సపోర్ట్ గా కంగనా ప్రవర్తిస్తే…జరిగేది తప్పు అనిపిస్తే చెప్పడం తాప్సీకి అలవాటు. ఇక్కడే చెడింది ఇద్దరికీ. ట్విట్టర్ వేదికగా యుద్ధం చేసుకున్నారు. సూటిగా ట్వీట్స్ సంధించుకున్నారు. కంగనా ఒకడుగు ముందుకు వేసి బి గ్రేడ్ యాక్ట్రెస్ అంటూ తాప్సీని గట్టిగానే ఢీకొట్టింది.

తాజాగా ముంబైలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. 2020లో విడుదలైన బాలీవుడ్ సినిమాలకిగానూ ఈ అవార్డ్స్ అందించారు. తాప్సీ నటించిన తప్పడ్ సినిమా అనేక విభాగాల్లో అవార్డులు అందుకుంది. బెస్ట్ యాక్ట్రెస్ గా తాప్సీని అవార్డ్ వరించింది. బెస్ట్ ఫిల్మ్ తో పాటూ బెస్ట్ స్టోరీ, బెస్ట్ సింగర్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ ఇలా పలు విభాగాల్లో థప్పడ్ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను దక్కించుకుంది. అయితే 2020లోనే రిలీజైన కంగనా పంగా సినిమాకి ఎటువంటి అవార్డ్ రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఈమధ్యే ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో బెస్ట్ యాక్ట్రెస్ గా మణికర్ణిక, పంగా సినిమాలకు గానూ కంగనా అవార్డ్ సొంతం చేసుకుంది. ఫిలింఫేర్ అవార్డ్స్ చాలా నామినేషన్స్ లో కంగనా నటించిన పంగా మూవీ కూడా ఉంది. ఉత్తమనటి విభాగంలో తాప్సీతో పోటీపడింది కంగనా. కానీ థప్పడ్ సినిమా నుంచి తాప్సీనే ఉత్తమనటిగా ఎంపికచేసింది ఫిల్మ్ ఫేర్ టీం. ఇలా ఫిల్మ్ ఫేర్ టీం తాప్సీ థప్పడ్ సినిమాకి పట్టంగడితే…నేషనల్ అవార్డ్స్ జ్యూరీ తాప్సీ థప్పడ్ చిత్రాన్ని అసలు పట్టించుకోలేదంటున్నారు బాలీవుడ్ జనాలు.

టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. వరుస సినిమా అప్డేట్స్ తో పాటూ ఈమధ్య కంగనాతో ట్వీట్ వార్ పెద్ద దుమారమే లేపింది. అయితే ఏం జరిగినా అవసరానికి మించి రియాక్ట్ కానీ ఈ ఢిల్లీ బ్యూటీ.. ముంబయ్ లో కొత్త ఇల్లు కొన్నది. అద్బుతంగా డిజైన్ చేసుకున్న తన ఇంటి నుంచి ఫోటోస్ ను అభిమానులతో పంచుకుంది తాప్సీ. ఇప్పుడు తాప్సీ కొత్తిల్లు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by Taapsee Pannu (@taapsee)

వరుస బాలీవుడ్ ఛాన్స్ లు కొట్టేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది తాప్సీ. ఇప్పటికే పలు కీలక చిత్రాలు చేస్తున్న ఈ సొట్టబుగ్గల సుందరి తాజాగా మరో క్రేజీ ఆఫర్ ను బుట్టలో వేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోతో నటించే అరుదైన అవకాశం తాప్సీని వరించిందిని బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది
ఫేమస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్ లో షారుక్ ఖాన్ ఓ మూవీకి కమిటయ్యాడు. ఈ ప్రాజెక్ట్ లోనే హీరోయిన్ గా తాప్సీ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారూక్‌ నటిస్తోన్న ‘పఠాన్‌’ మూవీ చిత్రీకరణ ముగియగానే ఈ సినిమా షురూకానుంది. వచ్చే సంవత్సరం మధ్యలో ఈ చిత్రం రిలీజ్ చేయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు.