శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ , క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా… సొగసు చూడ తరమా. తల్లాడ సాయి కృష్ణ స్వీయ దర్శకత్వంలో, నక్షత్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి విడుదల చేశారు.

అరకు లోయ జరిగే అందమైన ప్రేమకథను ఈ సినిమాలో చూపించారట హీరో కం డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ .హాస్యంతో మిళితమైన చక్కని సందేశాన్నిచ్చే మంచి సినిమా ఇదని.., ఉమెన్స్ డే రోజు ఆడవారిని సన్మానించడం కాకుండా ప్రతిరోజు వారిని గౌరవిస్తే అదే నిజమైన సన్మానం అన్నారు డైరెక్టర్. కాగా తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రచన శివ కాకు అందించగా… సంగీతం వి.ఆర్.ఏ.ప్రదీప్ సమకూర్చారు.