కథ వేరుంటేనే ఓకే చెప్తున్న సమంతా, తాప్సీ. కేవలం గ్లామర్ రోల్ అయితే నో అంటున్నారు. అవును సమంతా, తాప్సీ సినిమా స్పెషలిస్ట్స్ గా మారారు. చాలా చూసీగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓ బేబి తర్వాత సమంతా ఏ సినిమా ఒప్పుకోవట్లేదనే ప్రచారం జరిగింది. కానీ సామ్ తన దగ్గరికొస్తున్న అన్ని సబ్జెక్ట్ లకు ఓకే చెప్పట్లేదు. ముఖ్యంగా హీరో పక్కన పాటలకు పరిమితమయ్యే క్యారెక్టర్లకు వెంటనే నో చెప్పేస్తుంది. సేమ్ టు సేమ్ ఇదే రూల్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతోంది తాప్సీ.
శాకుంతలం…ఈ గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ లో సమంతానే నటిస్తోంది. శకుంతలగా సినిమాను తానై నడిపించబోతుంది. ఎప్పటికి గుర్తుండిపోయే క్యారెక్టర్ కాబట్టే ఈ మైథలాజికల్ డ్రామాకు సైన్ చేసింది అక్కినేని కోడలు. అలాగే నయనతార ఉన్నాసరే విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తున్న కాథువాకుల రెండు కాదైలో నటిస్తోంది. దీంతో పాటూ గేమ్ దర్శకుడు అశ్విన్ శరవణన్ డ్రీమ్ ప్రాజెక్ట్ కీ ఓకే చెప్పింది. ఒకటి రొమాంటిక్ కామెడి కాగా, మరొకటి హారర్ థ్రిల్లర్. అయితే ఈ రెండు తమిళ్ ఫిల్మ్్లోనూ సామ్ ది స్టన్నింగ్ రోలే.

ఎన్నో గ్లామర్ రోల్స్ చేసి బోర్ కొట్టిన తాప్సీ ఇప్పుడిక క్యారెక్టర్ కి గుర్తింపు ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అంతేకాదు ఆ పాత్ర కోసం ఎలాంటి కష్టాన్నైనా భరిస్తానంటుంది. ప్రజెంట్ చేతిలో ఉన్న హసీన్ దిల్రుబా, జనగణమన, రష్మీ రాకెట్, లూప్ లపేటా…ఈ సినిమాలన్నింటిలో తాప్సీదే లీడ్ రోల్. అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్. ఒక దానితో మరోదానికి సంబంధం లేకుండా మిస్టరీ, కామెడీ, స్పోర్ట్ డ్రామా ఇలా వేరియేషన్స్ చూపిస్తుంది. తెలుగులో తేజ డైరెక్ట్  చేస్తున్న అలువేలుమంగ వెంకటరమణలోనూ తాప్సీ లీడ్ రీల్ చేస్తుందనే వార్తలొస్తున్నాయి. ఈ మూవీస్ తో తానేంటో ప్రూవ్ చేసుకుంటానంటుంది. 

రంగస్థలం, మహానటి, యూటర్న్, సూపర్ డీలక్స్, మజిలీ, ఓ బేబీ, జాను…పెళ్లైన తర్వాత చేసిన ఈ సినిమాలన్నీ సమంతాకు నటిగా పేరుతెచ్చిన సినిమాలే. ఇకపై కూడా రూట్ మార్చేదే లేదంటుంది. తాప్సీ విషయానికొస్తే.. గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, తప్పడ్ వంటి సినిమాలతోనే ఇక ముందు సైతం తనదైన ముద్ర వేస్తానంటుంది. ఇలా డెసిషన్ మేకింగ్ లో సేమ్ టు సేమ్ అంటున్న వీళ్లిద్దరూ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ స్పెషలిస్ట్స్ గా ప్రత్యేకత చాటుకుంటున్నారు.