విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కాంబో మూవీ ‘పెళ్ళి చూపులు’ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం మ‌ను చరిత్ర‌. ప్రేమికుల దినోత్సవం సంద‌ర్భంగా రిలీజైన పోస్ట‌ర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. కాగా ఈ రోజు హీరో శివ పుట్టినరోజు కావ‌డంతో మూవీ నుంచి మరో లుక్ విడుద‌ల చేసారు. ఇందులో గుబురు గ‌డ్డంతో ఉన్న శివ కందుకూరి నోట్లో సిగ‌రెట్‌, చేత్తో ఫ్లవర్ తో సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్‌లో శివ‌ను చూస్తుంటే…విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు అంటున్నారు నెటిజన్స్.
యాపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా…చందమామ కాజ‌ల్ కో ప్రొడ్యూసర్ కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత నిర్మాత‌గాను కాజల్ కిచ్లూ రాణించ‌నుంద‌నే టాక్ హాట్ టాపిక్ గా మారింది. మ‌ను చరిత్రలో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, గోపీ సుంద‌ర్ సంగీతం సమకూరుస్తున్నారు. మ‌రికొన్ని రోజుల్లోనే మనుచరిత్ర విడుదలకు సిద్ధమైంది,

రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేసి తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు నాగచైతన్య. లవ్ స్టోరీతో ఏప్రిల్ 16న లవర్ బాయ్ గా కనిపించేందుకు సిద్ధమైన చై…ఆ తర్వాతి ప్రాజెక్ట్ లో పోలీసాఫీసర్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అది కూడా పెళ్లిచూపులు డైరెక్టర్ కాంబినేషన్ లో. అవును తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నాగచైతన్య పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడని టాక్.

అయితే చైతన్య మామ వెంకటేశ్ తో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. నారప్ప, ఎఫ్ 3 తర్వాత వెంకీ, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ సినిమా కన్ఫర్మయినట్టు వార్తలొచ్చాయి. అయితే తాజాగా వెంకీతో కాదు నాగచైతన్యతో ఈ క్రేజీ డైరెక్టర్ మూవీ పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఓ షార్ట్ స్టోరీ ఓటీటీ వేదికగా పిట్టకథలుగా రిలీజ్ కానుంది. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా నటుడిగానూ అలరిస్తున్నారు. మరి తరుణ్ భాస్కర్ చైతో ఓకే అంటాడా…వెంకీమామతో కనక్ట్ అవుతాడా చూడాలి.

విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న నారప్ప ఓ కొలిక్కి వచ్చేసింది. మే 14న రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసింది. అటు వరుణ్ తేజ్ తో కలిసి యమాజోరుగా ఎఫ్ 3ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3…ఆగస్టు 27న ప్రేక్షకులకు నవ్వులవిందును అందించేందుకు కర్చీప్ వేసింది. మరి నెక్ట్స్…వెంకీ గుర్రపు స్వారీ చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్.
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వెంకటేశ్ నటిస్తారని తెలుస్తోంది. గుర్రపు పందాల నేపథ్యంలో సాగే ఈ ప్రాజెక్ట్ లో వెంకటేశ్ హార్స్ రైడర్ గా కనిపిస్తారట. ఇప్పటికే తరుణ్ భాస్కర్..హీరో వెంకటేశ్ కి కథ చెప్పేయడం…నచ్చడం…ప్రొడ్యూసర్ గా సురేశ్ బాబు ముందుకు రావడం అన్నీ జరిగిపోయాయని అంటున్నారు. జూన్ లేదంటే జూలై నుంచి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ గుర్రపుస్వారీ చేస్తారని సమాచారం. మరి చాలాసార్లు ఇలా వార్తల్లో నిలిచి మాయమయిన ఈ న్యూస్…ఈసారైన నిజమవుతుందా…చూడాలి.