లవర్ బాయ్ రాజ్ తరుణ్.. హిట్ కోసం నానా పాట్లు పడుతున్నాడు. రొటీన్ సినిమాలు , మొనాటనస్ యాక్టింగ్, అవే క్యారెక్టరైజేషన్స్ తో విసిగిపోయిన జనాలకు రాజ్ తరుణ్ సినిమాలు పెద్దగా నచ్చడం లేదు. అందుకే వరుసపెట్టి ఫ్లాపులు అంటగడుతున్నారు. ఈ ఇమేజ్ నుంచి బయటకు రావాలంటే రాజ్ తరుణ్ కి అర్జెంటుగా హిట్ కావాలి. అందుకే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఒరేయ్ బుజ్జిగా సినిమాలతో పాటు ఈ మధ్య వచ్చిన పవర్ ప్లే కూడా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే స్టాండప్ రాహుల్ అంటూ మరోకొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు.

డిఫరెంట్ సినిమాలను సెలక్ట్ చేసుకునే సందీప్ కిషన్ కూడా ప్లాపుల్ని ఫేస్ చేస్తున్నాడు. నిజానికి తెలుగులో హిట్ కొట్టి చాలారోజులైంది సందీప్. నక్షత్రం, మనసుకు నచ్చింది, నెక్ట్స్ ఏంటి..? నిను వీడని నీడని నేను తెనాలి రామకృష్ణ తోపాటు రీసెంట్ గా ఎ1 ఎక్స్ ప్రెస్ కూడా ఫ్లాప్ అయ్యింది. ఒకే ఒక్క బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఈ హీరో నెక్ట్స్ 2 సినిమాలతో రెడీ అవుతున్నారు.

50 కోట్ల భారీ బడ్జెట్ తో రీసెంట్ గా మోసగాళ్లు సినిమా చేసి చేతులు కాల్చుకున్న మంచు విష్ను కూడా బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరో కూడా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో సూపర్ హిట్ అయిన ఢీ సినిమా సీక్వెల్ తో మళ్లీ సక్సెస్ అటెంప్ట్ చెయ్యబోతున్నారు విష్ను.

లేట్ అయినా పర్లేదు..హిట్ కోసం మొత్తం సెట్ చేసుకుని వద్దాం…సక్సెస్ కొడదాం అని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న హీరో ఆది సాయికుమార్. వరుస ఫ్లాపులతో కెరీర్ స్లంప్ లో ఉన్న ఆది.. లవ్ స్టోరీగా వచ్చిన శశి కూడా ఎక్స్ పెక్ట్ చేసిన హిట్ అందుకోలేకపోయింది. అయినా సరే పట్టువదలకుండా భాస్కర్ బంటుపల్లి డైరెక్షన్లో మరో సినిమా చెయ్యడానిక రెడీ అయ్యారు. ఉగాది నుంచి సెట్స్ మీదకెళ్లబోతున్న ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నారు ఆది.

శ్రీవిష్ను కూడా అంతే .. బ్రేక్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నోసెంట్ , క్లాస్, మాస్ రొమాన్స్ ..ఇలా ఏ జానర్ టచ్ చేసినా హిట్ మాత్రం రావడం లేదు . రీసెంట్ గా చేసిన ఎమోషనల్ ఎంటర్ టైనర్ గాలి సంపత్ కూడా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే సక్సెస్ కోసం 2,3 సినిమాలను స్పీడప్ చేశారు శ్రీవిష్ను.

చాలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్న సుమంత్ .. రీసెంట్ గా కపటధారి అనే క్రైమ్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయినా బ్రేక్ కోసం అనగనగా ఒక రౌడీ సినిమాలో వాల్తేరు శీను గా ప్రేక్షకులకు కొత్త క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు సుమంత్ .

‘నువ్వేకావాలి’చిత్రంతో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చి.. నువ్వే నువ్వే, నువ్వులేక నేనులేను వంటి కమర్షియల్ హిట్ ప్రేమకథాచిత్రాలతో తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో తరుణ్. అయితే ఆ తర్వాత ఏ సినిమా చేసినా తరుణ్ కి కలిసిరాలేదు. సేమ్ టైమ్ వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొన్న తరుణ్ సినిమాలను దాదాపు వదిలేసాడనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా తన జిగిరీ దోస్త్ చెప్పిన ఓ న్యూ ఏజ్ లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. ఈ మూవీలో తరుణ్ ఢిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. అతిత్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ క్రూ అండ్ కాస్ట్ వివరాలు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. ఈ చిత్రం ద్వారా హీరో తరుణ్ తన మిత్రుడిని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తుండడం విశేషంగా చెప్పుకుంటున్నారు.