టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటూ సినిమా హాళ్ల యాజమాన్యానికి కేసీఆర్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. సినిమా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం 100% కెపాసిటికి ఓకే చెప్పిన విషయం తెలిసందే. ఇక తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సైతం దీనిని అమలు చేసేందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు జారీచేసారు.