పవర్ స్టార్ మేనియా షురూఅయింది. పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న వకీల్ సాబ్ ట్రైలర్ రానేవచ్చింది. హ్యాష్ వకీల్ సాబ్ ట్రైలర్ డే పేరుతో ఫ్యాన్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ట్రైలర్ తోనే సంచలనం సృష్టిస్తోన్న వకీల్ సాబ్… రిలీజ్ రోజు కూడా ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఏంటా ట్రెండ్? అభిమానులకు పండగేనా? ఇంతకీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడు?

Source: Dil Raju

వకీల్ సాబ్ వచ్చేసాడు. వకీల్ సాబ్ గా పవన్ కల్యాణ్ అదరగొట్టారు. ఏప్రిల్ 9న థియేటర్లకు రాబోతున్న వకీల్ సాబ్…ఇప్పుడు ట్రైలర్ తోనే సందడి షురూచేసారు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ అయినా…మన నేటివిటీకి తగినట్టు కథలో మార్పులు చేసారు డైరెక్టర్ వేణు శ్రీరామ్‌. కాగా నైజాం, ఈస్ట్, వైజాగ్, నెల్లూర్ ప్రాంతాల్లోని కొన్ని థియేటర్లలో వకీల్ సాబ్ ట్రైలర్ ని సరికొత్తగా రిలీజ్ చేసారు.

వకీల్‌సాబ్‌రిలీజ్‌విషయంలో నిర్మాత దిల్‌రాజు మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. వైజాగ్‌లోని కొన్ని థియేటర్లలో విడుదల తేదికి ముందు రోజు అర్థరాత్రి 12 గంటల నుంచి మూడు మిడ్‌నైట్ షోలను ఏర్పాటు చేయనున్నారు. అభిమానుల షో గా చెప్పే ఆ షో టికెట్‌ రేట్ భారీ మొత్తంలో ఫిక్స్‌చేశారని టాక్. టికెట్ల రేట్లను సైతం పెంచుతారనే వార్త రావడంతో… మొదటి రోజు వకీల్ సాబ్‌రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు పెద్ద మొత్తంలో టికెట్ల రేట్లు పెంచడంతో వకీల్‌సాబ్ సామాన్య ప్రేక్షకులకు దూరమవుతాడనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

ఇటీవలే తన పాత్రకు డబ్బింగ్ పూర్తిచేసారు పవన్ కల్యాణ్. నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్ లో పవన్ చేస్తోన్న తొలి సినిమా వకీల్ సాబ్ కావడం విశేషం. శ్రుతిహాసన్‌పవర్ స్టార్ జోడిగా నటిస్తుండగా… నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల కీరోల్స్ ప్లే చేసారు. ఇప్పటికే తమన్‌సంగీతం అందించిన వకీల్ సాబ్ పాటలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 4న జరుగబోతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా వకీల్ సాబ్ డబ్బింగ్ పనులను ముగించుకున్న పవన్ కళ్యాణ్…పాట పాడేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడే కాదు. కొంత టైం తీసుకొని పాట పాడుతానని మాత్రం క్లారిటీ ఇచ్చారు. అది కూడా థమన్ సంగీత దర్శకత్వంలో. పవన్ కళ్యాణ్, రానా కాంబోలో మలయాళీ హిట్ అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇందులోనే పవర్ స్టార్ గొంతు సవరించేందుకు రెడీఅవుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్… స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా థమన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. వకీల్ సాబ్ కి కేవలం మ్యూజిక్ మాత్రమే అందించానని..త్వరలోనే తన సంగీతానికి పవర్ స్టార్ పాడనున్నారని చెప్పుకొచ్చాడు థమన్.

తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అయితే తన సంగీతంపై వచ్చే ట్రోలింగ్ గురించి ఏమనుకుంటున్నారని ఓ అభిమాని ప్రశ్నించగా…ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకొని తన సమయాన్ని వృథా చేసుకోనన్నారు తమన్. అసలు ట్రోల్స్ క్రియేట్ చేయడం కోసం వారే తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. పెద్దగా ట్రోలింగ్ పై స్పందించకుండా నో కామెంట్ అన్నట్టు తప్పించుకున్నారు. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట ఓ రేంజ్ లో ఉండబోతుందంటూ హింట్ ఇచ్చారు. ఆగస్టులో ఈ సినిమాకు సంబంధించి సూపర్ అప్డేట్ ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు కొసమెరుపుగా పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడు అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు.

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా ప్రారంభమైంది. మోహన్ రాజా డైరెక్షన్ లో లూసీఫర్ రీమేక్ అఫీషియల్ గా లాంచ్ అయింది. అయితే మన నేటివిటీకి తగ్గట్టు కథను పూర్తిగా మార్చి తెరకెక్కిస్తున్నారట ఈ సినిమాని. సురేఖ కొణిదెల సమర్పిస్తుండగా… కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇంకా ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ కలిసి ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నాయి. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మరి నయనతార, సత్యదేవ్ వంటి వారు ఉన్నారో లేదో తెలిసిపోతుంది.

ఈ మూవీ ఓపెనింగ్ బుధవారం ఫిలింనగర్ సూపర్ గుడ్ సంస్థ ఆఫీస్ లో పూజ కార్యక్రమంతో మొదలయింది. అల్లు అరవింద్, అశ్వినీదత్, డివివి దానయ్య, ఆర్ బి చౌదరి, నిరంజన్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నాగబాబు, డైరెక్టర్ కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమిని కిరణ్, బాబీ, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, గోపి ఆచంట, రామ్ ఆచంట, మిరియాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, యువి క్రియేషన్స్ విక్కీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మెగాస్టార్ లూసీఫర్ రీమేక్ గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. నయనతార చిరూ చెల్లెలిగా, సత్యదేవ్ మరో పాత్రలో కనిపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే వీటి గురించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని తెలిసింది. స్వయంగా లూసీఫర్ రీమేక్ కు సంగీతం సమకూర్చబోయేది నేనే అని ప్రకటించాడు తమన్. ‘ప్రతి సంగీత దర్శకుడికి ఇది ఓ పెద్ద కల…ఇప్పుడు నా వంతు రానేవచ్చింది…మెగాస్టార్ పై నాకున్న అభిమానాన్ని నా మ్యూజిక్ తో తెలియజేస్తాను’ అని మురిసిపోయాడు తమన్.
అయితే ఈ మూవీకి సంబంధించి చాలామంది డైరెక్టర్ల పేర్లు తెరపైకొచ్చినా చివరికి… ఆ ఛాన్స్ ‘తనిఒరువన్‌’ మేకర్ మోహన్‌రాజాకు దక్కింది. మోహన్‌రాజా తీర్చిదిద్దిన రీమేక్‌ వెర్షన్‌ బాగా నచ్చడంతో.. వెంటనే చిరు డైరెక్టర్‌ను ప్రకటించారు. జనవరి చివరివారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకెళ్లనుందని.., ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిగ్ షెడ్యూల్ ప్లాన్‌ చేస్తున్నట్టు అధికారికంగా తెలియజేసారు. ఇక ఇప్పుడు తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్ కూడా సిద్ధమయ్యాడు.

వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా…ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ‘గని’ అన్న టైటిల్ ను ఖరారు చేస్తూ వరుణ్ ఇస్తున్న పంచ్ హైలైట్ గా మారింది. లైగర్ లో బాక్సర్ గా విజయ్ దేవరకొండ నటిస్తుంటే బాక్సర్ గనిగా వరుణ్ తేజ్ కనిపించబోతున్నారు. ఈ మూవీలో హీరో పాత్ర పేరు గని కాబట్టే..టైటిల్ కి కూడా ఆ పేరే కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది.
ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తండ్రిగా స్టార్ యాక్టర్ ‘ఉపేంద్ర’ నటిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ కోచ్ గా బాలీవుడ్ నటుడు ‘సునీల్ శెట్టి’, విలన్ గా ‘జగపతిబాబు’ కనిపించబోతున్నారు. ‘నవీన్ చంద్ర’ కూడా కీ రోల్ పోషిస్తున్న గనికి ‘తమన్’ సంగీతం అందిస్తున్నారు.

Source: Geetha Arts