చిత్ర పరిశ్రమ చూపు గోదావరి తీరంపై పడింది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలను షూటింగ్ స్పాట్స్ గా మారుస్తున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్ ముగిసిందో లేదో…మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడక్కడ వాలిపోయారు. ‘ఆచార్య’కు అవసరమైన కరెక్ట్ లోకేషన్స్ అవే అంటూ డైరెక్టర్ కొరటాల శివ అక్కడ స్కెచ్ వేసారు. దాదాపు పుష్ప షూటింగ్ జరిగిన ప్రాంతాల్లోనే ఆచార్య కూడా తిరగనున్నాడు.

నాగచైతన్య నటిస్తోన్న ‘థాంక్యూ’ టీమ్ రాజమండ్రి బాటపట్టింది. ఈ నెలాఖరు నుంచి తూర్పు గోదావరి జిల్లాలో 15రోజుల పాటూ చిత్రీకరణ జరుపునున్నారు డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. చైతూ, మాళవిక నాయర్లపై సీన్స్ షూట్ చేయనున్నారు. అంతేకాదు మిగిలిన నటీనటులతో కూడా థాంక్యూ మూవీ కీలక సన్నివేశాలను గోదావరి తీరంలోనే ప్లాన్ చేసారు దర్శకనిర్మాతలు.

రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రాజమండ్రి బయల్దేరింది ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను మణిరత్నం గోదావరి నదిపై ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సింగంపల్లి నుంచి పాపికొండలు వెళ్లే మార్గంలో చిత్రీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే షూటింగ్ లో ఏ నటీనటులు పాల్గొంటారనే విషయాన్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.

శేఖర్ కమ్ముల లవ్ స్టోరి తర్వాత నాగ చైతన్య ‘థాంక్యూ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రొడక్టివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ లో జరుగుతుండగా ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటపడింది. చైతూపై ఇక్కడ సూపర్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణను కరెక్ట్ గా గమనించిన వారు.. థాంక్యూ మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ చర్చల్లోకి తీసుకొచ్చారు.
ఇది చైతూ ఫ్యాన్స్ తో పాటు సూపర్‌ స్టార్‌ అభిమానులకు శుభవార్తే. అవును ఈ ప్రాజెక్ట్ లో మహేశ్‌ బాబు అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా చైతూ నటిస్తున్నాడు. అభిరామ్…ఈ మూవీలో చైతూ క్యారెక్టర్ నేమ్. అభిరామ్ పేరు పేరిట, మహేష్ బాబు పోస్టర్లు, బ్యానర్లతో థియేటర్ ని ముస్తాబుచేసారు. దీంతో పండుగ చేసుకుంటున్నారు మహేశ్ ఫ్యాన్స్. బీవీఎస్‌ రవి రాసిన ఈ కథను దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఓ హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. అవికా గోర్‌ మరో కథానాయికగా అలరించనుంది. మంచి ఫామ్ లో ఉన్న ప్రొడ్యూసర్ దిల్‌ రాజు దీనిని నిర్మిస్తున్నారు