రేపు తెల్లవారితే ‘రంగ్ దే’, ‘అరణ్య’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రేపు గడిస్తే 27న వీటితో పాటూ రంగంలోకి దిగనుంది ‘తెల్లవారితే గురువారం’ సినిమా. నితిన్, కీర్తి సురేష్ నటించిన రంగ్ దే, రానా ఒంటి చెత్తో నడిపించిన అరణ్య…ఈ రెండు చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. రంగ్ దే కామెడీతో, అరణ్య థ్రిల్లర్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే రంగ్ దే చూసిన దిల్ రాజు, అరణ్య వీక్షించిన సురేష్ బాబు సంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కీరవాణి కొడుకులు కలిసి చేస్తోన్న ప్రయత్నం తెల్లవారితే గురువారంపై కూడా ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో రేపు తెలిసిపోతుంది. పెద్దగా పోటీ లేకపోవడంతో రెండు వారాలుగా జాతిరత్నాలు కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే రత్నాల ఊపు కూడా తగ్గుతుంది. దీనికి తోడు రంగ్ దే, అరణ్య సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ కొట్టినా, లేదంటే రెండు హిట్ టాక్ తెచ్చుకున్నా…జాతిరత్నాలు ఇంక ఓటీటీలో చూడొచ్చులే అనుకునే అవకాశం ఉంది ప్రేక్షకులు. ఏనుగుల నేపథ్యంగా తెరకెక్కిన అరణ్య గెలుస్తాడా…కామెడీనే నమ్ముకున్న నితిన్ హిట్ కొడతాడా…అసలేలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేని శ్రీసింహ తెల్లవారితే దచ్చికొడతాడా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

మార్చి 22 యాంకర్ సుమ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించారు తెల్లవారితే గురువారం టీం మెంబర్స్. కీరవాణి కొడుకు శ్రీసింహా హీరోగా నటించగా…మరో కొడుకు కాలభైరవ సంగీతం అందించాడు. మార్చి 27న థియేటర్స్ కి రానున్న తెల్లవారితే గురువారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమతో ఇంటర్వ్యూ ఇదే రోజు ప్లాన్ చేయడంతో…మూవీ యూనిట్ సుమను సర్ప్రైజ్ చేసింది. కాగా తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరయ్యారు.