తాజాగా ఏప్రిల్ 9న విడుదలకానున్న వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. స్త్రీ లేనిదే సృష్టి లేదు…అలాంటి స్త్రీని కాపాడుకోవాలని చెప్పే చిత్రమే మాదంటూ స్పీచ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఇక ప్రస్తుతం పవన్ అటు హరిహర వీరమల్లు…ఇటు అయ్యప్పయున్ కోషియుం రీమేక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు తన తర్వాత సినిమాలపై ఫోకస్ చేసారు.

అయితే హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబో మూవీపై ఓ న్యూస్ వైరల్ గా మారింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో పవన్ కోసం ఓ ఫుల్ లెంత్ మాస్ స్టోరీని రెడీ చేసానన్నాడు హరీష్. అయితే ఆ మాస్ స్టోరీలో పవన్ రెండు పాత్రల్లో విశ్వరూపం చూపిస్తారని తెలుస్తోంది. తన కెరీర్ లో ఎప్పుడూ డబుల్ రోల్ చేయలేదు పవన్. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ ఫెస్టివల్ చేసుకుంటారు. కాగా ఇందులో ఒక రోల్ ఐబీ ఆఫీసర్ అన్న ప్రచారం జరుగుతుంది.