మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్ర తెలుగు రీమేక్ ను ప్రారంభించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయల తర్వాత వరుస సినిమాలకు సైన్ చేసిన పవన్ ఆ లైనప్ లో యువ దర్శకుడు సాగర్ కె. చంద్ర ప్రాజెక్ట్ కూడా ఓకే చెప్పాడు. ఇప్పుడు అదే సినిమాను పట్టాలెక్కించాడు. బిజూ మీనన్ – పృథ్వీరాజ్ మెయిన్ లీడ్స్ గా నటించిన ఈ సినిమా తెలుగులో బిజూ మీనన్ నటించిన నిజాయితీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్.. అతనికి ధీటుగా నిలిచే పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. సాయిపల్లవి, ఐశ్వర్యా రాజేష్ ఫిమేల్ లీడ్స్ గా కనిపించే అవకాశం ఉంది. ఇక తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

పవన్ కల్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి దేవుని పటాలపై క్లాప్ ఇవ్వగా.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ స్క్రిప్ట్ ని దర్శకుడికి అందించాడు. వీటికి సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 12 గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్… ప్రసాద్ మూరెళ్ళ. ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు. ప్రకటనతోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ 2021 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలిపింది చిత్ర యూనిట్.