క్రాక్ ఇచ్చిన ఊపుతో మంచి జోష్ మీదున్నారు మాస్ మహారాజ రవితేజ. ప్రస్తుతం రమేశ్ వర్మ డైరెక్షన్లో ఖిలాడి చిత్రం చేస్తున్న ఆయన..తన నెక్ట్స్ సినిమాకి కూడా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 13న రవితేజ, త్రినథ రావు నక్కిన సినిమా ప్రారంభం కానుందని సమాచారం. రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం మే రెండో వారంలో ప్రారంభిస్తారట. కాగా సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేయనున్నారు. ఇప్పుడు నటిస్తోన్న ఖిలాడిలోనూ రెండు పాత్రల్లో కనిపించనున్నారు రవితేజ.

ఇదిలాఉంటే త్రినథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడని టాక్. జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా, పెళ్లిసందడి2 ఫేం శ్రీలీలతో పాటూ లవ్లీసింగ్ సైతం మాస్ రాజా సరసన ఎంపికైంది. ముగ్గురు భామలతో రవితేజ పండించే కామెడీ, రొమాన్స్ ఓ లెవల్లో ఉంటుందని చెప్తున్నారు మూవీ మేకర్స్.

అనుష్క సరసన నటించే ఛాన్స్ కొట్టేసాడట హీరో నవీన్ పొలిశెట్టి. డైరెక్టర్ మహేశ్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి డిఫరెంట్ లవ్ స్టోరిని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10ఏళ్ల వయసు తేడా ఉన్న ఓ ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో రారా కృష్ణయ్య ఫేం మహేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

బంపర్ ఆఫర్ అందుకున్నాడట జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్. ఓ మాస్ మసాలా కథతో హీరో రామ్ ను టెంప్ట్ చేసినట్టు టాక్. కథ విన్న రాన్ వెంటనే అనుదీప్ కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్, స్రవంతి మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని టాక్.

భలే ఛాన్స్ కొట్టేసింది జాతిరత్నాలు ఫేం ఫ‌రియా అబ్ధుల్లా. ఇప్పటికే ఈ అమ్మాయికి వరుస ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాటయి. కాగా మాస్ రాజా రవితేజ, త్రినాథ రావు నక్కిన కాంబినేషన్ సినిమాలో ఫరియాకు ఛాన్స్ ఇస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న ఖిలాడి అయినవెంటనే పట్టాలెక్కబోతున్న త్రినథరావు చిత్రంలో ఫరియానే హీరోయిన్ గా సెట్టయ్యే అవకాశం ఉంది

క్రాక్ హిట్ తర్వాత ఖిలాడిగా రెడీఅవుతోన్న రవితేజ…ఆ తర్వాత చంటబ్బాయ్ గా రానున్నాడు. తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ రాజా సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్…మెగాస్టార్ చిరంజీవి హిట్ ఫ్లిక్ చంటబ్బాయ్ పేరుతో తెరకెక్కనుంది. టీజీవిశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రవితేజ 68వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ వర్క్ శ‌ర‌వేగంగా దూసుకెళ్తుంది. హీరోయిన్స్ ఐశ్వ‌ర్య మీన‌న్‌, శ్రీలీల‌….రవితేజ సరసన కనిపించనున్నట్టు టాక్. 2012లో రిలీజైన లవ్ ఫెయిల్యూర్ ఐశ్వ‌ర్య‌మీన‌న్ నటించగా…శ్రీలీల పెళ్లి సంద‌డి 2లో కథానాయికగా న‌టిస్తుంది. ఏప్రిల్ నుంచి రవితేజ చంటబ్బాయ్ గా పైకి వెళ్ల‌నున్నాడు.

బ్లాక్ బస్టర్ క్రాక్ తర్వాత ఖిలాడి కోసం కష్టపడుతున్నారు రవితేజ. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడిలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు మాస్ రాజా. అయితే ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగానే మరో సినిమాకు తాజాగా కమిటయ్యారు. త్రినథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 68వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఖిలాడీ పూర్తి చేసిన వెంటనే వచ్చే నెల నుంచి సెట్స్ పైకెళ్లనున్న ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ లో రవితేజ పాల్గొననున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. కో ప్రొడ్యూసర్ గా వివేక్‌ కూచిభొట్ల వ్యవహరించనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణల వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.