ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీకి చౌడప్ప నాయుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మొదట అయినను పోయిరావలే హస్తినకు అన్న టైటిల్ అనుకున్నా…చౌడప్ప నాయుడుకే ఫిక్స్ అయ్యారని టాక్. త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలోనే నటించబోతున్నారు. అటు త్రివిక్రమ్ ప్రీప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. హీరోయిన్ ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. రష్మిక నటిస్తోందా…పూజా హెగ్దే కనిపిస్తోందా…తెలియాలి. అలాగే ఉప్పెన కృతిశెట్టి మరో హీరోయిన్ గా కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది.

అయితే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించబోయే సినిమాను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించనున్నారని టాక్. అందుకే విలన్ గా సైఫ్‌అలీఖాన్‌ ను తీసుకోవాలనే ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు క్రేజ్ ఉన్న హీరోలందరూ పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గుచూపుతున్నారు. దేశమంతా గుర్తింపుతో పాటూ కమర్షియల్ గానూ పాన్ ఇండియా అన్నది సక్సెస్ మంత్ర. అందులో త్రిపుల్ ఆర్ తర్వాత వచ్చే సినిమా కావడంతో దానిని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తీయాలన్నది తారక్ ప్లాన్.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో మూవీలో హీరోయిన్ రష్మికా ఫిక్సయిందని సమాచారం. పూజాహెగ్దే, కియారా, జాన్వీ కపూర్ వంటి పేర్లు వినిపించినా…చివరికి రష్మిక దగ్గర సెర్చ్ ఆగిందంటున్నారు. ఉగాది శుభ ముహూర్తాన ఏప్రిల్ 13న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో పట్టాలెక్కనుందని సమాచారం. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ ప్రాజెక్ట్…వచ్చే సంవత్సరం ఏప్రిల్ 19న థియేటర్స్ కి రానున్నట్టు తెలుస్తోంది. అయినను పోయిరావలే హస్తినకు అన్న టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఉప్పెన ఫేం కృతిశెట్టి కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ సినిమా సంగతలా ఉంటే…ఇటు మార్చి 18న తన వైఫ్ లక్ష్మి ప్రణతి బర్త్ డే సందర్భంగా విలువైన కానుకను సమర్పించారట ఎన్టీఆర్. సిటీలో ఓ పెద్ద ఫామ్‌ హౌస్‌ను భార్య పేరిట రాయించి…అక్కడే సెలెబ్రేషన్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.

యంగ్‌ టైగర్‌, మాటల మాంత్రికుడి సినిమాకు ముహూర్తం కుదిరింది. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ 13న ఉగాదికి అధికారికంగా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రిస్టీజియస్‌ పాన్‌ ఇండియా సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే.. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కలిసి చేయబోతున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా ఏప్రిల్‌ లో వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్న అనంతరం మళ్లీ మే, జూన్‌ నెలల్లో ఈ ప్రాజెక్ట్ కోసం పూర్తిగా డేట్స్‌ కేటాయిస్తారట తారక్. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై ఎస్‌.రాధాకృష్ణ, కళ్యాణ్‌రామ్‌ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

‘క్రాక్‌’, ‘నాంది’ సినిమాల్లో వరలక్ష్మి నటన చూసి ఫిదా అయిన త్రివిక్రమ్‌ NTR30లో ఓ రోల్‌ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకురాలిగా వరలక్ష్మీ కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఇప్పటికే దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. అటు బన్నీ, కొరటాల శివ ప్రాజెక్ట్ లోనూ వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ పొలిటిషియన్ గా నటించబోతుందంటూ వార్తలొస్తున్నాయి.
సెప్టెంబర్లో సెట్స్ మీదికెళ్తున్న ఈ మూవీ కోసం ఆల్రెడీ వరలక్ష్మీతో చర్చలు జరిగాయట. జలకాలుష్యం నేపథ్యంగా కమర్షియల్ యాంగిల్ స్క్రిప్ట్ రెడీ చేసిన కొరటాల శివ ఈ సినిమాలో బన్నీని స్టూడెంట్ గా, రాజకీయ నాయకుడిగా చూపించబోతున్నాడు. బన్నీని ఢీకొట్టే రాజకీయనాయకురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో కూడా ఆమె రాజకీయ నాయకురాలి పాత్రే చేస్తుంది అంటున్నారు. ఏది నిజం…లేదా రెండు సినిమాల్లో లేడీ పొలిటిషియన్ లాగానే వరలక్ష్మీ కనిపిస్తోందా అన్న చర్చ జోరందుకుంది. చూస్తుంటే వరలక్ష్మీ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా మాత్రం కనిపించడం లేదు.

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోమూవీ గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. సెకండ్ హీరోయిన్ గా ఉప్పెన ఫేం కృతిశెట్టిని ఫైనల్ చేసారని నిన్నటి దాకా టాక్ వినిపిస్తే తాజాగా…ఎన్టీఆర్ స్నేహితుడి స్టోరీ రంగంలోకి దిగింది. ఈ ప్రాజెక్ట్ లో తారక్ ఫ్రెండ్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డిటెక్టివ్ నవీన్ పోలిశెట్టి కనిపిస్తారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో సునీల్ విలన్ గా నటించబోతున్నాడనే ప్రచారం ఓ వైపు సాగుతోంది. ఇంతలో తారక్ స్నేహితుడిగా నవీన్ పోలిశెట్టి నటిస్తాడనే న్యూస్ వైరలవుతోంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ నిర్మాణంలో నవీన్ నటించిన జాతిరత్నాలు విడుదలకు సిద్ధమైంది. అనుదీప్ కెవి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో పాటూ బ్రహ్మానందం కూడా కనిపించనున్నారు.

పూరీ జగన్నాథ్ చిరకాల స్వప్నం జనగనమణ ప్రాజెక్ట్. అయితే మహేశ్ కోసం రెడీచేసిన ఈ జనగనమణ స్క్రిప్ట్ ను తాజాగా విన్నారట పవన్ కల్యాణ్. దీనికోసం ఇప్పటికే రెండుసార్లు ఆయన్ని కలిసిన పూరీ జగన్నాథ్…వర్తమాన రాజకీయాలకు అనుగుణంగా కథను మార్చే పనిలో ఉన్నారని టాక్. రాబోయే ఎన్నికల సమయానికల్లా ఈ సినిమాను సిద్ధం చేయాలని భావిస్తున్నారట.

అదలాఉంటే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్, రామ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లపై ఇండస్ట్రీలో విభిన్న టాక్స్ వినిపిస్తున్నాయి. విడివిడి సినిమాలు కాదు పవన్ కళ్యాణ్ – రామ్ కాంబినేషన్లో త్రివిక్రమ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వీళ్లిద్దరి కలయికలో పక్కా స్ట్రిప్ట్ రెడీ చేసుకున్న త్రివిక్రమ్ వచ్చే ఏడాదే ఈ కాంబోను తెరకెక్కించే అవకాశం ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ కి మల్టీస్టారర్ చేయడం కొత్తేమీ కాదు. అలానే హీరో రామ్ సైతం కథ నచ్చితే వేరే హీరోతో నటించేందుకు రెడీగానే ఉంటారు. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

ఖలేజా సినిమా 2010 అక్టోబరు 7న విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది .అతడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కాంబో కాబట్టి అభిమానులకి ప్రేక్షకులకి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్, ట్రైలర్, సదాశివా సన్యాసి పాట ఈ మూడు వారి అంచనాలను మరింత రెట్టింపు చేశాయి. అదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే మాత్రం ఆ సినిమా టాక్ వేరేలా ఉండేది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఈ సినిమా ఫెయిల్యూర్ కి చాలా కారణాలే ఉన్నాయి.
అయితే త్రివిక్రమ్ ఒక సూపర్ డూపర్ కాంబో కావాలి, అప్పుడు గుర్తువచ్చిన పేరు వెంకటేష్. వెంకటేష్ గారితో చాలా కథలు డిస్కస్ చేసిన చాలా కారణాల వల్ల ఆ సినిమాలు తెరకి ఎక్కలేదు. త్రివిక్రమ్ మూడు నెలలపాటు ఒక మంచి స్క్రిప్ట్ చేయాలన్న కుతూహలంతో తన కలానికి పదును పెట్టాడు. మార్చి ఎండింగ్ లో అల్లు అర్జున్ కి స్టోరీ వినిపించాడు .అయితే ఇలాంటి కథని వదులుకుంటే పెద్ద ఛాన్స్ మిస్ అవుతావని అల్లుఅర్జున్ ఫీల్ అయ్యాడు .అప్పుడు త్రివిక్రమ్ గారి తోటి ఈ కథని డెఫినెట్గా చేద్దామని చెప్పాడు వెంటనే ఈ సినిమాని నిర్మించడం కోసం దానయ్య గారిని ఎప్ప్రోచ్ అయ్యారు, ఆయనకి కూడా కథ బాగా నచ్చింది ,ఇదే ప్రాసెస్లో హారిక హాసిని క్రియేషన్స్ రాధా కృష్ణ గారు కూడా ఈ సినిమాను నిర్మించే ప్రాసెస్ లో జాయిన్ అయ్యారు .ఇకనేం మొత్తానికి అన్ని సెట్ అయిపోయాయి. అయితే ఈ కథ 2011 మే లోనే స్టార్ట్ అవ్వాల్సి ఉంది కానీ అల్లు అర్జున్ కి షోల్డర్ ఇంజురీ కారణంగా దాన్ని సర్జరీ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు .అల్లు అర్జున్ 2011 అక్టోబర్ లో స్టార్ట్ అవుతుందని నిర్మాతలు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఈలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు ,ఇద్దరు పోలీసు కేరక్టర్ కోసం రావు రమేష్ గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని ,ఎంచుకున్నారు. విలన్గా సుదీప్ అనుకున్నారు, కానీ తనకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో సోనూసూద్ ని అప్రోచ్ అయ్యారు. అప్పటికే జల్సా ఫిలింలో తనతో పని చేసింది ఇలియానా ఈ సినిమాకి కూడా తీసుకున్నారు. సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ సెట్ అయిపోయారు.

2011 నవంబర్ 2న ముహూర్తం షార్ట్ పెట్టారు. ఆ నెల 14 నుంచి షెడ్యూల్ మొదలైపోయింది .మొదటి షెడ్యూల్ లో భాగంగా బ్రహ్మానందం గారి ఎపిసోడ్స్ ఇలియానా హాస్పిటల్ ఎపిసోడ్స్ తీశారు. రెండు షెడ్యూల్లో ఫైట్ మాస్టర్స్ పీటర్ హెయిన్స్ తో కలిసి కొన్ని ఫైట్ ని చిత్రీకరించారు. మూడవ షెడ్యూల్ విశాఖపట్నం లో జరిగింది.

ముందు ఈ సినిమాకి “” హామీ “”టైటిల్ అనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో జులాయి అయితే మంచి క్యాచీ టైటిల్ అని ఈ టైటిల్ కి షిఫ్ట్ అయిపోయారు.


ఫస్ట్ కాపీ వచ్చే టైంకి ఆ సినిమా బడ్జెట్ 36 కోట్ల కి తేలింది. అయితే ప్రీ బిజినెస్ కూడా దానికి ధీటుగానే జరిగింది. దాసరి నారాయణ రావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సినిమారైట్స్ 23కోట్ల కి సినీ మీడియా సంస్థ తీసుకుంది. శాటిలైట్ రైట్స్ ని ఆరు కోట్ల కి, ఆడియో రైట్స్ ని 70 లక్షలు, ఓవర్సీస్ వీడియోస్ నీ ఫోకస్ ,మరియు వోల్గా మీడియా సంస్థలు ,మూడు కోట్ల 60 లక్షల కి కొన్నాయి .కర్ణాటక మూడు కోట్లు. కేరళ కోటి 25 లక్షల కి కొన్నారు. 2012 ఆగస్టు 9 న పదహారు వందల స్క్రీన్లలో జులాయి రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్. వరుడు ,బద్రీనాథ్ ,ఫ్లాపుల తర్వాత అల్లు అర్జున్ కి, ఖలేజా, ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ కి బ్లాక్ బస్టర్ వల్ల ఖాతాలో పడిపోయింది. ఇక వసూలు విషయానికి వస్తే మొదటిరోజు ఎనిమిది కోట్ల 50 లక్షలు వసూలు చేసింది. మొదటి వారంలో 32 కోట్లు .మొత్తం ఇండియాలో 82 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్ ని కూడా కలుపుకుని 103 కోట్ల భారీ కలెక్షన్లు వసూలు చేసింది .అప్పటికి అల్లు అర్జున్ కెరియర్లో ఇది హైయెస్ట్ రికార్డ్స్. ఈ చిత్రానికి నంది అవార్డు కూడా లభించింది.

Source: Star Maa

గీతా ఆర్ట్స్ ఆఫీస్ అవరణలో బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురం లో…సినిమా రీయూనియన్ బష్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.
2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన అల వైకుంఠపురంలో చిత్రం రికార్డులను తిరగరాసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన ఈ సినిమాని…గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి ప్రొడ్యూస్ చేశాయి.
అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు..తెలుగులో నాన్ బాహుబలి ఆల్ టైం రికార్డు సృష్టించింది అల వైకుంఠపురం లో…
హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ కి సైతం బూస్టప్ ఇచ్చింది ఈ మూవీనే. టబు, జయరాం, సుశాంత్, నవదీప్, నివేతా పేతురాజ్, సముద్రఖని, మురళి శర్మ వంటి అగ్ర తారాగణం నటించారు.
ఇక తమన్ సంగీతం లో రూపొందిన పాటలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలు వైరలే. బుట్ట బొమ్మ యూట్యూబ్ ట్రెండింగ్ గా మారి సంచలనాలకు అడ్డాగా మారింది.

Source: Geetha Arts


ఇన్ని అద్భుతాలకు ఎగ్జాంపుల్ గా నిలిచింది కాబట్టే 1ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, అల్లు అర్జున్, త్రివిక్రమ్, తమన్, సునీల్, సుశాంత్, సముద్రఖని, నవదీప్, నిర్మాత నాగ వంశీ తదితరులు హాజరై హర్షం వ్యక్తం చేశారు.

‘అయినను పోయిరావలే హస్తినకు’…ఇది ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలోనే పట్టాలెక్కబోయే మూవీ. అయితే ఈ మూవీలో ప్రతినాయకుని పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఆ విలన్ ఉపేంద్ర అయితే ఇంకా బాగుంటుందంట అనుకుంటున్నారు త్రివిక్రమ్. అవును పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ ప్రాజెక్ట్ లో ఉపేంద్ర రాజకీయ నాయకుడి అవతారం ఎత్తనున్నాడని టాక్. అల్రెడీ మంచి మనసున్న విలన్ గా ఉపేంద్రను సన్నాఫ్ సత్యమూర్తిలో ప్రెజెంట్ చేసారు త్రివిక్రమ్.

డిజాస్టర్ అజ్ఞాతవాసి తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు కేవలం 9నెలల్లో అరవింద సమేత పూర్తి చేసారు త్రివిక్రమ్. ఆ సినిమా 100కోట్లను వసూలు చేస్తే ఆ తర్వాత వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం 2020 ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది. అయితే తాను డైరెక్ట్ చేసే చిత్రాల్లో కథకు తగ్గట్టు పవర్ఫుల్ యాక్టర్స్ తో విలనిజాన్ని చూపిస్తాడు మాటల మాంత్రికుడు. జులాయిలో సోనూ సూద్, అజ్ఞాతవాసిలో ఆది పినిశెట్టి, అల వైకుంఠపురంలో సముద్రఖని, అరవింద సమేతలో జగపతి బాబు ఇలా ఇప్పుడు ‘అయినను పోయిరావలే హస్తినకు’ మూవీలో ఉపేంద్ర క్యారెక్టర్ ను తీర్చిదిద్దుతున్నారట.