నాని కొత్త సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘టక్ జగదీష్’…’ఏప్రిల్ 16’న విడుదలకానుంది. ఈ విషయాన్ని సంక్రాంతి గుడ్ న్యూస్ గా ప్రేక్షకులతో పంచుకుంది చిత్రయూనిట్. ఇలా నాని కొత్త సంవత్సరంలో…అదీ తెలుగు నూతన ఏడాదిలో మొదటి శుక్రవారం థియేటర్స్ కి రానున్నాడు. దీనికి సంబంధించి పెళ్లికొడుకును చేసే సందడితో కూడిన ఫోటోను తాజాగా షేర్ చేసారు.
‘నిన్నుకోరి’ తర్వాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇది. ‘మజిలీ’ వంటి మంచి హిట్ తో జోష్ మీదున్న డైరెక్టర్ శివ..ఈ సినిమాపై భారీ అంచనాలనే అందిస్తున్నాడు. ఇక ‘వి’ ఫ్లాప్ తర్వాత నానికి ఈ సినిమా హిట్ అనేది కీలకంగా మారింది. అందుకే ‘ప్లవనామ సంవత్సరం’లో ముహూర్తాన్ని సెట్ చేసుకున్నాడు. నాని అన్నయ్యగా ‘జగపతి బాబు’ నటిస్తోన్న టక్ జగదీష్ లో ఐశ్వర్య రాజేష్, రీతూవర్మ హీరోయిన్లు. నాజర్, నరేష్, రావు రమేష్, రోహిణి వంటి భారీతారగణమే ఉన్నారీ సినిమాలో.