‘అయినను పోయిరావలే హస్తినకు’…ఇది ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలోనే పట్టాలెక్కబోయే మూవీ. అయితే ఈ మూవీలో ప్రతినాయకుని పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఆ విలన్ ఉపేంద్ర అయితే ఇంకా బాగుంటుందంట అనుకుంటున్నారు త్రివిక్రమ్. అవును పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ ప్రాజెక్ట్ లో ఉపేంద్ర రాజకీయ నాయకుడి అవతారం ఎత్తనున్నాడని టాక్. అల్రెడీ మంచి మనసున్న విలన్ గా ఉపేంద్రను సన్నాఫ్ సత్యమూర్తిలో ప్రెజెంట్ చేసారు త్రివిక్రమ్.

డిజాస్టర్ అజ్ఞాతవాసి తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు కేవలం 9నెలల్లో అరవింద సమేత పూర్తి చేసారు త్రివిక్రమ్. ఆ సినిమా 100కోట్లను వసూలు చేస్తే ఆ తర్వాత వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం 2020 ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది. అయితే తాను డైరెక్ట్ చేసే చిత్రాల్లో కథకు తగ్గట్టు పవర్ఫుల్ యాక్టర్స్ తో విలనిజాన్ని చూపిస్తాడు మాటల మాంత్రికుడు. జులాయిలో సోనూ సూద్, అజ్ఞాతవాసిలో ఆది పినిశెట్టి, అల వైకుంఠపురంలో సముద్రఖని, అరవింద సమేతలో జగపతి బాబు ఇలా ఇప్పుడు ‘అయినను పోయిరావలే హస్తినకు’ మూవీలో ఉపేంద్ర క్యారెక్టర్ ను తీర్చిదిద్దుతున్నారట.