రీసెంట్ గా 100కోట్ల క్లబ్ లో చేరింది ఉప్పెన. దీంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అడక్కుండానే ఉప్పెన టీమ్ పై వరాల జల్లు కురుపిస్తోంది. నిజానికి 50లక్షల పారితోషకాన్ని వైష్ణవ్ తేజ్ తో మాట్లాడుకున్నారు. కానీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు కోటి రూపాయలు అదనంగా ఇచ్చారట. అంటే డబుల్ బొనాంజాలా మనీ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. అలాగే కృతిశెట్టికి సైతం 25లక్షల రూపాయలను బహుమతిగా అందించినట్టు చెప్తున్నారు.

ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారాడు వైష్ణవ్ తేజ్. ఇప్పటికే డైరెక్టర్‌ క్రిష్‌ కాంబినేషన్లో ‘జంగిల్‌ బుక్’‌ పూర్తి చేసాడు ఈ మెగా హీరో. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ ప్రాజెక్ట్ తర్వాత అన్నపూర్ణ బ్యానర్‌లో ఓ చిత్రం..ఆపై భోగవల్లి ప్రసాద్‌ బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్ కి కమిటయ్యాడు. నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మించబోయే సినిమాలో హీరోగా మొదట నానిని అనుకున్నారట. కానీ నాని రిజెక్ట్ చేయడంతో అదే కథతో సినిమా చేయబోతున్నాడు వైష్ణవ్ తేజ్.

రోజురోజుకీ పెరుగుతున్న కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది ఉప్పెన చిత్రం. తాజాగా ఈ సినిమాను నంద‌మూరి బాల‌కృష్ణ త‌న కుటుంబంతో క‌లిసి వీక్షించారు. డైరెక్టర్ బుచ్చిబాబు కోరిక మేరకు ఉప్పెన చూసిన బాలయ్యబాబు… సినిమా చాలా బాగుంద‌ని చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారు. డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి బాలకృష్ణ దిగిన ఫోటో వైరల్ గా మారింది.

మరోవైపు ఉప్పెన టీమ్ కు కానుకలు అందిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. నిన్ననే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కి ఓ లేఖతో పాటూ గిఫ్ట్ పంపిన మెగాస్టార్…తాజాగా కృతిశెట్టిని సైతం ప్రశంసిస్తూ గిఫ్ట్ సెండ్ చేసారు. ఈ ఇద్దరూ కూడా మెగా కానుక నిజంగా అదృష్టమని భావిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తంచేసారు. అయితే దాదాపు ఉప్పెన టీమ్ మొత్తానికి మెగాస్టార్ ప్రశంసల కానుకలు పంపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఉప్పెన సినిమా టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అవ్వడంతో.. తమిళ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఈ మూవీ రీమేక్ హక్కులు విజయ్ సేతుపతి దక్కించుకున్నారు. అయితే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు సంజయ్ ను ఈ మూవీతో పరిచయం చేయాలని చూస్తున్నారు. ఇక సేం తెలుగులో చేసిన విలన్ రోల్ లోనే విజయ్ సేతుపతి కనిపించనున్నారు.

కలెక్షన్ల విషయంలో.. ఇప్పటికే 50 కోట్ల మార్క్ ను దాటేసింది ఉప్పెన సినిమా. రోజు రోజుకి సినిమా కు రెస్పాన్స్ పెరిగిపోతోంది. ఈ రెండు రోజుల్లోనే ఉప్పెన 60 కోట్ల మార్క్ ను దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న ఉప్పెన సినిమా టీమ్ విజయోత్సవాలు చేయబోతున్నారు. 17న రాజమండ్రిలో సక్సెస్ మీట్ తో పాటు సంబరాలు చేయబోతున్నారు. ఈ వేడుకలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు ప్రకటించారు.

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటించిన ఉప్పెన ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది. అయితే విడుదలకు ముందే కాల్షీట్స్ ఖాళీ లేకుండా చేసుకుంటోంది హీరోయిన్ కృతిశెట్టి. మొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి అన్న మాటలు అక్షరాల నిజమవుతున్నాయి. ఈ అమ్మాయి డేట్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి…లేదంటే మీకు దొరక్కపోవచ్చు అని కామెంట్ చేసారు చిరూ. దానికి తగ్గట్టే ప్రస్తుతం కృతి జపం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. దాదాపు సంవత్సరం నుంచి వినిపిస్తోన్న పాటలు, ఫస్ట్ లుక్, టీజర్స్ నుంచి రీసెంట్ ట్రైలర్ వరకు కృతిశెట్టిని చూసిన కుర్రకారు దాసోహం అంటోంది.

ఇప్పటికే నాని శ్యామ్ సింగ రాయ్ మూవీతో పాటూ మోహనకృష్ణ ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబో చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది కృతిశెట్టి. కాగా తాజాగా అక్కినేని వారసుడితో నటించే ఛాన్స్ కొట్టేసింది. అక్కినేని అఖిల్ సరసన కృతిశెట్టి నటించబోతుందనే వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్న సినిమాలోనా, వేరే ప్రాజెక్ట్ లోనా అన్నది తెలియాల్సిఉంది. ఎందుకంటే సురేందర్ రెడ్డి మూవీలో వైద్యాసాక్షి అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారని ఇప్పటికే వార్తలొచ్చాయి. మరి ఆ భామని కృతిశెట్టితో రీప్లేస్ చేస్తున్నారా అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.