నిన్నమొన్నటిదాకా నిజమా, కాదా అన్నట్టు వైరలయింది ఓ న్యూస్. కానీ అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి కలిసి వచ్చేది నిజమే అని దాదాపు కన్ఫర్మ్ అయింది. నలభై ఏళ్ల వయసున్న ఓ మహిళకు 25ఏళ్ల ఓ యువకుడికి ముడిపెట్టి ఓ కథను సిద్ధం చేసారట. టైటిల్ కూడా హీరోహీరోయిన్ల పేర్ల మీదే మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టిగా డిసైడ్ చేసినట్టు టాక్.
వయసు వ్యత్యాసం చాలా ఉన్న జంట మధ్య ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుందో చూపిస్తాడట డైరెక్ర్ మహేశ్. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్‌ అతిత్వరలో పట్టాలెక్కనుంది. అయితే కామెడిగా నవీన్, అనుష్కల అసలైన పేర్లనే ఇలా కామెడిగా వాడి టైటిల్‌గా మార్చేయడం బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ పేరే ఫిక్సవుతుందా? అన్నది చూడాలి.

అనుష్క సరసన నటించే ఛాన్స్ కొట్టేసాడట హీరో నవీన్ పొలిశెట్టి. డైరెక్టర్ మహేశ్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి డిఫరెంట్ లవ్ స్టోరిని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10ఏళ్ల వయసు తేడా ఉన్న ఓ ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో రారా కృష్ణయ్య ఫేం మహేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

బంపర్ ఆఫర్ అందుకున్నాడట జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్. ఓ మాస్ మసాలా కథతో హీరో రామ్ ను టెంప్ట్ చేసినట్టు టాక్. కథ విన్న రాన్ వెంటనే అనుదీప్ కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్, స్రవంతి మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని టాక్.

భలే ఛాన్స్ కొట్టేసింది జాతిరత్నాలు ఫేం ఫ‌రియా అబ్ధుల్లా. ఇప్పటికే ఈ అమ్మాయికి వరుస ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాటయి. కాగా మాస్ రాజా రవితేజ, త్రినాథ రావు నక్కిన కాంబినేషన్ సినిమాలో ఫరియాకు ఛాన్స్ ఇస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న ఖిలాడి అయినవెంటనే పట్టాలెక్కబోతున్న త్రినథరావు చిత్రంలో ఫరియానే హీరోయిన్ గా సెట్టయ్యే అవకాశం ఉంది

యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ రాసుకున్న కథతో ‘ఏక్‌ మినీ కథ’ అనే చిత్రం తెరకెక్కుతుంది. డజ్ సైజ్ మ్యాటర్? అనేది ఈ ప్రాజెక్ట్ టైటిల్ ట్యాగ్ లైన్. ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ యు.వి.క్రియేషన్స్‌ కి అనుబంధ సంస్థ యు.వి.కాన్సెప్ట్‌ బ్యానర్ పై కార్తీక్‌ రాపోలు రూపొందిస్తున్నారు. ప్రభాస్ ‘వర్షం’ డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్‌ శోభన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈమధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా…ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని చెప్తన్నారు మేకర్స్. కాగా ఈ చిత్రానికి రవీందర్ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పనిచేస్తుండగా గోకుల్ భారతి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నాడు.

ఓటీటీలో రిలీజైన నిశ్శబ్ధం తర్వాత ఇంతవరకూ అనుష్క నటించిన ఏ సినిమా రాలేదు. అసలు ఆమె ఏ సినిమాకు సైన్ చేయలేదు. ఇన్నిరోజులూ షూటింగ్స్ లేకుండా ఖాళీగానే గడుపుతోంది. అయితే ఎన్నో ఆలోచనల తర్వాత ఓ ఫ్లాప్ డైరెక్టర్ కథకు ఓకే చెప్పింది. రారా కృష్ణయ్య ఫేం పి.మహేశ్ డైరెక్షన్లో నటించేందుకు అంగీకరించింది. మునుపెన్నడూ రాని మహేశ్ చెప్పిన ఓ డిఫరెంట్ సబ్బెక్ట్ కి బాగా కనెక్ట్ అయ్యిందట అనుష్క.

యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. వాళ్లు సినిమా మొదలేట్టేందుకు సిద్ధంగానే ఉన్నారట. అయితే అనుష్క సైడ్ నుంచి ఎలాంటి మాట వినిపించడం లేదని…కాల్షీట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదనే టాక్ నడుస్తోంది. మరోవైపు స్వీటీ అసలు ఇక్కడ లేదని…ఫారెన్ నుంచి రాగానే ముహూర్తం ఫిక్స్ చేస్తారనీ అంటున్నారు. మరి వ్యక్తిగత కారణాలేవైనా…అనుష్కను ముందుకు కదలనీయడం లేదా అన్నది తెలియాల్సిఉంది. అయితే అనుష్క కాల్షీట్స్ అడ్జస్ట్ అవ్వగానే ఈ మూవీ అప్డేట్ తో పాటూ…ఓ థ్రిల్లింగ్ న్యూస్ చెప్తారట యూవీ క్రియేషన్స్ నిర్మాతలు.

డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజాహెగ్దే ఎలా ఉండబోతున్నారన్న సస్పెన్స్ కు ఫిబ్రవరి 14తో తెరపడనుంది. అంతేకాదు పూర్తి సినిమాతో వీళ్లిద్దరూ ఎప్పుడు వస్తున్నారో కూడా అదే రోజు తెలిసే ఛాన్స్ కూడా ఉంది. అవును దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న రాధేశ్యామ్ టీజర్ అండ్ రిలీజ్ డేట్ ఈ 14న వాలంటైన్స్ డే కానుకగా విడుదల చేయనున్నారు. రాధేశ్యామ్ మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తయినా ఇంతవరకూ ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అయితే ఈ చిత్రం పీరియాడికల్‌ లవ్‌స్టోరీ కథాంశంగా తెరకెక్కించడంతో ప్రేమికుల రోజునే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. రాధాకృష్ణ డైరెక్షన్లో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథా చిత్రం పాన్ ఇండియన్ మూవీగా 5 భాషలలో విడుదలకు రెడీఅవుతోంది.

యువీ కృష్ణంరాజు సమర్పణలో… యువి క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై వంశీ ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ లవ్ స్టోరీలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే రోల్ లో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణగా మ్యూజిక్ టీచర్‌ రోల్ చేస్తున్నారని టాక్. అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీతో పాటూ సచిన్ కేడ్కర్, సాషా ఛత్రీ, ప్రియదర్శి వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌ సీన్స్ కోసమే దాదాపు 30 కోట్ల రూపాయల ఖర్చుతో స్పెషల్ సెట్స్‌ వేసినట్టు వార్తలొచ్చాయి. ఇక ఆస్కార్‌ సాధించిన ‘గ్లాడియేటర్‌’ మూవీకి యాక్షన్‌ కొరియోగ్రఫీ సెట్ చేసిన నిక్‌ పోవెల్‌ ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’కి సైతం పనిచేస్తుండటం మరింత ఆసక్తిని పెంచింది.