హీరోగా నటిస్తూనే ఇతర భాషల్లోని సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న మలయాళీ స్టార్ మోహన్‌లాల్‌. ఈమధ్యే దృశ్యం – 2తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఆయన తెలుగులో మరోసారి నటించేందుకు రెడీ అవుతున్నారని టాక్‌. అక్కినేని అఖిల్ హీరోగా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. స్పై థ్రిల్లర్‌ కథాంశంగా రాబోతున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ కీ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ఇప్పటికే ఆయనతో డిస్కషన్ కూడా చేసారట. ఈ సినిమాలో కనిపించేందుకు మోహన్‌లాల్‌ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

అమెరికన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ది బార్న్’ సిరీస్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘అఖిల్ 5’ వర్కింగ్‌ టైటిల్‌ తో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై అనిల్‌ సుంకర ప్రొడ్యూస్ చేస్తుండగా సురేందర్‌రెడ్డి సహ నిర్మాత కూడా మారుతున్నారు. అయితే ఇందులోనే వరలక్ష్మి శరత్ కుమార్ సైతం నెగెటివ్ రోల్ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వరలక్ష్మిని కూడా మూవీ యూనిట్ సంప్రదించిందని టాక్. మొత్తానికి అఖిల్ కి సపోర్ట్ గా వరలక్ష్మీతో పాటూ మోహన్ లాల్ కూడా రంగంలోకి దిగుతున్నారన్నమాట.

చేయని తప్పుకి జైలు జీవితం అనుభవిస్తున్న ఓ యువకుడు ఎలా బయటకు వచ్చాడన్న కథాంశంతో రూపొందిన చిత్రం ‘నాంది’. అల్లరి నరేశ్ హీరోగా…వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసారు. ఈమధ్యే థియేటర్లలో రిలీజై సక్సెస్ టాక్ సంపాదించింది. ఇక అతిత్వరలోనే…అంటే మార్చి 12వ తేదీనే ఆహా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. సతీశ్‌ వేగేశ్న నిర్మించిన నాందితో అల్లరి నరేష్ తన సినీజీవితానికి సరికొత్త నాంది పలికారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతో వరలక్ష్మికి సైతం తెలుగులో అవకాశాలు పెరుగుతున్నాయి. స్నేహితుడిగా నటించిన ప్రియదర్శి సైతం మంచి పేరుతెచ్చుకున్నాడు.

‘క్రాక్‌’, ‘నాంది’ సినిమాల్లో వరలక్ష్మి నటన చూసి ఫిదా అయిన త్రివిక్రమ్‌ NTR30లో ఓ రోల్‌ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకురాలిగా వరలక్ష్మీ కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఇప్పటికే దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. అటు బన్నీ, కొరటాల శివ ప్రాజెక్ట్ లోనూ వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ పొలిటిషియన్ గా నటించబోతుందంటూ వార్తలొస్తున్నాయి.
సెప్టెంబర్లో సెట్స్ మీదికెళ్తున్న ఈ మూవీ కోసం ఆల్రెడీ వరలక్ష్మీతో చర్చలు జరిగాయట. జలకాలుష్యం నేపథ్యంగా కమర్షియల్ యాంగిల్ స్క్రిప్ట్ రెడీ చేసిన కొరటాల శివ ఈ సినిమాలో బన్నీని స్టూడెంట్ గా, రాజకీయ నాయకుడిగా చూపించబోతున్నాడు. బన్నీని ఢీకొట్టే రాజకీయనాయకురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో కూడా ఆమె రాజకీయ నాయకురాలి పాత్రే చేస్తుంది అంటున్నారు. ఏది నిజం…లేదా రెండు సినిమాల్లో లేడీ పొలిటిషియన్ లాగానే వరలక్ష్మీ కనిపిస్తోందా అన్న చర్చ జోరందుకుంది. చూస్తుంటే వరలక్ష్మీ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా మాత్రం కనిపించడం లేదు.

ప్రస్తుతం తమిళనాడులోని టెన్‌కాశీలో పుష్ప షూటింగ్ చేస్తోన్న అల్లు అర్జున్ తర్వాతి సినిమా గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. కొరటాల శివ డైరెక్షన్లో అల్లు అర్జున్ కమిటైన మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ దాదాపు ఫిక్సయినట్టే అంటున్నారు. ఇందులో బన్నీ రెండు వేరియన్స్ ఉన్న పాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఒకటి స్టూడెంట్ రోల్, మరొకటి రాజకీయ నాయకుడిగా బన్నీ కనిపిస్తారట. సినిమా ద్వితియార్ధంలో పవర్ఫుల్ రాజకీయ నాయకుడిగా బన్నీ కనిపిస్తే…ఆయన్ని ఢీకొట్టే పాత్రలో పోటాపోటిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్నట్టు టాక్.

క్రాక్, నాంది సినిమాల తర్వాత వరలక్ష్మికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్స్ ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈమధ్యే అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి సైతం వరలక్ష్మిని సంప్రదించారు. ఇప్పుడు బన్నీ మూవీ కోసం సైతం కొరటాల శివ ఆమెతో మాట్లాడినట్టు చెప్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆమె పాత్రపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

హీరో పాత్రలే కావాలని ఒకరు, కథానాయికగానే మెప్పించాలని మరొకరు ఎప్పుడూ ఎదురుచూడరు. పాత్ర నచ్చితే ఎలాంటిదైనా, ఎంత నిడివి ఉన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కలకాలం ఆ రోల్…రోల్ మోడల్ అయ్యేలా కష్టపడైనా సరే నటించి చూపిస్తారు. వాళ్లే విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్. అసలు ఓవైపు హీరోగా చేస్తూనే…మరోవైపు తండ్రి పాత్ర అది కూడా టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించాలంటే ఎవరూ సాధారణంగా ముందుకు రారు. కానీ విజయ్ సేతుపతి వచ్చారు. ఉప్పెనతో ఇరగదీసారు. వహ్వా అనిపించారు. అలాగే నడి వయస్సు పాత్రలో రౌడీగా కనిపించాలంటే ఏ హీరోయిన్ అంగీకరించదు. కానీ క్రాక్ తో కిర్రాక్ పుట్టించారు వరలక్ష్మీ శరత్ కుమార్.

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో ఇప్పుడు వీళ్లిద్దరి గురించే చర్చ నడుస్తోంది. ఎలా ఇలా నటించగలుగుతున్నారనే ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు స్టార్ నటులు, దర్శకులు. హీరోగా, విలన్ గా, తండ్రిగా చివరికి సూపర్ డీలక్స్ చిత్రంలో ట్రాన్స్ జెండర్ గా కూడా నటించి నిజమైన హీరో అనిపించారు విజయ్ సేతుపతి. ఇప్పుడిక నాలుగు అడుగులు ముందుకు వేసి ఈయన బాలీవుడ్ బాట పడుతుంటే…వరలక్ష్మీని లేడీ విజయ్ సేతుపతి అన్న ట్యాగ్ లైన్ తో ఇప్పుడిప్పుడే సౌత్ మొత్తం గుర్తిస్తోంది. అల్లరి నరేశ్ నాంది సినిమాలో లాయర్ గా అద్భుతమైన నటనను ప్రదర్శించారట వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడామెకు వరుసగా ఆఫర్లు క్యూకడుతున్నాయి.