దృశ్యం-2’ యూనిట్ కి విక్టరీ వెంకటేశ్‌ బై బై చెప్పేసారు. ఆయన లీడ్ రోల్ చేస్తోన్న ‘దృశ్యం-2’ షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే ఇంతత్వరగా గురువారంతో వెంకీ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది. దృశ్యం ఫ్యామిలీతో ఉన్న వెంకీ పిక్ ను షేర్ చేసింది.
2014లో రిలీజైన దృశ్యం కు సీక్వెల్ గా దృశ్యం 2 వస్తోంది. ఆల్రెడీ ప్రైమ్ వేదికగా ఒరిజనల్ వర్షన్ రిలీజై మంచిపేరు సంపాందించింది. దీంతో వెంకీ సూపర్ ఫాస్ట్ స్పీడ్ తో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీఅవుతున్నారు. ఇప్పుడు తన పాత్ర షూటింగ్ కూడా పూర్తి కావడంతో కొన్నిరోజులు ఎఫ్ 3 కోసం సమయం కేటాయించనున్నారు. ఈ మూవీ కోసం టీమ్ తో కలిసి మైసూర్ వెళ్లనున్నారు వెంకటేశ్.

ఎఫ్2 బ్లాక్ బస్టర్ హిట్ తో అనిల్ రావిపూడి ఎఫ్3 తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఆల్ మోస్ట్ ఆల్ సేమ్ నటీనటులతో రూపొందిస్తున్నారు. భార్యభర్తల మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో ఎఫ్ 2 తెరకెక్కించగా…ఆ ఫ్యామిలిని డబ్బు పెట్టిన తిప్పలను ఎఫ్3లో చూపిస్తున్నారట.
అయితే ఈ మూవీలోఉన్న ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు కామన్. వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. అయితే ఇందులో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చాడట అనిల్ రావిపూడి. ఆ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాలి చౌహాన్ ను పట్టుకొస్తున్నట్టు సమాచారం.
నిజానికి ఈ సోనాలికి తెలుగు తెర కొత్తెమి కాదు. గతంలో నందమూరి బాలయ్యతో రెండు చిత్రాలు, రామ్ తో ఒక సినిమా చేసింది. అలాగే ఇంకొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా అవకాశాలు రాలేదు. అనిల్ తీసుకున్న నిర్ణయం నిజమైతే ఈ భామ కొంత గ్యాప్ తరువాత మళ్లీ తెలుగులో సందడి చేయబోతుంది.
ఇంతకుముందు కూడా ఎఫ్ 3 విషయంలో మరో హీరో ఉంటాడన్న ప్రచారం జోరుగా సాగింది. రవితేజ, సాయిధరమ్ తేజ్ ఇలా చాలామంది పేర్లే వినిపించాయి. కానీ అవేమి నిజం కాదు…అసలు మూడో హీరోనే లేడన్నారు అనిల్ రావిపూడి. మరిప్పుడు మూడో హీరోయిన్ అన్న న్యూస్ వైరల్ అవుతోంది. మరి సోనాలి నిజంగానే కనిపించనుందా అన్నది దర్శకనిర్మాతలే ప్రకటించాలి.

‘దృశ్యం 2’ సినిమా చిత్రీకరణలో ఎంట్రీ ఇచ్చారు కథానాయకి మీనా. 2014లో రిలీజై సూపర్‌ హిట్‌ అయిన ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో ప్రధానపాత్రల్లో భార్యభర్తలుగా నటించిన వెంకటేష్, మీనాయే ఈ సీక్వెల్‌లో కూడా కనిపించనున్నారు. సోమవారం నుంచి మీనా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే సినిమా కథాంశంతో సంబంధం లేకుండా ఓవర్ మేకప్ విషయంలో మలయాళీ దృశ్యంకి ఎదురైన అనుభవాలు…తెలుగు వర్షన్ కి ఎదురవకుండా మీనా జాగ్రత్తపడతారో..లేదో చూడాలి.

దృశ్యం – 2 సినిమాలో హీరోయిన్ పూర్ణ కూడా ఓ కీ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ముందుగా అనుకున్నట్టు సరితా, సాబు పాత్రల్లో సమంతా, రానా కాకుండా…రానా పోలీసాఫీసర్ రోల్ చేస్తుండగా…సరిత పాత్రను పూర్ణ చేయబోతున్నట్టు టాక్. సమంతా ఈ సినిమాలో కనిపించకపోవచ్చు. మలయాళ ఒరిజనల్ ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన క్రియేటివ్ జీతూ జోసెఫ్‌ తెలుగు ‘దృశ్యం 2’తో దర్శకుడిగా టాలీవుడ్ పరిశ్రమకి పరిచయం కాబోతున్నారు. వెంకీ నటిస్తోన్న ఎఫ్ 3 కంటే ముందే ఈ మూవీ జూలైలో రిలీజ్ కానుంది. అందుకే ఎక్కడా ఆగకుండా చకాచకా చేసేస్తున్నారు మేకర్స్.

పిచ్చి కాదు తమది ప్రేమంటుంది పూజా హెగ్దే. ఈ లవ్ స్టోరీ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని ఆమె మాటలవర్షం కురిపిస్తుంది. డార్లింగ్ ప్రభాస్ జోడీగా ఆమె నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. జూలై 30వ తేదీన విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌ను మూవీయ యూనిట్ రిలీజ్ చేసింది. ‘రాధేశ్యామ్‌’ తో పాటూ వెంకీ ‘నారప్ప’తో, రవితేజ ‘ఖిలాడీ’తో హల్చల్ చేస్తున్నారు. మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. ‘అన్నం’: పరబ్రహ్మ స్వరూపం అనే పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. టక్ జగదీష్, మోసగాళ్లు, ఇదే మా కథ, గ్యాంగ్ స్టర్ గంగరాజు వంటి సినిమాల నుంచి కూడా మహాశివరాత్రి స్పెషల్ పోస్టర్స్ వచ్చేసాయి.

హాలీవుడ్ తర్వాత బాలీవుడ్ కి మాత్రమే పరిమితం అనుకున్న సీక్వెల్స్ జోరు ఇప్పుడు టాలీవుడ్ లోనూ కనిపిస్తోంది. బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాల పార్ట్ 2 తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బడా హీరోల నుంచి యంగ్ స్టర్స్ వరకు… ప్రెజంట్ స్వీక్వెల్ జపం చేస్తుంది తెలుగు ఇండస్ట్రీ.

కొన్ని కథలు ఎప్పటికీ వావ్ అనిపిస్తాయి. ఇంకా ఉంటే బావుండు అనిపించేలా మెస్మెరైజ్ చేస్తాయి. అలాంటి కథలకు బాక్సాఫీస్‌విజయం దక్కితే ? కాంబినేషన్‌రిపీటవుతే బాగుండు అని ప్రేక్షకులు ఫీలవుతే? వీటికి తోడూ ఆ కథను కొనసాగించే స్కోప్‌ఉంటే…ఇంకేముంది సీక్వెల్ని మొదలెట్టే ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడలాగే టాలీవుడ్లో పార్ట్ 2 జోరు ఊపందుకుంది.

మలయాళీ రీమేక్ గా వచ్చి తెలుగులోనూ కాసులవర్షం కురిపించింది..దృశ్యం. వెంకటేశ్ లీడ్ రోల్ చేసిన ఈ మూవీ సీక్వెల్ ఈ మార్చి నుంచే షురూకానుంది. రీసెంట్ గా ఓటీటీ వేదికగా దృశ్యం సీక్వెల్ మలయాళంలో రిలీజై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. సో వెంకీ సైతం దృశ్యం పార్ట్ 1 తర్వాత ఏం జరిగిందో చూపించేందుకు రెడీఅయ్యారు. అంతేకాదు వరుణ్ తేజతో కలిసి ఎఫ్ 2 సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. ఎఫ్ 2కి మించిన కామెడీతో, కథతో ఎఫ్ 3ని సిద్ధం చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అంటే ఈ ఏడాది రెండు సీక్వెల్స్ తో థియేటర్స్ కి రానున్నారు వెంకటేశ్.

బంగార్రాజు ఈజ్‌బ్యాక్‌ అంటున్నారు నాగార్జున. 2016లో సొగ్గాడే చిన్ని నాయనా అంటూ హిట్ కొట్టిన నాగ్…ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్ రూపొందించే పనిలోఉన్నారు. బంగార్రాజు చుట్టూ అల్లుకున్న కథతో ఈ స్క్రిప్ట్ ను రెడీచేసాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. మార్చి నుంచి ఈ మూవీ సెట్స్‌ పైకెళ్లనుందని సమాచారం. అటు డబుల్ డోస్ ఇచ్చేందుకు ప్లాన్ చేసారు మంచు విష్ణు, శ్రీను వైట్ల. ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్‌ ‘ఢీ 2 : డబుల్‌డోస్‌’ టైటిల్‌తో ఈ సీక్వెల్‌తెరకెక్కనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.

‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ తేజ..ఇప్పుడా మూవీకి సీక్వెల్ గా చిత్రం1.1ను ప్రకటించారు. మొదటి భాగంతో ఉదయ్‌కిరణ్, రీమా సేన్‌వంటి యాక్టర్స్ ను పరిచయం చేసిన తేజ… ఈ సీక్వెల్ కోసం సుమారు 45 మంది కొత్తవాళ్లను తీసుకోనున్నారు. ఇక రామ్, పూరి జగన్నాథ్‌కాంబో మూవీ ‘ఇస్మార్ట్‌శంకర్‌’ చిత్రీకరణలో ఉండగానే సీక్వెల్‌ఉంటుందని అనౌన్స్ చేసారు పూరీ. ఈ సీక్వెల్‌కి ‘డబుల్‌ఇస్మార్ట్‌’ అనే టైటిల్‌కూడా రిజిస్టర్‌చేసారు. ఇవే కాదు అడవి శేష్ గూఢచారి రిటర్న్స్‌, నిఖిల్ కార్తీకేయ -2, విశ్వక్ సేన్ హిట్ -ది సెకండ్ కేస్, డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ అ!, జాంబీ రెడ్డి సినిమాలు కూడా సీక్వెల్స్ కథలతో సిద్ధంగా ఉన్నాయి.

ఈ మధ్యే అధికారికంగా ప్రారంభమైన దృశ్యం – 2 తెలుగు రీమేక్ గురించి ఓ వార్త ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రంలో రానా, సమంతా నటిస్తున్నారనే టాక్ నడుస్తోంది. మలయాళ ఒరిజినల్ చూసినవాళ్లకి సరిత, సాబు రోల్స్ గురించి తెలిసే ఉంటుంది. హీరో ఇంటి పక్క వాళ్లలా ఉండి అసలు నిజాన్ని రాబట్టాలనుకునే పోలీసాఫీసర్స్ వాళ్లు. ఇప్పుడా క్యారెక్టర్స్ లోనే రానా, సమంతా నటించబోతున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

వెంకీ నటించిన నారప్ప విడుదలకు సిద్ధమవుతుండగా…ఎఫ్ 3 సెట్స్ పైనుంది. కాగా మార్చి 5 నుంచి దృశ్యం -2 సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ఇక రానా నటించిన అరణ్య ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ కలయికలో నటిస్తోన్న అయ్యప్పనున్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. అటు సమంతా విజయ్ సేతుపతి, నయనతార కాంబినేషన్లో ఓ తమిళ్ సినిమా చేస్తుండగా…త్వరలోనే శాకుంతలం చిత్రీకరణలో పాల్గొనబోతుంది. ఇక ఇప్పుడు వెంకీ, రానా, సామ్ ముగ్గురు కలిసి దృశ్యం చూపిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.

వెంకటేష్‌, మీనా ప్రధానపాత్రల్లో 2014లో వచ్చిన మలయాళ రీమేక్‌ మూవీ ‘దృశ్యం’ మంచి సక్సెసైన సంగతి తెలిసిందే. తాజాగా ఓటీటీ వేదికగా దృశ్యం – 2 సైతం రిలీజై విమర్శకుల ప్రశంసలందుకుంటుంది. కాగా స్టోరీ బాగా నచ్చడంతో పార్ట్ 2లో సైతం నటించేందుకు అంగీకరించారు వెంకటేశ్. ఇక ‘దృశ్యం-2’కి రంగం సిద్ధం చేశారు. తెలుగులో మొదటి భాగాన్ని లేడీ డైరెక్టర్ శ్రీప్రియ డైరెక్ట్ చేయగా…దృశ్యం – 2కి మాత్రం మలయాళీ ఒరిజనల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి తాజాగా పూజా కార్యక్రమాలని హైదరాబాద్‌ నగరంలో నిర్వహించారు. మార్చి 5వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలాఉంటే పార్ట్‌-3కి సైతం దర్శకుడు జీతూ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇక తాజాగా ‘నారప్ప’ షూటింగ్ పూర్తి చేసుకున్న వెంకీ ‘ఎఫ్‌3’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇంతలోనే దృశ్యం 2ను మొదలెట్టారు.

అమెజాన్ ప్రైమ్ లో తాజాగా రిలీజై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది మలయాళ దృశ్యం – 2. మోహన్ లాల్, మీనాతో పాటూ సేమ్ కాస్ట్ ని రిపీట్ చేసి ఈ సీక్వెల్ ను తీసుకొచ్చాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఇంట్రెవెల్ బ్యాంగ్ ముందు నుంచి క్లైమాక్స్ వరకు తన స్క్రీన్ ప్లే ట్విస్ట్ లతో మాయచేసాడు. ఈ మాయకే పడిపోయి వెంకీ ఈ చిత్రానికి కూడా సై అన్నాడని తాజాగా ఆహాచిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలుగులో రెండవ దృశ్యానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వెంకటేశ్, మీనా ప్రధానపాత్రల్లో సేమ్ తారాగణాన్ని రిపీట్ చేస్తూ దృశ్యం తెలుగు సీక్వెల్ మార్చి 1నే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఒరిజనల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్షన్లో మార్చి 5 నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేసారని టాక్. ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ దక్కించుకున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుగులో దృశ్యం – 2ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నేడే అమెజాన్ ప్రైమ్ ఓటిటి వేదికగా విడుదలయింది దృశ్యం 2. అయితే కేవలం మలయాళ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంచారు. మొన్నటివరకు సౌత్ భాషలన్నింటిలో డబ్బింగ్ చేసి వదులుతారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడా మాట మారింది. ఎందుకంటే విక్టరీ వెంకటేశ్ ఈ సినిమాను రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాను ఈమధ్యే చూసిన వెంకీ దృశ్యం 2లో నటించేందుకు సుముఖంగా ఉన్నారని టాక్. అంతేకాదు ఒరిజినల్ వర్షన్ డైరెక్టర్ జీతూజోసెఫ్ దర్శకత్వంలోనే తెలుగులో కనిపించేందుకు అగ్రిమెంట్ సైతం చేసారని సమాచారం.
శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేశ్ నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈసారి మాత్రం ఒరిజనల్ డైరెక్టర్ మాత్రమే కావాలంటున్నారు. మొదటి భాగంలో ఉన్నట్టే మీనాతో పాటూ మిగిలిన తారాగణం ఇందులోనూ కనిపించనున్నారట. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనుంది. వెంకీ దృశ్యం 2కు సంబంధించి డేట్స్ కూడా అజ్జస్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. కాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన నారప్ప మే 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఎఫ్3 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేసి తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు నాగచైతన్య. లవ్ స్టోరీతో ఏప్రిల్ 16న లవర్ బాయ్ గా కనిపించేందుకు సిద్ధమైన చై…ఆ తర్వాతి ప్రాజెక్ట్ లో పోలీసాఫీసర్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అది కూడా పెళ్లిచూపులు డైరెక్టర్ కాంబినేషన్ లో. అవును తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నాగచైతన్య పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడని టాక్.

అయితే చైతన్య మామ వెంకటేశ్ తో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. నారప్ప, ఎఫ్ 3 తర్వాత వెంకీ, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ సినిమా కన్ఫర్మయినట్టు వార్తలొచ్చాయి. అయితే తాజాగా వెంకీతో కాదు నాగచైతన్యతో ఈ క్రేజీ డైరెక్టర్ మూవీ పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఓ షార్ట్ స్టోరీ ఓటీటీ వేదికగా పిట్టకథలుగా రిలీజ్ కానుంది. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా నటుడిగానూ అలరిస్తున్నారు. మరి తరుణ్ భాస్కర్ చైతో ఓకే అంటాడా…వెంకీమామతో కనక్ట్ అవుతాడా చూడాలి.