లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది ట్రిపుల్ ఆర్ . యాక్షన్ షూట్ తోపాటు ప్యాచప్స్ కంప్లీట్ చేస్తున్న RRR సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో కంటిన్యూ అవుతోంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ,బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబయ్ సెట్స్ లో జరుగుతోంది. విజయ దేవరకొండ సైతం ఇప్పట్లో ముంబై వదిలి వచ్చేలా లేడు. లైగర్ షూటింగ్ ఇంకా ముంబైలోనే చేస్తున్నారు పూరీ జగన్నాథ్.

చెర్రీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ట్రీట్ ఇచ్చిన చిరంజీవి ఆచార్య టీమ్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉంది. ఏప్రిల్ 2 నుంచి ఆచార్య సినిమా కోకాపెట్ లో మళ్లీ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ బెల్గాం ఆశ్రమంలో జరుగుతుంటే, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున నటిస్తోన్న సినిమా గోవాలో జరుగుతుంది. ఇక రామానాయుడు స్టూడియోలో శరవేగంగా దృశ్యం -2 షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు వెంకటేశ్.

మహేశ్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ గోవాలో జరుగుతుండగా… ఇటలీలో ఖిలాడీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు రవితేజ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో పుష్ప సీన్స్ ను టోలీచౌకిలో చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ గని సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో కొనసాగుతుంది. సాయిధరమ్ తేజ్, దేవా కట్టా సినిమా రిపబ్లిక్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోకల్ లొకేషన్స్ లోనే జరుగుతుంది.

స్టార్ హీరోయిన్ రష్మికకు ఎవరో సీక్రెట్ ఫ్రెండ్…ఓ రింగ్ ను గిఫ్ట్ గా పంపించారు. దానికి స్పందించిన రష్మిక నువ్వు పంపిన దాన్ని నేను పొందాను. నేను ఈ కానుక అందుకున్నానని, పంపిన వారు తెలుసుకోండి. నేను మీ సీక్రెట్ మెసేజ్ చదివాను. ఆ మెసేజ్ ను నేను ప్రేమిస్తున్నాను’ అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. అయితే ఇటీవలే విజయ్ దేవరకొండతో చట్టాపట్టాలేసుకుని ముంబై వీధుల్లో విహరించిన రష్మిక…ఇప్పుడిలా సీక్రెట్ ఫ్రెండ్ అంటూ ఎవరి గురించి చెప్తుందో అర్ధం కావట్లేదంటున్నారు ఆమె ఫ్యాన్స్. కాగా ఎంగేజ్ మెంట్ దాకా వెళ్లి క్యాన్సిల్ అయిన కన్నడ మాజీ లవర్ గురించి కాదుగా అని కొసరు చురకలు అంటిస్తున్నారు.

పచ్చీస్… ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా. శ్రీకృష్ణ, రామసాయి సంయుక్తంగా డైరెక్ట్ చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ ను కౌశిక్ కుమార్ క‌త్తూరి, రామ‌సాయి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠ‌ను రేకెత్తిస్తూ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ జోనర్ లో అద్భుతంగా పచ్చీస్ టీజర్ ను రౌడీబాయ్ విజయ్ దేవరకొండ విడుదల చేసారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్ రామ్స్ ఈ మూవీతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. శ్వేతా వ‌ర్మ లేడీ లీడ్ గా కనిపిస్తుంది.

Pachchis Movie Teaser, vijay devarkonda, Aha Chitram
Source: Telugu Filmnagar

జాతి రత్నాలు సినిమా క్లైమాక్స్ లో విజయ దేవరకొండ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇప్పుడలానే నాని కోసం కూడా విజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని టాక్.

దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని చేస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని సమాచారం. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఈ క్యారెక్టర్ కథను మలుపు తిప్పే అద్భుతమైన రోల్ అని చెప్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ పీరియాడిక్ మూవీ కావడంతో విజయ్ రోల్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాహుల్, రౌడీ బాయ్ కాంబోలో టాక్సీవాలా వచ్చింది. ఈ స్నేహంతోనే రాహుల్ అడగ్గానే ఒక చెప్పాడట విజయ్. అలాగే నానితో కూడా మంచి ర్యాపో వుంది విజయ్ కి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాలతో పేరుతెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ…ప్రస్తుతం వరుస సినిమాలకు సై అంటూ దూసుకుపోతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ‘పుష్పక విమానం’ నుంచి ‘సిలక’ అంటూ సాగే ఓ లిరికల్ వీడియో సాంగ్ ను అన్న విజయ్ దేవరకొండ చేత ఆవిష్కరింపజేసి…కామ్ గా రెండు మరో రెండు కొత్త సినిమాలను ప్రకటించేసాడు.

ప్రముఖ ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఆనంద్…ఓ సినిమాను అనౌన్స్ చేసాడు. బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని మూవీ ప్రొడక్షన్ లో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను మధురా ఎంటర్ టైన్ మెంట్స్ ఇంకా రోల్ కెమెరా విజువల్స్ కలిసి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అయితే డైరెక్టర్, ఇతర నటీనటులు ఎవరనే వివరాలను త్వరలోనే చెప్తారట.

ఆనంద్ దేవరకొండ ప్రకటించిన మరో మూవీ హై లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది. కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి తెరకెక్కించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులను మరికొన్ని రోజుల్లోనే అనౌన్స్ చేయనున్నారు.

source: aditya music

మార్చి 11వ తేదీ మహాశివ‌రాత్రి కానుక‌గా మూడు చిత్రాలు థియేటర్స్ కి రానున్నాయి. శర్వానంద్ శ్రీకారం, నవీన్ పొలిశెట్టి జాతి ర‌త్నాలు, శ్రీవిష్ణు గాలి సంప‌త్ సినిమాల విడుదలకు సిద్ద‌మ‌య్యాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు వీటి ప్రీ రిలీజ్ వేడుకలను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందిన లేటెస్ట్ కామెడీ మూవీ జాతిరత్నాలు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాను అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసాడు. జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం వరంగల్ లో గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఇక ఈ వేడుకకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రానున్నార‌ని కామెడి మీమ్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు.


గాలి సంపత్…శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం. దర్శకుడు అనిష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో లవ్‌లీ సింగ్ హీరోయిన్. వీరితో పాటు తనికెళ్లభరణి, రఘుబాబు, సత్య వంటివారు మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించారు. డైరెక్టర్ అనీల్ రావిపూడి స‌మ‌ర్ప‌కుడిగా మారారు ఈ సినిమాతో. గాలి సంపత్ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం 6గంటల‌కు జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్‌ వేదికగా జ‌ర‌గ‌నుంది. అయితే దీనికి ఇస్మార్ట్ హీరో రామ్ చీఫ్ గెస్ట్‌ గా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు

ఆనంద్ దేవరకొండ మరో కొత్త సినిమాతో మనముందుకు వచ్చాడు. ఎంట్రీ మూవీ దొరసాని ఆడకపోయినా…రీసెంట్ ఓటీటీ హిట్ మిడిల్ క్లాస్ మెలోడిస్ తో ఆకట్టుకున్నాడు. ఇక మూడో సినిమాకు కమల్ హాసన్ క్లాసిక్ హిట్ మూవీ పేరును పెట్టుకొని…పుష్పకవిమానం అంటున్నాడు. అన్న విజయ్ దేవరకొండ సమర్పణలో ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. దీనికే పుష్‌రక విమానం అనే టైటిల్‌ని ఫిక్స్ చేసారు. సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సీనియర్ నరేష్, శాన్వి మేఘన, గీత షైని వంటివారు కనిపించనున్నారు. అయితే డార్క్ కామెడీ మూవీగా ఈ సినిమాను మలుస్తున్నారు డెబ్యూ డైరెక్టర్ దామోదర.

రౌడీబాయ్, లేడీడాల్ కలిసి మరోసారి కనిపించబోతున్నారని టాక్. విజయ్ దేవరకొండతో కలిసి రష్మికా మందన్నా మెరవనుందని అంటున్నారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో సూపర్ పెయిర్ అనిపించుకున్న ఈ జంటను డైరెక్ట్ చేయబోయేది టాలీవుడ్ లెక్కల మాస్టారు. అవును సుకుమార్, విజయ్ కాంబోమూవీలో రష్మికాను ఫైనల్ చేసారట. ప్రస్తుతం పుష్ప కోసం కష్టపడుతోన్న రష్మిక ఎనర్జీకి ఫిదా అయిన సుకుమార్…తన నెక్ట్స్ సినిమాలో కూడా రష్మికనే తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ నెక్ట్స్ సినిమా హీరో విజయ్ దేవరకొండ కావడంతో వీరి జంట మరోసారి కలిసే అవకాశం లభించింది.

ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్ చేస్తోన్న విజయ్ దేవరకొండ..ఆ తర్వాత నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో ఓ మూవీకి సైన్ చేసారు. ఈ ప్రాజెక్ట్ తర్వాతే సుకుమార్ బడిలో చేరనున్నాడు. ఇక అప్పుడే వీరిద్దరితో కలిసి రష్మికా కొత్త పాఠాలు నేర్చుకోనుంది. ఓ వైపు సౌత్ టు నార్త్ వరు కమిట్మెంట్లతో బిజీగా ఉంది రష్మికా. ఆమెకు కూడా కొత్త సినిమాల్లో అడుగుపెట్టడానికి మరో సంవత్సరం పడుతుంది. దీంతో వచ్చే ఏడాది సుకుమార్ దర్శకత్వంలో రౌడీబాయ్, రష్మికా కలిసి నటిస్తారామో చూడాలి.

ఫ్రెంచ్ భాషలో సూపర్ సక్సెసైన వెబ్ మూవీ ‘వైట్ టైగర్’ను బేస్ చేసుకొని లైగర్ ను రూపొందిస్తున్నారట పూరీ జగన్నాథ్. రౌడీబాయ్ దేవరకొండ విజయ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ మూవీలో అందాలభామ అనన్య పాండే సైతం ఓ బాక్సర్ గానే నటిస్తోందనే ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో అనన్య పాండేకి… విజయ్ బాక్సింగ్ నేర్పిస్తుంటాడని సమాచారం.

పూరీ గత చిత్రాల్లానే ఈ ప్రాజెక్ట్ లో కూడా హీరో యాటిట్యూడ్ వెరైటీగా ఉండటంతో పాటు పూరీ జగన్నాథ్ తరహా డైలాగ్స్ తో అద్దిరిపోతుందని టాక్. అంతేకాదు ఇందులో పూరీ మార్క్ లవ్ – రొమాన్స్ – ఎమోషన్స్ కాంబినేషన్ కూడా ఎక్కువేనని అంటున్నారు. అదేవిధంగా రౌడీ బాయ్ గత చిత్రాల మాదిరిగానే ముద్దు సీన్స్ హీటెక్కిస్తాయట. ఇక రొమాంటిక్ సన్నివేశాలకే కొదవే లేదని సమాచారం. మరి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో పాటూ విజయ్ దేవరకొండ, అనన్య పాండే లకు కూడా ఇదే ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో అన్ని విధాలుగా అలరించేందుకు టీమ్ కష్టపడుతోంది.

అర్జున్ రెడ్డి…హీరో విజయ్‌ దేవరకొండకు ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా సైతం టాలీవుడ్ టు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ గా మారారు. ఇదే స్టోరితో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్‌సింగ్‌’ తీసి బాలీవుడ్ లోనూ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ప్రస్తుతం సందీప్‌… హిందీలో రణ్‌బీర్ కపూర్‌ హీరోగా ‘యానిమల్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. దీని తర్వాత విజయ్ దేవరకొండతో సందీప్ సినిమా ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది.

మరోవైపు రౌడీబాయ్.. పూరీ డైరెక్షన్ లో ప్యాన్‌ ఇండియన్ మూవీ ‘లైగర్‌’ కోస కష్టపడుతున్నాడు. దీని తర్వాత విజయ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ గా మారింది. అయితే సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ…ఈ క్రేజీ కాంబోను మళ్లీ కలిపేందుకు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రయత్నాలను మొదలుపెట్టిందట. ప్రజెంట్ చర్చలు నడుస్తున్నాయని, అంతా అనుకున్నట్టు జరిగితే 2022 సెకండ్ హాఫ్ లో ఈ మూవీ ప్రారంభం కావొచ్చనే వార్తలొస్తున్నాయి.