గ్యాంగ్‌స్టర్‌గా కనిపించడానికి చాలా కసరత్తులు చేస్తున్నారు హృతిక్‌ రోషన్‌. రెండు నెలలుగా ఈ పని మీదే ఉన్నారు హృతిక్‌. అయితే మే నుంచి అంతకు మించి కఠినమైన కసరత్తులు చేయాలనుకుంటున్నారట. తమిళ సినిమా ‘విక్రమ్‌ వేదా’ హిందీ రీమేక్‌లో హృతిక్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్ర చేయనున్నారు. విక్రమ్ వేదా ఒరిజనల్ వర్షన్ లో విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ పాత్రను, మాధవన్ పోలీస్ అధికారిగా కనిపించారు.

విక్రమ్ వేదా హిందీ రీమేక్ లో హృతిక్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తుండంగా, సైఫ్ అలీఖాన్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడని సమాచారం. కాగా తమిళ్ మూవీ డైరెక్టర్స్ పుష్కర్ – గాయత్రి దంపతులే హిందీలోనూ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ వేసవిలోనే ప్రారంభం కాబోతున్న ఈ ప్రాజెక్ట్ హృతిక్ రోషన్ 25వ సినిమా కావడం విశేషం.

మెగా డాటర్‌ కొత్త పెళ్లికూతురు నిహారిక కొణిదెల..త్వరలోనే ఓ మూవీతో వస్తున్నానట్టు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే పేరుతో మార్చి 19న తాను నటించిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. అపోలో సంస్థ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో తమిళ్ స్టార్‌ విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటింతడం విశేషం. ప్రేక్షకులకు ఇది నిజంగా ఓ సర్పైజ్. యువరాణి పాత్రలో నిహారికా కనిపిస్తుండగా .. యమధర్మరాజుగా విజయ్ సేతుపతి నటించారు.

లాస్ట్ ఇయర్ నిహారిక చైతన్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత రిలీజ్ కాబోతున్న ఆమె ఫస్ట్ మూవీ ఇదే. కాగా తాజాగా రికార్డుల వర్షం కురుపిస్తున్న ‘ఉప్పెన’ లోని హీరోయిన్‌ తండ్రిగా నటించి టాలీవుడ్ ప్రేక్‌ుకుల‌కు చాలా ద‌గ్గ‌రైన మక్కల్ సెల్వన్ విజ‌య్ సేతుప‌తి ఇలా యమధర్మ రాజుగా కనిపిస్తుండటం, కొత్త పెళ్లికూతురు నిహారికా యువరాణిగా నటించడం సినిమాకి కలిసొచ్చే అంశాలని అంటున్నారు.

విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా సమంత, ఫాహద్‌ ఫాజిల్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ సూపర్ డీలక్స్. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను సొంతం చేసుకొన్న సిద్ధేశ్వర వైష్ణవి ఫిల్మ్స్ సంస్థ… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఉప్పెనతో సేతుపతి పాపులారిటీ అమాంతం పెరగడం…మనకు తెలిసిన సమంతా, రమ్యకృష్ణ వాంటి వారు ఇందులో నటించడం సూపర్ డీలక్స్ కి కలిసొచ్చే అంశాలు.

ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీలో విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యారనే వార్త హల్చల్ చేస్తోంది. ముందు సునీల్ శెట్టి అనుకున్నా…చివరికి సేతుపతే కరెక్ట్ అని భావిస్తున్నారట మేకర్స్. అటు స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రామ్ చరణ్ నటించబోతున్న సినిమాపై రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా ఇందులో విలన్ గా విజయ్ సేతుపత కనపించనున్నాడనే టాక్ నడుస్తోంది.

హీరో పాత్రలే కావాలని ఒకరు, కథానాయికగానే మెప్పించాలని మరొకరు ఎప్పుడూ ఎదురుచూడరు. పాత్ర నచ్చితే ఎలాంటిదైనా, ఎంత నిడివి ఉన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కలకాలం ఆ రోల్…రోల్ మోడల్ అయ్యేలా కష్టపడైనా సరే నటించి చూపిస్తారు. వాళ్లే విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్. అసలు ఓవైపు హీరోగా చేస్తూనే…మరోవైపు తండ్రి పాత్ర అది కూడా టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించాలంటే ఎవరూ సాధారణంగా ముందుకు రారు. కానీ విజయ్ సేతుపతి వచ్చారు. ఉప్పెనతో ఇరగదీసారు. వహ్వా అనిపించారు. అలాగే నడి వయస్సు పాత్రలో రౌడీగా కనిపించాలంటే ఏ హీరోయిన్ అంగీకరించదు. కానీ క్రాక్ తో కిర్రాక్ పుట్టించారు వరలక్ష్మీ శరత్ కుమార్.

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో ఇప్పుడు వీళ్లిద్దరి గురించే చర్చ నడుస్తోంది. ఎలా ఇలా నటించగలుగుతున్నారనే ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు స్టార్ నటులు, దర్శకులు. హీరోగా, విలన్ గా, తండ్రిగా చివరికి సూపర్ డీలక్స్ చిత్రంలో ట్రాన్స్ జెండర్ గా కూడా నటించి నిజమైన హీరో అనిపించారు విజయ్ సేతుపతి. ఇప్పుడిక నాలుగు అడుగులు ముందుకు వేసి ఈయన బాలీవుడ్ బాట పడుతుంటే…వరలక్ష్మీని లేడీ విజయ్ సేతుపతి అన్న ట్యాగ్ లైన్ తో ఇప్పుడిప్పుడే సౌత్ మొత్తం గుర్తిస్తోంది. అల్లరి నరేశ్ నాంది సినిమాలో లాయర్ గా అద్భుతమైన నటనను ప్రదర్శించారట వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడామెకు వరుసగా ఆఫర్లు క్యూకడుతున్నాయి.

ఉప్పెన సినిమా టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అవ్వడంతో.. తమిళ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఈ మూవీ రీమేక్ హక్కులు విజయ్ సేతుపతి దక్కించుకున్నారు. అయితే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు సంజయ్ ను ఈ మూవీతో పరిచయం చేయాలని చూస్తున్నారు. ఇక సేం తెలుగులో చేసిన విలన్ రోల్ లోనే విజయ్ సేతుపతి కనిపించనున్నారు.

కలెక్షన్ల విషయంలో.. ఇప్పటికే 50 కోట్ల మార్క్ ను దాటేసింది ఉప్పెన సినిమా. రోజు రోజుకి సినిమా కు రెస్పాన్స్ పెరిగిపోతోంది. ఈ రెండు రోజుల్లోనే ఉప్పెన 60 కోట్ల మార్క్ ను దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న ఉప్పెన సినిమా టీమ్ విజయోత్సవాలు చేయబోతున్నారు. 17న రాజమండ్రిలో సక్సెస్ మీట్ తో పాటు సంబరాలు చేయబోతున్నారు. ఈ వేడుకలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు ప్రకటించారు.

ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి…నెక్ట్స్ లూసిఫర్ రీమేక్ పనులను షురూ చేయనున్నారు. మోహన్ రాజా డైరెక్ట్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో నటించనున్నారు. అయితే ఈ రెండు కాకుండా డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు చిరంజీవి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. అయితే ఈ చిత్రంలో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి చిరూకి ధీటుగా విలన్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఉప్పెనలో విజయ్ నటనకు ముగ్ధుడైన చిరూ…అడిగిమరీ విజయ్ సేతుపతిని ప్రతినాయకుడిగా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం.

చిరూ విలన్ సంగతలా అంటే ఎప్పటినుంచో సరైన ప్రతినాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు బోయపాటి – బాలకృష్ణ. అయితే వీరిద్దరి మూడో కాంబోమూవీలో విలన్ గా సునీల్ శెట్టి దాదాపు ఫిక్స్ అయనట్టేనని టాక్. త్వరలోనే ఆయన బాలయ్యతో పాటూ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. జగపతిబాబు, శ్రీకాంత్, అర్జున్…ఇలా చాలామందిని అనుకొని చివరికి సునీల్ శెట్టి దగ్గర ఆగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అఘోరా వేషంలో షూటింగ్ చేస్తున్న బాలయ్యబాబు…త్వరలోనే సునీల్ శెట్టిని ఢీకొట్టే సీన్స్ లో నటించనున్నారు.

ఆ ఇద్దరితో నటిస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉందంటున్నారు సమంతా అక్కినేని. వారేవరో కాదు నయనతార, విజయ్ సేతుపతి. అయితే సూపర్ డీలక్స్ సినిమాలో సామ్, విజయ్ సేతుపతి నటించినా వీళ్లిద్దరికీ కాంబినేషన్ సీన్స్ లేవు. దీంతో ఆ కల…కలలానే మిగిలింది. ఇప్పుడిక జాక్ పాట్ కొట్టినట్టు తన ఫేవరేట్స్ నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఒకే సినిమాలో నటిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సమంతా.

బిజీబిజీగా అయితే ఉన్నారు కానీ పెద్దగా సినిమాలు అంగీకరించట్లేరు సామ్. ధి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం నయన్ లవర్ విఘ్నేశ్ శివన్ సినిమాతో పాటూ గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న శాకుంతలం ప్రాజెక్ట్స్ లాక్ చేసారు సామ్. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ్ మూవీలోనే పవర్ ఫుల్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతితో పాటూ నయనతారతో కలసి నటిస్తున్నారు సమంత. ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ మూవీతో తీరుతుందని అంటున్నారు.

సినీ ప‌రిశ్ర‌మ‌లో టాకీ చిత్రాలు రాకమందు మూకీ చిత్రాలు అలరించాయి. అయితే మాట్లాడే సినిమాలొచ్చాక మూకీకి ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. అయినా సరే కమల్ హాసన్ ఓ ప్రయోగం చేసారు. సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో పుష్పక విమానంలో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మాటలే లేకుండా తీసిన మూకీ సినిమా పుష్పక విమానంతో విజయం సాధించారు కూడా. అయితే కమల్ కి ప్రయోగలంటే మహా సరదా. నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు తాపత్రయపడుతుంటారు కమల్ హాసన్. ఇప్పుడలాగే విజయ్ సేతుపతి తమిళ్ తెరపై మెరుస్తున్నారు. తాజాగా గాంధీ టాక్స్ అంటూ సైలెంట్ గా రచ్చ చేయబోతున్నారు.
రీసెంట్ గా మ‌క్క‌ల్ సెల్వ‌న్ సేతుప‌తి విజయ్ మూకీ ప్ర‌యోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజ‌య్ సేతుప‌తి నటిస్తున్నాడంటేనే ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందనేంత క్రేజ్ తెచ్చుకున్నారు. రీసెంట్ మాస్టర్ కూడా విజయ్ సేతుపతి విశ్వరూపాన్ని చూపించింది. హీరోగా చిత్రాలు చేస్తూనే.. మ‌రోవైపు విల‌న్‌గా మెప్పిస్తన్నారు.. పాత్ర ఏదైనా త‌న స్పెషాలిటీని చాటుకుంటున్నారు. ఇప్పుడిక మాట‌లు లేని మూకీ సినిమాలో నటించేందుకు రెడీఅయ్యారు విజ‌య్ సేతుప‌తి. కిషోర్ పాండురంగ్ బేలెక‌ర్ డైరెక్షన్ లో ఈ మూకీ డ్రామా రూపొందుతుంది. గాంధీ టాక్స్ అనే టైటిల్‌తో ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. బ్యాగ్రౌండ్ మొత్తం క‌రెన్సీ నోట్ల‌తో నింపేయ‌డం హైలైట్ గా మారింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దీనిని ప్లాన్ చేసారు.

ఒక్క మాటలో …

తమిళ స్టార్ హీరో …గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం…అయినా సరే… తెలుగు ప్రేక్షకులు పూర్తిగా అంగీకరించని, తెలుగులో పెద్దగా మార్కెట్ లేని హీరో…విజయ్. కానీ ఫస్ట్ టైమ్ ఎప్పుడూ లేనంత బజ్ క్రియేట్ చేస్తూ ఆరు వందలకు పైగా తెలుగు తెరలపై మాస్టర్ బొమ్మ పడింది. నిజానికి మాస్ ఎలిమెంట్స్ ని మేజిక్ చేసి చూపించిన ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే దళపతి విజయ్ తో పాటు సేతుపతి విజయ్ కూడా నటించడం కలిసొచ్చింది. ఇంకేముంది పండగ సందడిని క్యాచ్ చేసేందుకు మార్నింగ్ నుంచే పాఠాలు మొదలెట్టాడు మాస్టర్ విజయ్. చిరూ సూపర్ హిట్ మాస్టర్ పేరునే పెట్టుకొని రచ్చ చేయడానికి వచ్చిన ఈ డబ్బింగ్ మాస్టర్ ఎలా ఉంది? కథాకమామిషు ఏంటి?…తెలుసుకుందాం.

ఇదీ కథ…

ఓ తాగుబోతు లెక్చరర్ గా ఎంట్రీ ఇస్తాడు హీరో విజయ్. డ్రింకర్ అయినా…పాఠాల్లో, మంచి చెప్పడంలో నంబర్ 1. హీరోకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది కాలేజీలో. అక్కడే పని చేసే హీరోయిన్ (మాళవిక మోహనన్) చారులతతో ప్రేమ ప్రయాణం సాగిస్తుంటాడు. అయితే కాలేజ్ లో గొడవ కారణంగా అక్కడి నుంచి బయటికొచ్చి బాల నేరస్థుల జువెనైల్ హోమ్ కు టీచర్ గా వెళతాడు. ఆ హోమ్ ని…అక్కడి బాల నేరస్థులను తన చెప్పుచేతల్లో నడిపిస్తుంటాడు విలన్ విజయ్ సేతుపతి (భవాని). ఈ విషయం మాస్టర్ విజయ్ కి తెలియడం, విలన్ ఎత్తుగడలను తొక్కేస్తుండటం, చివరికి ఇద్దరు బరిలోకి దిగడం… ఇదీ స్థూలంగా కథ.

ఇదీ నటన

మొదటినుంచీ కమర్షియల్ చిత్రాలను ఎంచుకొని నటించడానికి స్కోప్ లేకుండా చేసుకున్నాడు విజయ్. నటనలో లెవెల్ చూపించక పోయినా…విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ అప్పెరీన్స్ విజయ్ సొంతం. ఈ రీజన్ తోనే ఇంతకాలం నుంచి స్టార్ హీరోగా ట్రెండ్ సృష్టిస్తున్నాడు. అయితే మనం మొదటే చెప్పుకున్నట్టు ఆరవ ప్రేక్షకులు ఆరాధించినట్టు…మనవారు విజయ్ ని 50% కూడా ఓన్ చేసుకోలేకపోయారు. సరే..మాస్టర్ విషయానికొస్తే, పుష్కలంగా ఉన్న మాస్ ఎలవేషన్స్ లో దూసుకుపోయాడు. అలవాటైన పనే కాబట్టి అలవోకగా నటించాడు.
విజయ్ సేతుపతి…ప్రస్తుతం అన్ని భాషల్లో ఫాలోయింగ్ ఉన్న నటుడు. హీరోగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నా…వేరే హీరో నటిస్తున్న సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ నటనకు పట్టం కడుతున్నాడు విజయ్ సేతుపతి. ఇందులో కూడా అంతే గుండాగా రెచ్చిపోయాడు. విలన్ గా విశ్వరూపాన్ని చూపించాడు.
చాలా సన్నివేశాల్లో విజయ్ ని డామినేట్ చేసినట్టు అనిపించాడు సేతుపతి.

హీరోయిన్ మాళవిక మోహనన్ చూడటానికి అందంగా ఉంది. నటనపరంగా మాళవిక కన్నా ఆండ్రియా బాగా మెప్పించింది. ఇక మిగిలిన వాళ్ళందరూ వచ్చిపోతుంటారు. పెద్దగా గుర్తుంచుకునే స్కోప్ ఎవ్వరికీ లేదు.

ఇదీ డైరెక్షన్

నగరం, ఖైదీ చిత్రాలతో స్పెషల్ టేస్ట్ ఉన్న దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ పేరు సంపాదించాడు. కార్తీని ఖైదీగా చూపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే మాస్టర్ తో దారితప్పాడు లోకేష్. విజయ్ తో సినిమా అనగానే కమర్షియల్ యాంగిల్ పై కాన్సంట్రేట్ చేశాడు. అక్కడే స్టోరీ పై గ్రిప్ కోల్పోయాడు. కొన్ని హీరో ఎలివేషన్ సీన్స్ సహనానికి పరీక్ష పెడతాయి.

ఇదీ మిగిలింది

అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ తెలుస్తున్నాయి. ఇంతకు మించి చెప్పటానికి ఏమి లేదు.

కలిసొచ్చే అంశాలు

విజయ్ సేతుపతి యాక్టింగ్
విజయ్ ఎలివేషన్ సీన్స్
నేపథ్య సంగీతం
ఇంటర్వెల్ సీన్

కలిసి రానివి

సాగతీత
పాటలు
రెగ్యులర్ స్టోరీ

తీర్పు

మాస్టర్ బోర్ కొట్టించాడు

what’s your rating on Vijay’s Master Movie

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 2.67 out of 5)
Loading...

కత్రినా కైఫ్…ప్రస్తుతం వార్తల్లో పెద్దగా హల్చల్ చేయట్లేదీ పేరు. సల్మాన్, రణ్ బీర్ లతో లవ్ ఎఫైర్ బెడిసికొట్టాక కాస్త సైలంటయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీగా మారుతున్నారు. ఇక త్వరలోనే సౌత్ ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ అందించబోతున్నారు. కోలీవుడ్ సైలెంట్ స్టార్ విజయ్ సేతుపతితో త్వరలోనే ఓ సినిమాలో నటించబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తీయబోయే సినిమాలో విజయ్, కత్రినాలు జంటగా కనిపిస్తారట.
ఇప్పుడు తెలుగు, తమిళ్ లో రీమేక్ అవుతోన్న అంధాధూన్ సినిమాతో బాలీవుడ్ సూపర్ హిట్ కొట్టారు శ్రీరామ్ రాఘవన్. అప్పటినుంచి ఆడియెన్స్ ఈ డైరెక్టర్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి వరుణ్ ధావన్ హీరోగా ఎక్కిస్ అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసారు. కానీ వరుణ్ కూలీ నెంబర్ 1తో బీజీగా ఉండటంతో కార్యరూపం దాల్చలేదు. ఇక విజయ్ సేతుపతి, కత్రినా జంటగా అనుకొని స్క్రిప్ట్ పనులు చేస్తున్నారట. అయితే బాలీవుడ్ లో ఈ కాంబినేషన్ సంచలనాన్ని సృష్టిస్తోంది.