శాండిల్ వుడ్ స్టార్‌ యాక్టర్ సుదీప్‌ కి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశంలో ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ మాత్రమే సంపాందిచిన అటువంటి గుర్తింపు….ఇప్పుడు సుదీప్ సొంతమైంది. భారతీయ వెండితెరపై విలక్షణ నటుడన్న పేరుంది ఈ హీరోకి. రీసెంట్ గా ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా బిల్డింగ్ పై సుదీప్ లేజర్ షో వేసారు. ఆయన హీరోగా నటిస్తోన్న ‘విక్రాంత్‌ రోనా’ మూవీ టైటిల్‌ లోగోను, టీజర్‌ను ఈ లేజర్‌ షోతో బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ప్రపంచం మొత్తానికి ఓ కొత్త హీరో దొరికాడంటూ ప్రశంసలు కురిపించారు.

ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులు, ప్రభావిత వ్యక్తులతో పాటూ అతిముఖ్య సంఘటనలు మాత్రమే దుబాయ్ బూర్జ్ ఖలీఫా లేజర షో ద్వారా కనిపించే అదృష్టాన్ని దక్కించుకున్నాయి. ఇక ఇండియాపరంగా చూసుకుంటే షారుఖ్‌ ఖాన్ తర్వాత సుదీప్‌కే ఇంతటి ఘనత సొంతమైంది. దీంతో సుదీప్‌ ఫ్యాన్స్ ఫుల్‌ జోష్ మీదున్నారు. తాము అభిమానించే ఓ నటుడికి ఇలాంటి గౌరవం దక్కడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.