ఫలక్‌నుమా దాస్‌’ సినిమాతో హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు విశ్వక్‌సేన్‌. ఆ తర్వాత హిట్ చిత్రంతో ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. ఇక మే 1వ తేదీన ‘పాగల్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీఅయ్యాడు. నరేష్‌ కొప్పిలి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ని లక్కీ మీడియా హౌజ్, ఎస్వీసీ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తాజాగా రిలీజైన టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్నదానిపై క్లారిటీ మిస్ అయింది ఇన్ని రోజులు. తాజాగా రిలీజ్ చేసిన ఓ ఫోటోతో మా హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌ అని ప్రకటించింది మూవీయూనిట్. పాగల్ సరసన ‘తీరా’గా ఆమె నటిస్తోందంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మరో భామ సిమ్రన్‌ చౌదరీ కూడా ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.

విశ్వక్ సేన్ తాజా చిత్రం పాగల్ టీజర్ రిలీజైంది. ఈసారి హ్యాండ్సమ్ లుక్స్ తో ప్రేమ పిచ్చోడిలా నటిస్తున్నాడు విశ్వక్ సేన్. చేస్తున్న ప్రతి సినిమాతో నైపుణ్యాన్ని పెంచుకొంటున్న ఈ హీరో…ఈసారి యాక్టింగ్ స్కిల్స్, స్టైలిష్ ఎక్స్ ప్రెషెన్స్ తో ఇరగదీసాడని తెలుస్తోంది. ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. కాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ డిఫరెంట్ రోల్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమైంది.

యువహీరోలను బాగా ప్రోత్సహిస్తున్న దిల్ రాజు ఆద్వర్యంలోనే పాగల్ సైతం రానుంది. దిల్ రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మించారు. నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ కి సంగీతాన్ని రథన్ అందిస్తున్నారు.

Source: Dil Raju