మెగా బ్రదర్ నాగబాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా విలన్ పాత్రతో. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనే ప్రతినాయకుడిగా నాగబాటు నటిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో షూట్ లోని కొన్ని ఫోటోలు సైతం బయటికొచ్చాయి. అతిత్వరలో అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావచ్చు.

మెగాడాటర్‌ నిహారిక కొణిదెల నటించబోతున్న కొత్త వెబ్‌ సిరీస్‌ తాజాగా ప్రారంభమైంది. ‘రాయుడు చిత్రాలు’ అన్న బ్యానర్‌పై భాను రాయుడు దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. యూ ట్యూబ్ ఫేం నిఖిల్‌ విజయేంద్ర ఇందులో మరో పాత్రలో కనిపించనున్నాడు. హాట్ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ పూజా కార్యక్రమాన్ని నూతన దంపతులు నిహారిక , చైతన్య… జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ముఖ్య అతిథులు స్టార్‌ రైటర్‌ విజయేందప్రసాద్‌, డైరెక్టర్ వి.వి.వినాయక్‌ దర్శక నిర్మాత భాను రాయుడుకి స్ట్రిప్ట్‌ అందించంగా… యువ నిర్మాత హర్షిత్‌ రెడ్డి బ్యానర్ లోగోను విడుదల చేసారు.