ప్రభాస్ ఆదిపురుష్ గురించి వార్త రాని రోజంటూ లేకుండా పోయింది. రామునిగా ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాలో సీతగా కృతిసనన్ అనీ, కీర్తి సురేశ్ అని రోజుకో ప్రచారం జరుగుతుంది. తాజాగా లక్ష్మణుడి గురించి అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ ఫేం విక్కీ కౌశల్ ప్రభాస్ తమ్మునిగా కనిపిస్తాడని అంటున్నారు. ఉరి..ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో మంచిపేరు తెచ్చుకున్నాడు విక్కీ. ప్రస్తుతం అశ్వద్ధామ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. కాగా ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా దాదాపు ఫిక్సయినట్టే అంటున్నారు. అంతకుముందు ఆదిపురుష్ కి సంబంధించి లక్ష్మణుడి పాత్రలో టైగర్ ష్రాఫ్ నటిస్తాడనే రూమర్ చక్కర్లు కొట్టింది.

బి టౌన్ స్టార్ హృతిక్ రోషన్, ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే వార్త జోరందుకుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాల దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ వీరిద్దరి కలయికలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వార్ తెరకెక్కించిన సిద్ధార్ధ్…ఇప్పుడు ప్రభాస్, హృతిక్ లను ఒకే ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాదు వీరిద్దరి మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను యష్ రాజ్ సంస్థ నిర్మించనుంది.

పులి అంటే టైగర్…అవును ఏజెంట్ టైగర్ గా కనిపించేందుకు సిద్ధమవుతున్ను సల్మాన్ ఖాన్. గతంలో ఆయన నటించిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కాగా తాజాగా మరోసారి టైగర్ అవతారం ఎత్తుతున్నారు. దుబాయ్ వేదికగా మార్చి నెలలో ప్రారంభంకానుందీ ప్రాజెక్ట్. డైరెక్టర్ మనీశ్ శర్మ డైరెక్ట్ చేస్తుండగా…యశ్ రాజ్ సంస్థ నిర్మించనుంది. పొడుగు కాళ్ల సుందరి కత్రినా కైఫ్ మరోసారి సల్మాన్ సరసన నటించబోతుంది. తొలి రెండు సినిమాల కంటే భారీ బడ్జెట్ తో ఈ కొత్త చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రారంభ షూటింగ్ లోనే యాక్షన్ సన్నివేషాలని షూట్ చేయాలనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను 2022 రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.