2021 సినిమా క్యాలెండర్లో అప్పుడే 3నెలలు గడిచిపోయాయి. లవ్ స్టోరీస్, స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్, ఫుల్ లెంత్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఇలా క్రేజీ జోనర్స్ లోనే టాలీవుడ్ సినిమాలొచ్చాయి. కానీ కొన్నే సూపర్ హిట్ గా నిలిస్తే…చాలామంది దర్శకనిర్మాతలకు నిరాశే మిగిలింది. ఈ 3 మంత్స్ మూవీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది…ఓసారి చెక్ చేద్దాం.

2021 ఫస్ట్ క్వార్టర్ ముగిసింది. కోవిడ్ పాండెమిక్ తర్వాత సంక్రాంతికి మొదలైన టాలీవుడ్ జోరు…మిగిలిన ఇండస్ట్రీలకు షాక్ ఇచ్చింది. సినిమా నచ్చితే చాలు…కరోనాను కూడా కేర్ చేయలేదు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేని సందడి టాలీవుడ్ లో కనిపించింది. జనవరి 9న సంక్రాంతి సీజన్ మాస్ రాజా క్రాక్ తో మొదలైంది. బయటికి రావాలంటేనే బిక్కుబిక్కుమన్న జనం క్రాక్ థియేటర్స్ లో రచ్చ చేసారు. క్రాక్ పాజిటివ్ టాక్ తో 2021 తొలి కమర్షియల్ హిట్ అందుకున్నారు రవితేజ.

krack movie, krack movie 2021

క్రాక్ తర్వాత జనవరిలో రిలీజైన ఏ సినిమా కూడా అనుకున్నంత బాగా ఆడలేదు. విజయ్ ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చే మాస్టర్ ను తెలుగులో ఆదరించలేదు ఆడియెన్స్. ఎంతో హైప్ క్రియేట్ చేసి జనవరి 14న విడుదలైన బెల్లంకొండ అల్లుడు అదుర్స్ అంచనాలను అందుకోలేదు. దేవీశ్రీ ప్రసాద్, ఛోటా కే నాయుడు వంటి సెన్సేషన్స్ ఉన్నా…డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఎంచుకున్న కథే మైనస్ కావడంతో సంక్రాంతి అల్లుడు పందెంలో గెలువలేకపోయాడు.

Master Vijay, vijay sethupathi, master

జనవరి 14న అల్లుడితో పోటీపడుతూ రెడ్ తో దిగాడు రామ్. అది కూడా డ్యూయర్ రోల్ లో. కానీ రామ్ రెడ్ సైతం సంక్రాంతి హిట్ అనిపించుకోలేదు. రామ్ నటన బాగున్నా అనేక కారణాలతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు రెడ్ మూవీ. జనవరి 23న బంగారు బుల్లోడు, 29న మిస్టర్ అండ్ మిస్, 30రోజుల్లో ప్రేమించడం ఎలా, సునీల్ జై సేన…ఇలా సినిమాలు వచ్చినచ్చే వచ్చి పోయాయి. అయితే యాంకర్ ప్రదీప్ 30రోజుల్లో ప్రేమించడం ఎలా ఓపెనింగ్ పర్వాలేదనిపించినా..,లాంగ్ రన్ లో ఏమాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

30 rojullo Preminchatam ela release,30 rojullo Preminchatam ela latest update,ahachitram,Pradeep Machiraju,Amritha Aiyer latestnews

2021 ఫిబ్రవరి సీజన్ లీడ్ జాంబిరెడ్డి తీసుకున్నాడు. తెలుగు తెరకు జాంబీలను తీసుకురావడమే కాదు వాటితో కామెడిని క్రియేట్ చేసి హిట్ కొట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఫిబ్రవరి 12న రిలీజైన బోల్డ్ డ్రామా ఎఫ్ సియుకే, కన్నడ డబ్బింగ్ పొగరు ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా…

Zombie Reddy collections

ఉప్పెన ఎవర్ గ్రీన్ సక్సెస్ క్యాచ్ చేసింది. ఈ సినిమాతోనే డెబ్యూ ఇచ్చిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి, బుచ్చిబాబుల కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ ముగ్గురికి తోడు విజయ్ సేతుపతి కలవడంతో ఊహించని గ్రాండ్ సక్సెస్ ఉప్పెన సొంతమైంది.

uppena movie latest news,ahachitram,Krithi Shetty latest movie updates

ఫిబ్రవరి థర్డ్ వీక్ లో థియేటర్స్ కొచ్చాయి సుమత్ కపటధారి, విశాల్ చక్ర, నరేశ్ నాంది సినిమాలు. వీటిలో నాంది మాత్రమే హిట్ కొట్టింది. ఎమోషనల్ డ్రామాను ఆకట్టుకునేలా రాసుకున్న డైరెక్టర్ విజయ్ కనకమేడలకు… అల్లరి నరేశ్ నటన తోడై మంచి చిత్రంగా పేరుతెచ్చుకుంది. అయితే అప్పటికింకా ఉప్పెన జోరు తగ్గకపోవడంతో నాంది అందరికీ రీచ్ కాలేకపోయింది. ఫిబ్రవరి ఎండింగ్ లో క్షణక్షణం, అక్షర, నితిన్ చెక్ సినిమాలు విడుదలయ్యాయి. స్పోర్ట్ అండ్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ తో చెక్ సినిమా డిఫరెంట్ గా కనిపించినా నితిన్ కెరీర్ కు ఏమాత్రం హెల్ప్ కాలేదు.

Allari Naresh Naandhi Movie on Aha

మార్చ్ ఫస్ట్ వీక్… ప్లే బ్యాక్, రాజ్ తరుణ్ పవర్ ప్లే, సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్, షాదీ ముబారక్ సినిమాలొచ్చాయి. అన్నీ డిఫరెంట్ పంథాలో సాగినవే. టాక్ బాగున్నా ఏదీ కమర్షియల్ హిట్ అనిపించుకోలేదు. మంచి అంచనాల మధ్య మార్చి సెకండ్ వీక్ మొదలైంది. గాలి సంపత్, శ్రీకారం, జాతిరత్నాలు రిలీజయ్యాయి. జాతిరత్నాలు హ్యూజ్ సక్సెస్ సాధిస్తే…శ్రీకారం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాతి వారాల్లో శశి, మోసగాళ్లు, చావు కబురు చల్లగా, అరణ్య, రంగ్ దే, తెల్లవారితే గురువారం బరిలో నిలిచాయి. వీటిలో రంగ్ దే, అరణ్య మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా..మిగిలినవి దర్శకనిర్మాతలకు నిరాశనే మిగిల్చాయి.

jathi ratnalu movie review, jathi athnalu huze response naveen polishetty, rahul rama krishna, priya darshi, Aha Chitram

మొత్తంగా చూసుకుంటే నెలకి ఒక సినిమా అన్నట్టు జనవరిలో క్రాక్, ఫిబ్రవరిలో ఉప్పెన, మార్చిలో జాతిరత్నాలు థియేటర్స్ ని వాష్ అవుట్ చేసాయి. క్రాక్ గ్రాస్ బిజినెస్ దాదాపు 61 కోట్ల రూపాయలు చేయగా 19కోట్ల లాభాన్ని చూసింది. ఉప్పెన 85కోట్ల రూపాయల గ్రాస్ బిజినెస్ తో 31కోట్ల వరకు ప్రాఫిట్ అందుకుంటే…జాతిరత్నాలు 62కోట్ల రూపాయల గ్రాస్ బిజినెస్ తో ఇప్పటివరకు 21కోట్ల రూపాయల ప్రాఫిట్ తో దూసుకుపోతుంది.

జాంబిరెడ్డి – 2 అతిత్వరలో పట్టాలెక్కబోతుందని ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ‘జాంబిరెడ్డి’ ఫిబ్రవరి 5న థియేటర్లలో రిలీజై సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సీక్వెల్ గా ‘జాంబిరెడ్డి2’ రాబోతోంది. ఈ హాట్ న్యూస్ ను మూవీ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ స్వయంగా అనౌన్స్ చేసారు. ఆహా ఓటీటీ వేదికగా మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా జాంబిరెడ్డి యూనిట్ విజయవాడ ప్రేక్షకులను కలిసారు. ఆ సమయంలోనే జాంబిరెడ్డి 2 గురించి మాట్లాడారు.

అయితే జాంబిరెడ్డి హిట్టైతే జాంబిరెడ్డి 2లో తాను నటిస్తానని సమంతా చెప్పినట్టు…ఓ సందర్భంలో వెల్లడించాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్న ప్రశాంత్…ఆల్రెడీ సామ్ కు కథను వినిపించాడట. ఇప్పుడెలాగూ 15కోట్లు వసూలు చేసి లాభాల బాటలో నిలిచింది జాంబిరెడ్డి. సో జాంబిరెడ్డి 2లో నటించేందుకు సామ్ ఒప్పుకునే ఛాన్స్ ఉందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం శాకుంతలం చేస్తోన్న సామ్..మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

ఇలా మొదలైంది

కరోనా లాక్ డౌన్ వేళ చాలామంది వంటలు, కసరత్తులు చేస్తూ కూర్చుంటే…కరోనానే ఎయిమ్ గా చేసుకొని జాంబిరెడ్డి సినిమాను ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అనౌన్స్ అయితే చేసాడు కానీ ఎలా మొదలైందో, ఎక్కడ షూటింగ్ చేసాడో మొత్తానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. క్రాక్ మినహా అన్ని సినిమాలు నిరాశపరచడంతో మంచి కాన్సెప్ట్ మూవీ కోసం ఎదురుచూస్తున్న జనంకోసం నేనున్నానంటూ వచ్చేసాడు జాంబిరెడ్డి. హాలీవుడ్ పాపులర్ కాన్సెప్ట్ జాంబీ కథాంశానికి కామెడీ టచ్ ఇచ్చి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏదో మ్యాజిక్ చేసాడన్న విషయం ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. అందుకే చైల్డ్ ఆర్టిస్త్ తేజా సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాపై తెలియకుండానే అంచనాలు పెరిగాయి.

ఇదీ కథ

వీడియో గేమ్స్ అంటే పడిచచ్చే హీరో తనకిష్టమైన ఆట పేరునే తనపేరుగా మార్చుకుంటాడు. ఫ్రెండ్స్ తో కలిసి గేమింగ్ లో ప్రయోగాలు చేస్తూ ఎప్పటికైనా గొప్పవాడిగా ఎదగాలని పరితపిస్తుంటాడు. అనుకోని కొన్ని సంఘటనల వల్ల హీరో ఒక ఊరికి వెళ్తాడు అసలు ఎందుకు హీరో ఆ ఊరికి వెళ్తాడు. వెళ్ళాక ఆ ఊర్లో జరిగిన సంఘటనలు ఏంటి ? పగ ప్రతికరాలతో నిత్యం కొట్టుకునే ఆ ఊరి జనం అనుకోకుండా వచ్చిన జోంబీ ల ప్రమాదం నుంచీ ఎలా తప్పించుకుంటారు చివరికి ఏం జరుగుతుంది ?హీరో చివరికి ఎం చేస్తాడు అనె ఆసక్తి కరమైన కథనం తొ ఈ కధ ముగుస్తుంది

ఇదీ నటన

చైల్డ్ ఆర్టిస్ట్ గా మెగాస్టార్ నుంచి సూపర్ స్టార్ వరకు దాదాపు అందరితో వరుసపెట్టి సినిమాలు చేసిన తేజా సజ్జలో హీరో మెటిరీయల్ ఉంది. ఓ బేబీ సినిమాతోనే వెండితెరకు డెబ్యూ ఇచ్చినప్పటికీ…ఆ మూవీని సమంతా స్టీల్ చేయడంతో సోలో హీరోగా తేజకు ఈ జాంబీ రెడ్డినే మొదటి చిత్రంగా చెప్పుకోవాలి. లుక్స్ పరంగా ఇంకా కుర్రతనమే కనిపిస్తోన్న తేజ సజ్జ ముందుముందు నటన పరంగా మెప్పించే అంశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమావరకైతే వంకబెట్టకుండా లాగించేసాడు. దక్ష నగార్కర్ కొద్ది సేపే కనిపిస్తుంది. బట్ బాగుంది. ఇక అందం, టాలెంట్ అన్నీఉన్నా తెలుగులో అవకాశాలు లేని ఆనంది తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తానేంటో నిరూపించుకుంది. రఘుబాబు, పృథ్వి, మహేశ్ విట్టా, అదుర్స్ రఘు, వినయ్ వర్మ, హరితేజ, కిరీటి తదితరులు ఎవరి పాత్రలను వారు బాగానే రక్తికట్టించారు. అందరికంటే అన్నపూర్ణమ్మ, గెటప్ శీను గుర్తుండిపోయేలా ఇరగదీసారు.

ఇదీ డైరెక్షన్

అ, కల్కి చిత్రాలతోనే తన అభిరుచేంటో నిరూపించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. రెగ్యూలర్ జోనర్ లో తన ఆలోచనలు ఇమడవు. కొత్తదనాన్ని కోరుకుంటాడు. అందుకే ఓ రకంగా జాంబీరెడ్డితో ఓ రకంగా రిస్క్ తీసుకొన్నాడు. హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవాళ్లకు తప్ప ఈ జాంబీ కాన్సెప్ట్ అనేది పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ పరిచయమున్న జాంబీలంటే థ్రిల్లర్, హారర్ జోనర్ గానే చాలామందికి తెలుసు. అందుకు విభిన్నంగా భయపెడుతూనే జాంబీలతో కామెడీ రాబట్టే ప్రయత్నం చేసాడు ప్రశాంత్ వర్మ. చాలావరకు సక్సెస్ అయ్యాడు కూడా.

మరీ ముఖ్యంగా ఇలాంటి కథలతో సౌత్ ప్రేక్షకులను థియేటర్స్ కు తీసుకురావడం కష్టం. కష్టపడి తీసుకొచ్చాక వాళ్లని సీటు కదలకుండా కట్టిపడేయాలి. ఇక్కడే కొంచెం టైం తీసుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఫస్ట్ హాఫ్ ను చాలా స్లోగా రాసుకున్న డైరెక్టర్…ఆసలైన కథకు ఇంట్రెవల్ వరకు వెయిట్ చేయించాడు. మొదటి భాగాన్ని కూడా స్పీడ్ రికవరీ ఇచ్చుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యుండేది. అయితే సెకండాఫ్ మొదలయ్యాక మాత్రం ప్రేక్షకుడికి ఆ లోటు కనిపించదు. అయితే వైరస్ వచ్చేందుకు సైంటిఫిక్ గా మంచి రీజన్ రాసుకున్న ప్రశాంత్ దాని ఎండ్ చేయడానికి మాత్రం సింపుల్ మార్గాన్ని ఎంచుకున్నాడా అనిపిస్తుంది. మంచి థ్రిల్లింగ్ అంశాలు , కామెడీని కలగలపి ఫైనల్ గా థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు మాత్రం బాగుంది అనుకుంటారు

ఇదీ మిగిలింది

సినిమాటోగ్రఫర్ కష్టం చాలావరకు కనిపించింది. అనిత్ అందించిన సినిమాటోగ్రఫీ జాంబీరెడ్డికి ప్లస్ అయింది. పాటలతో పెద్దగా పనిలేదు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా సౌండ్ అతి అనిపించినా ఓవరాల్ గా వంకపెట్టలేం. ఎడిటర్ సాయి బాబు బాగానే కత్తెరపెట్టాడు. రియాలిటీకి దగ్గరగా ఆర్ట్ డైరెక్టర్ పనితనాన్ని మెచ్చుకోవాలి. సయ్యిద్ తాజుద్దీన్ డైలాగ్స్ ఓకే. బడ్జెట్ పరంగా లోపంలేకుండా ఆపిల్ ట్రీ సంస్థ అందించిన నిర్మాణ విలువలు కనిపిస్తాయి.

కలిసొచ్చే అంశాలు
కథ
నటీనటులు
సెకండ్ హాఫ్
కామెడీ

కలిసి రానివి
పాటలు
ఫస్ట్ పార్ట్ సాగతీత
మిస్సైన లాజిక్స్

తీర్పు
టైం ఉంటే ఒకసారి చూసేయండి

what’s your rating on Zombie Reddy Movie

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 3.50 out of 5)
Loading...

ఇప్పుడు జాంబిరెడ్డి ట్రైలర్ చూస్తుంటే గుర్తొస్తుంది. ఎప్పుడో 2012లో ‘బస్ స్టాప్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఆనంది…మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు తెరపై కనిపించబోతున్నారు. జాంబిరెడ్డి చిత్రంతో తెలుగమ్మాయి…తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తెలుగమ్మాయి…తెలంగాణ అమ్మాయి…వరంగల్ అమ్మాయికి తెలుగులోనే అవకాశాలు దొరకలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీని నమ్ముకున్నారు. అందుకు తగ్గట్టే అక్కడ అడపదడపా సినిమాలు చేస్తూ ‘పరియేరూం పెరుమాళ్’ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మొత్తానికి ప్రశాంత్ వర్మ ద్వారా మరోసారి తెలుగువారి ముందుకు జాంబిరెడ్డి ద్వారా వస్తున్నారు. చూద్దాం ఈ సినిమాతో అయినా ఆనంది ఫేట్ మారుతుందేమో….

శ్రీదివ్య…సేమ్ ఆనంది స్టోరీనే. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ తో ఎంట్రీ ఇచ్చిన శ్రీదివ్య… ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ చిత్రంతో నటిగా తానేంటో నిరూపించుకున్నారు. హీరోయిన్ గా మనసారా, బస్ స్టాప్, కేరింత సినిమాలో హీరోయిన్ గా నటించారు. అయితే ఆ తర్వాత ఎవ్వరూ శ్రీదివ్య గురించి పట్టించుకోలేదు. తమిళ్ ఇండస్ట్రీని నమ్ముకున్నారు. వరుస అవకాశాలను అందుకున్నారు. మినిమం గ్యారంటీ హీరోల సరసన సినిమాలు చేస్తూ మంచి నటిగా పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘జనగనమణ’ అనే మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. మరి ఇప్పటికైనా టాలీవుడ్ శ్రీదివ్యను గుర్తిస్తుందా…చూడాలి.