పెళ్లిసందడికి జనవరి 12తో పాతికేళ్లు నిండాయి. శ్రీకాంత్, దీప్తిభట్నాగర్, రవళి ముఖ్యపాత్రల్లో నటించగా బోలెడుమంది ఆర్టిస్టులతో తెరకెక్కిన పెళ్లిసందడి 1996లో రిలీజైంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్ గా నిలవడం విశేషం. ఇక ఈ సినిమాకు 25వసంతాలు పూర్తైన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు రాఘవేంద్రరావు. చరిత్రలో నిలిచేలా చేసేలా ప్రేక్షకులకు, కీరవాణికి, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, జగదీశ్ ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలియజేసారు.


శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న పెళ్లిసందD గురించి న్యూ అప్ డేట్ ఇచ్చారు. ఈ పాతికేళ్ల పెళ్లిసందడి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి రోషన్ తో సీక్వెల్ చేస్తున్నాము. ఇందులో హీరోయిన్ గా శ్రీలీల నటించనుందని వెల్లడించారు. దర్శకేంద్రుడి పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని. అయితే నిన్నటివరకు ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరన్నదిదానిలో క్లారిటీ లేదు. ఇప్పుడు శ్రీలీల హీరోయిన్ అని ప్రకటించారు. కిస్ అనే కన్నడ సినిమాలో నటించింది శ్రీలీల. ఆ మూవీ రిలీజ్ అవకుండానే శ్రీమురళి హీరోగా నటిస్తున్న భారతేలో ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పుడిక ఏకంగా పెళ్లిసందDలో హీరోయిన్ అనిపించుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *