2020లో మిస్ అయిన సినిమాలన్నీ 2021 లో వరుసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఫెస్టివల్స్ దగ్గరనుంచి వీకెండ్స్ అన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. డేట్ ఫిక్స్ చేస్కోవడంలో ఒకరితో ఒకరు పోటీపడుతుండటంతో ఎప్పుడూ లేనంతగా బాలీవుడ్, టాలీవుడ్ మధ్య క్లాష్ నెలకొంది.
ఆర్‌ఆర్‌ఆర్‌ – మైదాన్‌
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో వస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్‌ 13వ తేదీన రిలీజ్ చేసున్నట్టు ప్రకటించారు మేకర్స్. సేమ్ దసరా సీజన్ అక్టోబర్ 15న అజయ్‌ దేవగణ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన హిందీ స్పోర్ట్స్‌ డ్రామా ‘మైదాన్‌’ కూడా విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ఈ మూవీ ప్రొడ్యూసర్ బోనీ కపూర్…రాజమౌళిపై మాటల తూటాలు పేల్చిన విషయం తెలిసిందే. మేము ముందుగా ప్రకటించినా కూడా రాజమౌళి మాకు పోటిగా రావడం సరైనది కాదంటూ వాపోయారు బోనీ కపూర్. అయితే పోటీలో ఉన్న రెండు చిత్రాల్లోనూ అజయ్ దేవగణ్ కనిపించనుండటం విశేషం.

రాధే శ్యామ్‌ – గని – గంగూబాయి
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, పూజాహెగ్దే జంటగా నటిస్తోన్న పీరియాడికల్‌ ప్రేమకథాచిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని జూలై 30న విడుదల చేయనున్నారు. ఇదే రోజున వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తోన్న గని కూడా రిలీజ్ కి రెడీఅయింది. అయితే అనూహ్యంగా తెరపైకి రాధేశ్యామ్ రావడంతో డైలమాలో పడింది గని టీమ్. ఇక ఇప్పుడు అదే తేదీని లాక్ చేసింది ఆలియా భట్‌. ఆమె లీడ్ రోల్ లో నటించిన ‘గంగూబాయి కతియావాడి’ని జూలై 30వ తేదీనే రిలీజ్‌ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు మేకర్స్. వేశ్య పాత్రలో ఆలియా నటించగా… సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పుష్ప – అటాక్
‘పుష్ప’…బన్నీ తొలి ప్యాన్‌ ఇండియన్‌ మూవీ. లెక్కల మాస్టారు సుకుమార్‌ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను ఇండిపెండెన్స్‌ వీక్‌కి ఫిక్స్ చేసారు. ఆగస్ట్‌ 12న రిలీజ్ చేస్తున్నట్టు చెప్పేసారు. బాలీవుడ్ చిత్రాలకు కూడా ఇండిపెండెన్స్‌ వీక్‌ కీలకమైనదే. జాన్‌ అబ్రహామ్‌ కూడా అదే సమయానికి వచ్చేస్తా అంటున్నాడు. తన రీసెంట్ మూవీ ‘అటాక్‌’ని ఆగస్ట్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు.

Pushpa Vs Attack Independence Day Clash: Who Has The Upper Hand?

భూత్ పోలీస్ – కరణ్ జోహార్ – మేజర్

ఇవే కాదు సెప్టెంబర్ 9న పూరీ – విజయ్ దేవరకొండ కాంబో మూవీ లైగర్ రానుంది. పాన్ ఇండియా వైడ్ ఇది రిలీజ్ కానుంది. కరణ్ జోహార్ – ఛార్మీ జంటగా నిర్మించారు. దాని తర్వాతి రోజును బుక్ చేసుకుంది భూత్ పోలీస్. సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ కాంబినేషలో వస్తోన్న భూత్ పోలీస్ సెప్టెంబరు 10న విడుదలకు రెడీఅయింది. ముంబై తాజ్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు విడిచిన మేజర్‌ ఉన్నికృష్ణన్‌ బయోగ్రఫీ చిత్రం ‘మేజర్‌’. స్క్రిప్ట్ అందించి, టైటిల్‌ రోల్‌ పోషించాడు అడివి శేష్‌. ఈ సినిమా జూన్‌ 2న రిలీజ్ కానుండగా… అదే రోజున సిద్ధార్థ్‌ మల్హోత్రా ‘షేర్‌షా’తో రంగంలోకి దిగనున్నాడు. ఆర్మీ కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్‌ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా…కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. మేజర్, షేర్‌షా.. ఈ రెండూ కూడా బయోగ్రఫీ చిత్రాలే కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *